గోపాల్ రావు (వెంకటేష్) దైవ భక్తి లేని వ్యక్తి. అయితే దేవుడి విగ్రహాలు అమ్మే షాపును నిర్వహిస్తుంటాడు. ఒక భార్య ఇద్దరు పిల్లలతో చిన్న, మద్యతరగతి కుటుంబం. కుటుంబం, వ్యాపారం జీవితంగా ఉన్న గోపాల్ రావు ఓ రోజు దేవుడిపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తాడు. అకస్మాత్తుగా భూకంపం వచ్చి గోపాల్ రావు షాపు కూలిపోతుంది. నష్ట నివారణ కోసం ఇన్సూరెన్స్ కంపనీని సంప్రదిస్తే అక్కడ నిరాశ ఎదురవుతుంది. ఇన్సూరెన్స్ కంపనీ ప్రతినిధి దేవుడి చర్యలకు క్లయిమ్ రాదని చెప్పటంతో.., గోపాల్ రావు దేవుడిపై కోర్టులో పిటిషన్ వేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, గోపాల్ రావుకు న్యాయం జరిగిందా లేదా అనే విషయాలు తెలియాలంటే థియేటర్ కు వెళ్లి సినిమా చూడండి.
పవన్ కళ్యాణ్, వెంకటేష్ నటించిన మల్టీ స్టారర్ మూవీ ‘గోపాల గోపాల’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ‘అత్తారింటికి దారేది’ తర్వాత పవన్ సినిమా లేకపోవటంతో ఈ మూవీ కోసం పవర్ ష్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు. పవన్ రోల్ తక్కువగా ఉన్నా.. ఆయన పేరుమీదే ఎక్కువగా ప్రమోషన్ జరిగింది. ‘ఓ మై గాడ్’ హిందీ మూవీకి రీమేక్ గా ‘గోపాల గోపాల’ను కిశోర్ పార్థసాని డైరెక్ట్ చేశాడు. సురేష్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
వెంకటేష్, శ్రియ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. మూడు పాటలే ఉన్నా... అన్నీ సూపర్ హిట్ కావటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి రేసులో చాలా సినిమాలను దాటుకుని వచ్చిన ఏకైక తెలుగు సినిమా ఇదే. సెన్సార్ బోర్డు ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
For Full Movie Review Click On This Link
For Telugu Latest Movie News, Gossips and Review Click Here
No comments:
Post a Comment