Showing posts with label Ram Charan follows Rajinikanth. Show all posts
Showing posts with label Ram Charan follows Rajinikanth. Show all posts

Friday, 3 May 2013

Ram Charan Cannes Film Festival

Ram Charan Cannes Film Festival.png

సుడి తిరిగితే... రాత్రి రాత్రే పెద్ద స్టార్లు కావచ్చు... ఇంకేదైనా కావచ్చు. ఇప్పుడు అచ్చం అలాగే జరిగింది. రామ్ చరణ్ తేజ్ తొలిసారిగా బాలీవుడ్ లో నటిస్తున్న ‘జంజీర్ ’ చిత్రం త్వరలో జరగబోయే విఖ్యాత కేన్స్ చిత్రోత్సవంలో ప్రదర్శించడానికి నిర్మాతలు ఉవ్విళ్ళూరుతున్నారు. అలాగే అందులో మన రామ్ చరణ్ తేజ్ కూడా ఎర్ర తివాచీ పై నడవబోతున్నాడని సినిమా వర్గాల సమాచారం. ఈ సినిమా క్షణంలో మొదలు పెట్టారో కానీ అన్ని అవాంతరాలే ఏర్పడుతున్నాయి. అయినా కానీ నిర్మాతలు పబ్లిసిటీ విషయంలో రాజీపడటం లేదు.

మొత్తానికి చరణ్ కేన్స్ చిత్రంలో సందడి చేయనున్నాడన్న మాట. ఇక ఇదే కేన్స్ చిత్రోత్సంలో ప్రముఖ నిర్మాత అయిన అశ్వినిదత్ కుమార్తె ప్రియాంక దత్ కూడా ఈ ఫెస్టివెకు హాజరు కాబోతుంది. తాను నిర్మించిన లఘుచిత్రం 'యాదోంకీ బారత్' కూడా ఈ  ఉత్సవానికి ఎంపికైంది. దీంతో ఈ అమ్మడు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలాగే సారి కేన్స్ లో మన భారతీయ సెలబ్రెటీలు విద్యాదాలన్, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఇలా చాలా మందే  సందడి చేయనున్నారు. ఇక చరణ్ కేన్స్ కు వెళుతున్నాడన్న వార్త విని మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.