Showing posts with label simran tamil movie. Show all posts
Showing posts with label simran tamil movie. Show all posts

Tuesday, 7 May 2013

Simran Makes Her Reentry In Telugu

Simran Makes Her Reentry In Telugu

Simran makes her re-entry in Telugu.png
టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు ఆట కావాలా, పాట కావాలా అంటూ వచ్చి, అవి రెండూ పంచి, తన గ్లామర్ తో అనతి కాలంలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి, కొంతకాలం తన హవా కొనసాగించిన సిమ్రాన్, యువ హీరోయిన్ల నుండి పోటీ తట్టుకోలేక బి గ్రేడ్ హీరోయిన్ గా మారి కమేడియన్ తో సైతం నటించింది. ఆ తరువాత పెళ్ళి చేసుకొని సంపార జీవితం సాగిస్తున్న సిమ్రాన్ కి మళ్లీ వెండితెర పై రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. 

చాలా కాలం నుండి వెండితెరకు దూరంగా ఉంటున్న సిమ్రాన్ ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ సూర్యతో రూపొందించే ‘ద్రువ నక్షం ’ సినిమాలో నటించబోతుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాలో అమ్మడు ఓకీలక పాత్ర పోషించబోతుందట. ఆ పాత్రకు సిమ్రామన్ అయితే బాగుంటుందని భావించిన గౌతమ్ ఆమెను సంప్రదిస్తే.... తమ కుటుంబాల మధ్య రిలేషన్ తో వెంటనే ఒప్పేసుకుందట. ఏది ఏమైనా ప్రేక్షకులు మరచి పోతారనుకుంటున్న సమయంలో మళ్ళీ వెండితెర పై కనిపించబోతున్న సిమ్రాన్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఏ మాత్రం రాణిస్తుందో చూడాలి.