మూవీ పేరు : ‘ఢమరుకం’
విడుదల తేదీ : 23.11.2012.
దర్శకత్వం : శ్రీనివాస్ రెడ్డి
కథ: వెలిగొండ శ్రీనివాస్
కెమెరా: చోటా కె.నాయుడు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సహ నిర్మాత: వి.సురేష్‌రెడ్డి
సమర్పణ: కె.అచ్చిరెడ్డి
తెలుగువిశేష్.కాం రేటింగ్ : 3.00
పరిచయం :
దీపావళికి వెండితెరమీదకి రావాల్సిన కింగ్ నాగార్జున ఢమరుకం మూవీ ఎన్నో వ్యయప్రయాసలు, వాయిదాలతో మొత్తానికి ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రేజీ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి తో సహా ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ మూవీ చూడటం కోసం ప్రసాద్స్ ఈ ఉదయాన్నే విచ్చేశారు. 20 కోట్ల భారీ నష్టంతో విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం...

కథ :
‘ఢమరుకం’ కథ పాత తరహా లోనిదే. దేవతలు చేసిన రాక్షస సంహారంలో మిగిలిపోయిన ఒకే ఒక్కడు ఈ సినిమా విలన్ అంధకాసుర(రవిశంకర్). దానికి ప్రతీకారం తీర్చుకునే క్రమంలో సర్వశక్తులు ఆర్జించేందుకు అంధ కుటిల యత్నాలు చేస్తుంటాడు. దేవకన్యైన అనుష్కను పెళ్లాడి అనంతరం ఆమెను బలి ఇచ్చి అతీత శక్తులు పొందాలని పన్నాగాలు పన్నుతుంటాడు. అందుకోసం అనుష్క బావ(వెంకట్రామన్) ను చంపి అతనిలో ప్రవేశించి అనుష్కను లొంగతీసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. వీటిని దైవాంశ ఉన్న మల్లిఖార్జున్(నాగ్) ఎలా పటాపంచలు చేశాడు, ఈ లక్ష్యంలో మల్లి ఎదుర్కొన్న కష్టాలు తదితర ఘట్టాలే ఈ చిత్రం క్లుప్తంగా. ధర్మో.. రక్షితి.. రక్షితహ’.. చివరిగా మనకు ఈ మూవీలో కనిపించే నిఘూడార్థం.. మహాశివుడు, మహావీరుడు, మహామాంత్రికుడు... ఈ ముగ్గురి నేపథ్యంలో సాగే సినిమా ఇది. చెడు మీద మంచి సాగించిన పోరాటం, చివరికి దైవ సాయంతో, మంచి ఎలా గెలిచిందనేది సూపర్బ్ అండ్ వండర్ గ్రాఫిక్స్ తో తెరకెక్కించారు.

కథనం నడిచిన తీరు :
మన చారిత్రాత్మక, పురాణాల గురించి చెబుతూ సూపర్బ్ యానిమేషన్ టైటిల్స్ తో సినిమా మొదలౌతుంది. అరివీరభయంకరుడిలా కనిపిస్తూ మొదటగా విలన్ అంధకాసుర ఎంట్రీ. గతంలో జరిగిన పరిణామాల గురించి చెప్పి ప్రస్తుత కాలంలోకి సినిమా వస్తుంది. మహేశ్వరిగా దైవశ్లోకాల మధ్య తెరపైకి అనుష్క. మైండ్ బ్లోయింగ్ యూత్ ఫుల్ అప్పీరెన్స్ తో మల్లి పేరిట నాగార్జున రాకింగ్ ఎంట్రీ. ఆదిలోనే పోలీసులకి మల్లికి మధ్య చేజ్ సీక్వెన్స్ అదిరిపోయింది. కుర్రకారుకి పిచ్చెక్కించేలా సూపర్ హిట్ సాంగ్ 'సక్కుభాయ్ గరం చాయ్' పాటలో చార్మీ అదుర్స్ అనిపించింది.
ఇక కమెడియన్స్ అంతా ఒక్కసారిగి తెరపైకి దండెత్తివచ్చారు. బ్రహ్మానందం, ఎం.ఎస్ నారాయణ, కృష్ణ భగవాన్, రఘు బాబులు ఎంట్రీ నవ్వులు కురిపించింది. ప్రకాష్ రాజ్ వాయిస్ తో లార్డ్ శివ గా మెరుస్తాడు. కృష్ణ భగవాన్ కామెడీ టైమింగ్ 'ఒంటెలు ఎడారిలోనే ఉండాలి' లాంటి డైలాగ్స్ థియేటర్లో కేకలు పెట్టించాయి. అనంతరం మొత్తం సెట్లో షూట్ చేసిన 'కన్యా కుమారి' పాట. తర్వాత అఘోరాలకి, నాగార్జున మధ్య ఒక భారీ ఫైట్ తో ఇంట్రవల్.
దాదాపు ఫస్ట్ హాఫ్ అంతా చాలావరకూ కామెడీగ సాగుతూ ఇంట్రవల్ ముందు వచ్చిన సీన్స్ తో అసలు కథ మొదలైంది. ఈ క్రమంలో అందమైన లొకేషన్లలో షూట్ చేసిన రొమాంటిక్ మెలోడీ 'నేస్తమా నేస్తమా' పాట. ఇక కథలో కీలకమైన మంచికి - చెడుకి మధ్య ఒక చారిత్రిక యుద్ధం తెరపైకి వచ్చింది. ఇంకో వైపు గాఢంగా నాగ్ - అనుష్క మధ్య రొమాంటిక్ ట్రాక్ లో భాగంగా 'రెప్పలపై రెప్పలపై' సాంగ్ బావుంది. స్పెషల్ ఎఫెక్ట్స్ తో రూపొందించిన నంది సీన్స్ ఔరా.. అనిపించాయి. క్లైమాక్స్ ఫైట్.. రాక్షసుడు అంధకాసుర వధ ఘట్టం. ధర్మో రక్షితి రక్షితహా.. తో శుభం కార్డు.

విశ్లేషణ :
చందమామ కథను పోలిన ఈ సినిమాని తెరకెక్కించటంలో దర్శకుడి ప్రతిభ చాలా ముఖ్యం. అది ఈ మూవీలో కొరవడింది. ఇప్పటి వరకూ చిన్న సినిమాలనే హ్యాండిల్ చేసిన శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ స్టఫ్ ఎలివేట్ కావాల్సిన కీలక సన్నివేశాల్లో చేతులెత్తేశాడు. గ్రాఫిక్స్ మీదే భారం వేసాడు. స్ర్కీన్ ప్లే లోటుపాట్లు కళ్లకు కడతాయి. 53 ఏళ్లు పైబడినా నాగ్ యంగ్ బాయ్ లాగే కనిపించి అబ్బురపరిచాడు. డర్టీ పిక్చర్ చూసిస్తానురోయ్ అనే కింగ్ డైలాగ్ పేలింది. అనుష్క నటన పరిధి తక్కువయినా ఓకే అనిపించింది.ఇక ఎలాంటి క్యారక్టర్ లో అయినా జీవించగల ప్రకాష్ రాజ్ శివునిగా అస్సలు సూట్ కాలేదు. ఇప్పటివరకూ డబ్బింగ్స్ కే పరిమితమైన సాయికుమార్ తమ్మడు రవిశంకర్ కు ఈ సినిమా మరిచిపోలేనిది. అనుష్క బావాగా చేసిన గణేష్ వెంకట్రామన్ నటన బావుంది. కెమెరా పనితనం ఫర్వాలేదు. దేవీ సంగీతం మూవీకి హైలెట్. గ్రాఫిక్స్ రక్తికట్టించాయి.
ఉపసంహారం :
సినిమా ఆధ్యంతం చిన్న చిన్న లోటుపాట్లు కనిపించినప్పటికీ చివరకు ఓకే.. బానేవుందనిపిస్తుంది ఢమరుకం సౌండ్
. ...avnk
No comments:
Post a Comment