Showing posts with label YVS chowdary movie with Balakrishna and Jr NTR together. Show all posts
Showing posts with label YVS chowdary movie with Balakrishna and Jr NTR together. Show all posts

Tuesday, 7 May 2013

YVS Chowdary To Direct Jr NTR

YVS Chowdary To Direct Jr NTR


YVS Chowdary to Direct Jr Ntr.png

     టాలీవుడ్ లో ఒకప్పుడు మంచి సినిమాలను అందించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వైవిఎస్ చౌదరి గత కొంత కాలం నుండి దర్శకత్వం వహిస్తున్న సినిమాలు హిట్ కాకపోవడంతో ఈయన పేరు కాస్త అడుగున పడిపోయింది. దర్శక, నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఈయన తాజాగా చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో ‘రేయ్ ’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మొదలై చాలా రోజులు అయినా ఇంత వరకు విడుదలకు నోచుకోలేదు. ఇక ఈయన తాజాగా ఓ సంచలన ప్రకటన చేశాడు. 
 
ఈయన గతంలో తీసిన ‘లాహిరి లాహిరి లాహిరిలో ’, ‘సీతయ్య ’ వంటి హిట్ చిత్రాలకు సీక్వెల్స్ గా  'కృష్ణా ముకుందా మురారి', 'ఎవరి మాటా వినడు' అనే పేర్లతో తెరకెక్కిస్తానని చెప్పాడు. గతంలో ఈ సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరిక్రిష్ణ నటించాడు. మరి ఈ సీక్వెల్స్ లో ఎవరు నటిస్తారనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. కానీ సినిమా జనాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో హరిక్రిష్ణ నటించలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి, ఆయస స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ని పెట్టి తీస్తాడని అంటున్నారు. మొదటి నుండి ఎన్టీఆర్ కి వీరాభిమాని అయిన వైవీఎస్ ఆయన కుటుంబానికి చెందిన వ్యక్తులతో ఈ సినిమాల్ని తెరకెక్కిస్తాడని అంటున్నారు. మరి మన బుడ్డోడు వైవీఎస్ కి ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి.