Showing posts with label nag. Show all posts
Showing posts with label nag. Show all posts

Tuesday, 7 May 2013

Nag Venky Balayya Best Time To Retire

Nag Venky Balayya Best Time To Retire

nag-venky-balayya best time to retire.png

తెలుగు సినిమా ఇండస్ట్రీని ఓ రెండు దశాబ్దాల పాటు ఏలి స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలక్రిష్ణలు ప్రేక్షకులను అలరించి మెప్పించారు. మెప్పిస్తూనే ఉన్నారు. అయితే వీరిలో చిరంజీవి ఇప్పటికే సినిమాలకు దూరం అయ్యాడు. ఇక మిగిలిన వారు సినిమాలు తీస్తూ ఉన్నా, పాత తరం హీరోలు అయిన వీరు ఇప్పటి తరం వారిని మెప్పించలేక పోతున్నారు. యువ హీరోలతో పాటు పోటీ పడుతూ సినిమా తీస్తున్నా, వారు యూత్ ని ఉర్రూతలు ఊగించలేకపోతున్నారు. వీటికి నిదర్శనం ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలే. బాలక్రిష్ణ ‘సింహా ’ తరువాత సినిమాలు ప్లాపు కావడంతో ఆయన దూకుడును తగ్గించాడు. ఇక నాగార్జున తీస్తున్న సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో ఆయన సినిమాలకు ఆదరణ అంతగా లేదు. 

ఇక వెంకీ ఈ మధ్య నటించిన ‘షాడో ’ ప్రేక్షకుల కలలోకి కూడా వచ్చే విధంగా ఉండటంతో బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. దీంతో మనోళ్ళు ఇంకా హీరోలుగా కొనసాగకుండా రిటైర్‌ అయితే కొత్త వారికి అవకాశం అన్నా వస్తుంది, లేకుంటే మల్టీస్టారర్ సినిమాల్లోనో, తాత తండ్రుల క్యారెక్టర్లు వేసుకుంటే ఇంకా బాగుంటుందని కొంత మంది సలహాలు ఇస్తున్నారు. జనాల్లో ఇంతో అంతో క్రేజ్ ఉన్నప్పుడే గౌరవంగా తప్పుకుంటారో, లేక మరికొన్ని సినిమాల్లో నటించి జనాల్ని విసిగిస్తారో చూద్దాం.