Thursday, 27 December 2012

Yamudiki Mogudu Movie Review

yanaa_in

చిత్ర పేరు : ‘యముడికి మొగుడు’
విడుదలతేదీ : 27.12.2012
బ్యానర్ :       ఫ్రెండ్లీ మూవీస్‌
కథామూలం : జయసిద్ధు,
మాటలు :      క్రాంతిరెడ్డి సకినాల,
సంగీతం :      కోటి,
కెమెరా :       కె.రవీంద్రబాబు.
నిర్మాత :      చంటి అడ్డాల
దర్శకత్వం :   ఇ.సత్తిబాబు
నటీనటులు:   నరేష్‌, రిచా పనయ్‌, సాయాజీ షిండే, రమ్యకృష్ణ, చంద్రమోహన్‌, నరేష్‌, చలపతిరావు, కృష్ణభగవాన్‌, భరత్‌, రఘుబాబు తదితరులు.

తెలుగువిశేష్.కాం రేటింగ్ : 2.25

పరిచయం :
       ఒకప్పటి బ్లాక్ బస్టర్ మూవీ ‘యముడికి మొగుడు’ సినిమా టైటిల్ తో ఈ దఫా.. ప్రొడ్యూసర్స్ పాలిట మినిమం గ్యారంటీ హీరో అల్లరి నరేష్ ముందుకొచ్చాడు. కుల,మతాంతర వివాహాలు జరుగుతోన్న ప్రస్తుతకాలంలో లోకాంతర వివాహాం అనే థీంతో ఈ సినిమా తెరకెక్కింది. సోషియో ఫాంటసీ నేపధ్యమున్న కథలో అల్లరి నరేష్ నటించటం ఇదే తొలిసారి. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ యముడికి మొగుడెలా అయ్యాడో ఇప్పుడు చూద్దాం.

చిత్రకథ :
       బతికుండానే హీరో పైలోకానికి కెందుకెళ్ళాడు. అసలు యమలోకంలో యముడి కూతురినే ఎందుకు ప్రేమించాడు?  బ్రహ్మ అతడి తలరాత అలాగే ఎందుకు రాశాడు అనే అనే ప్రశ్నలకు జవాబే క్లుప్తంగా ఈ సినిమా... ఇక కథలోకి వెళితే.. బ్రహ్మ  చేసిన పొరపాటు వల్ల పుట్టిన నరేష్‌ (నరేష్‌) కి నుదిట రాత అనేది ఉండదు. దాంతో అతను దైవుళ్ళతో సమానంగా ఏది కోరుకుంటే అది జరిగే శక్తి పుట్టకతోనే వస్తుంది. కానీ ఆ విషయం అతనికి తెలియదు. ఈ తరుణంలో నారదుడి మాయ వల్ల యముడి (సాయాజీ షిండే) కూతురు యమజ (రిచా పనయ్‌) భూమి మీదకు వచ్చి... నరేష్ చేత మెళ్లో పూల దండ వేయించుకుంటుంది. దాంతో పూల దండ వేసిన వాడే తన భర్త అని.. తన భర్తకోసం తపిస్తూ ఉంటుంది. విషయం తెలియని నరేష్ ఆమెను వదిలించుకోవాలని ప్రయత్నిస్తూనే ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే తన కూతురు ఓ మానవుడుతో జీవితం పంచుకుంటోందని తెలిసిన యముడు... భూమి మీదకు వచ్చి ఆమెను తనతో తమ లోకానికి తీసుకు వెళ్లతాడు. అప్పుడు నరేష్ ఏం చేసాడు. అనేది చిత్రంలోని కీలకాంశం.

విశ్లేషణ :
     ముఖ్యంగా చెప్పాల్సిందేమంటే.. దర్శకుడు స్క్రిప్టుపై సరైన శ్రద్ద పెట్టకపోవటంతో సినిమా అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఫస్టాఫ్.. పంచ్  డైలాగులు, మంచి కామెడీతో ఫన్ చేసినప్పటికీ సెకండాఫ్ లో బోర్ కొట్టించేశాడు.  ముఖ్యంగా క్లైమాక్స్ చాలా డల్ గా, పేలవంగా తేలిపోయింది. యముడు కూతురు యమజ కి అసలు వ్యక్తిత్వం ఉన్నట్లు చూపలేదు. యముడు.. పాత్రను స్త్రీ లోలుడుగా...పాపులుగా వచ్చిన స్త్రీలకు లైన్ వేస్తూ, మందు కొడుతూ ఉండటం అంతగా రుచించలేదు. చిత్ర గుప్తుడు పాత్ర ద్వంద్వార్దాలు పలకటమే జీవితాశయంగా సాగింది. . ఇక ప్రీ క్లైమాక్స్ నుంచీ టీవి సీరియల్ సెంటిమెంట్ క్రియేట్ చేయటం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది.

నటీనటుల పనితీరు :
       హీరో అల్లరి నరేష్ ఎప్పటిలాగే కామెడీ పండించాడు. అతని  పంచ్ డైలాగ్స్ బాగానే పేలాయి. ఆడపిల్ల గెటప్ లో అదుర్స్ అనిపించాడు.  హీరోయిన్ రిచా పనయ్ నటన ఓ మోస్తరుగా సాగింది.  బాగా వళ్లు చేసిన రమ్యకృష్ణ అల్లుడా మజాకాలో అత్తో..అత్తమ్మ కూతురో పాటకు స్టెప్స్ వేస్తే ప్రేక్షకులు  ఎంజాయ్ చేశారు.  షియాజీ షిండే యముడి పాత్రలో పెద్దగా రక్తికట్టించలేదు. హీరో తండ్రిగా చంద్రమోహన్ నటన రెగ్యులర్. తణికెళ్ల భరిణి రొయ్యలనాయుడిగా నెగిటివ్ పాత్ర లో మరీ రెచ్చిపోయాడు. రఘుబాబు పాత్ర లో హాస్యం అక్కడక్కడే పేలింది. మాస్టర్ భరత్ యంగ్ భరత్ అయ్యాడు. మిగతా నటీనటులందరూ వారి పరిధి మేర నటించారు.

సాంకేతిక వర్గం :
       దర్శకుడి పనితనంలో లోపాలు స్పష్టంగా కనిపించాయి. సెకండాఫ్ లో కథనాన్ని నడపటంలో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. కేవలం యముడ్ని అడ్డం పెట్టుకుని సినిమాని పూర్తి చేద్దామనుకున్నాడు. కెమెరా వర్క్ సోసోగా ఉంది. ఎడిటింగ్ కి ఇంకా పని చెప్పాలి. గ్రాఫిక్స్ వర్క్ ఫర్వాలేదు.

చివరి మాట : 
       యముడికి మొగుడయ్యాడో లేదో అటుంచితే. ప్రేక్షకులకు మాత్రం నరకలోక సందర్శన జరిగింది.
...avnk

Friday, 21 December 2012

Sarocharu Movie Review

 

 sar-eee


సినిమా పేరు : ‘సారొచ్చారు’
విడుదల తేదీ : 21 12 2012
సమర్పణ : వైజయంతి మూవీస్
బ్యానర్ : త్రీ ఏంజెల్స్ స్టూడియో ప్రై.లిమిటెడ్
దర్శకత్వం  : పరశురామ్
నిర్మాత : సి.అశ్వనీదత్ కుమార్తె ప్రియాంకాదత్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
కో-డైరెక్టర్స్: కిరణ్, బుజ్జి
ప్రొడక్షన్ కంట్రోలర్: వి.మోహనరావు
తారాగణం : రవితేజ, కాజల్, రిచా గంగోపాధ్యాయ, జయసుధ, చంద్రమోహన్, రవిప్రకాష్, ఎమ్మెస్ నారాయణ, శ్రీనివాసరెడ్డి, కల్పిక తదితరులు
తెలుగువిశేష్.కాం రేటింగ్ : 2.25

పరిచయం :
         మాస్ మహారాజ రవితేజ - డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్లో 'ఆంజనేయులు' మూవీ తర్వాత వస్తోన్న మరో సినిమా ‘సారొచ్చారు’. నిర్మాత ప్రియాంకదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సినిమాని నిర్మించారు. ఈ సారి అందాల భామలు కాజల్, రిచా గంగోపాధ్యాయ తో జోడీకట్టిన రవితేజ ఈ మూవీ మీద చాలా ఆశలే పెట్టుకున్నారు. కొంతకాలంగా సూపర్ హిట్ కోసం పరితపిస్తోన్న రవికి ఈ మూవీ ఎంతమేరకు ఉపశమనం కలిగిస్తుందో ఇప్పుడు చూద్దాం..

చిత్రకథ :
      తనను అమితంగా ఇష్టపడే అమ్మాయితో ఒక కట్టుకథ చెప్పి హీరో ఎందుకు ఆమె ప్రేమను కాదన్నాడు అనేది ఈ చిత్రంలో కీలకాంశం. జర్నీలో అయిన పరిచయంతో కార్తిక్(రవితేజ) వెంటపడి సంధ్య(కాజల్) ప్రేమించమని వేడుకుంటుంది. అయితే హీరో కార్తిక్ వసుధ(రిచా గంగోపాధ్యయ) పేరు చెప్పి ఆమెతో ప్రేమాయణం ఉందని తప్పుకోచూస్తాడు.  ఈ క్రమంలో తలెత్తిన, పరిణామాలు.. ట్విస్ట్స్.. ఏంటనేది తెరమీదే చూడాలి.

విశ్లేషణ :
       హీరో రవితేజ కొంచెం క్లాస్ టచ్ తో ఈ సినిమాలో నటించాడు.  తొలుత వచ్చిన విశాఖపట్నంలో జరిగే  చేజింగ్ సీన్లో రవి యాక్షన్ ఆకట్టుకుంటుంది. డైలాగ్ డెలివరీలో రవితేజ తన ఎప్పటి పంధాని కొనసాగించాడు. 'నేను ఒకసారి యాక్షన్ లోకి దిగితే అవతల వాడికి రియాక్షన్ కట్ చేసే టైం కూడా ఉండదు' అన్న డైలాగ్ బాగా పేలింది.
       ఇక హీరోయిన్ కాజల్ అందంలోనూ అభినయంలోనూ మంచి మార్కులే కొట్టేసింది. చాలా ఎనర్జిటిక్ గా కనిపించింది. ‘ఖుషి సినిమా చూసి పవన్ కళ్యాణ్ ని పెళ్లిచేసుకుందామనుకున్నా’ అన్న కాజల్ డైలాగ్ కు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. మరో హీరోయిన్ రిచా పరిధి ఈ మూవీలో అంతంతమాత్రమే.
        పాటల విషయానికొస్తే.. మొత్తం ఇటలీలో షూట్ చేసిన మొదటి పాట 'మేడ్ ఫర్ ఈచ్ ఆదర్' చిత్రీకరణ, ఫొటోగ్రఫీ బావుంది. రెండవ పాట 'జగ జగ జగదేకవీర' యూరప్ లోని అందమైన లోకేషన్స్ లో చిత్రీకరించారు. ఈ సాంగ్ లో డ్యాన్స్ లు అదిరిపోయాయి. ప్రత్యేకంగా రూపొందించిన సెట్ లో చిత్రీకరించిన 'రచ్చ రంబోలా' పాటలో.. 'గుస గుస' సాంగ్ లోనూ రవితేజ - రిచా రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు.  మంచి లొకేషన్స్లో పాటలు చిత్రీకరించారు అన్ని సాంగ్స్ లోనూ కెమరా పనితనం కనిపించింది.
         ఇంకా.. రవితేజ - రిచా మధ్య రొమాంటిక్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. రిచా బ్రదర్ గా మాస్టర్ భరత్ హాస్యాన్ని ఒలికించాడు. జయసుధ మేనల్లుడి పాత్రలో నారా రోహిత్ నటన ఓకే. కాబోయే కథా రచయితగా ప్లాటినం ప్రసాద్ పాత్రలో ఎమ్ .ఎస్ నారాయణ ఫుల్ కామెడీ పండించాడు.
       అయితే,  స్క్రీన్ ప్లేలో లోపాలు సినిమా ఆద్యంతం తలెత్తి చూశాయి. కెమెరా ఓకే. ఎడిటింగ్ బాలేదు.  రిచా గంగోపాధ్యాయ అభినయం ఒ మోస్తరు అనిపిస్తుంది.. రిచాతో ప్రేమాయణం అంటూ కాజల్ కి చెప్పిన కథ (రవితేజ కల్పించిన అభూతకల్పన ఫ్లాష్ బ్యాక్) వర్కౌట్ అయ్యే సూచనలు కనిపించటంలేదు. కథలో లాజిక్ కొరవడటం, ఫైటింగ్ సన్నివేశాలు రొటీన్ అనిపిస్తాయి. హీరో-హీరోయిన్ల లవ్ విషయంలో ఏదో చేద్దామనుకున్న దర్శకుడి  ప్రయోగం ప్రేక్షకులకు అంతగా రుచించదు. స్టోరీలో పట్టులేకపోవటం పెద్ద మైనస్.

చివరి మాట :
       సమావేశానికి సారొచ్చారు కాని.. పూర్ కామెడీ, వీక్ డైలాగ్స్, రొటీన్ స్టోరీ తో ప్రసంగం బుస్సుమంది. ...
  • Sarocharu
  • Sarocharu
  • Sarocharu
  • Sarocharu
  • Sarocharu
  • Sarocharu
  • Sarocharu
  • Sarocharu
  • Sarocharu
  • Sarocharu
avnk

Friday, 14 December 2012

Eto Vellipoyindi Manasu Review

et_e
సినిమా పేరు :‘ఎటో వెళ్లిపోయింది మనసు’
విడుదల తేదీ : 14.12.2012
డైరెక్టర్ :  గౌతమ్ వాసుదేవ మీనన్
నిర్మాత : సి.కల్యాణ్
సంగీతం : ఇళయరాజా
 కెమెరా : ప్రభు, ఓం ప్రకాష్,
మాటలు : కోన వెంకట్,
పాటలు : అనంత్‌శ్రీరామ్,
సహ నిర్మాత : సి.వి.రావు
తారాగణం :  నాని, సమంతా, కృష్ణుడు, విద్యు, అనుపమ, రవి రాఘవేంద్ర, శ్రీరంజని తదితరులు
తెలుగువిశేష్.కాం రేటింగ్ :3.25

పరిచయం :
       జనరల్ గా దర్శకుడు గౌతం వాసుదేవ మీనన్ సినిమాలంటే చిత్ర సీమలో ఓ క్రేజ్ ఉంది. దీనికి తోడు హిట్స్ తో మంచి ఊపుమీదున్న హీరో, హీరోయిన్ నాని సమంతా. దీనికితోడు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా స్వరాలు సమకూర్చటం. దీంతో ఈ మూవీ మీద అంచానాలు బాగా పెరిగిపోయాయి. హై ఎక్స్పెక్టేషన్స్ నడుమ  ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రిలీజైన 'ఎటో వెళ్ళిపోయింది మనసు' చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
చిత్ర కథ :
       చిన్నతనంనుంచీ ప్రేమ పరిమళించిన ఒక అమ్మాయి, అబ్బాయిలోని సున్నితమైన భావోద్వేగాలు. నిజజీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదో సందర్భంలో ఎదురైన  మధుర స్మృతి ఎంత తీయగా ఉంటుంది. ఇలా ఓ యువజంట జీవితాల్లో మూడు దశల్లో కలిగే ప్రేమ భావనల సమాహారమే క్లుప్తంగా ఈ చిత్రం. ఇక కథలోకి వెళితే.. వరుణ్ క్రిష్ణ(నాని), నిత్యా(సమంతా) వీరిద్దరూ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచీ క్లాస్ మెట్స్, మంచి ఫ్రెండ్స్ కూడా. ఎనిమిదేళ్ల ప్రాయంలో మొగ్గవిప్పిన వీరి ప్రేమ టీనేజ్, యంగ్ ఏజ్ చేరే సరికి ఏయే రూపం తీసుకుంది.. ప్రేమలో ఎదురైన ఒడిదుడుకులను వీరిద్దరూ ఎలా అధిగమించి తమ ప్రేమను పండించుకున్నారు అనేదే ఈ చిత్రం. ఇందులోని కీలక మలుపులు ఏంటన్నది తెరమీదే చూడాలి.
సమీక్ష :
        ముందుగా చిత్ర నటీనటుల విషయానికొస్తే, హీరో నాని నటన తనదైన సైలిలోనే ఉంది. అతని డైలాగ్ డెలివరీ బావుంది. ప్రత్యేకంగా చెప్పాల్సిందేమంటే క్లైమాక్స్ సన్నివేశంలో నాని ప్రదర్శించిన నటన అద్భుతం. ఇంతకు ముందు ఏ సినిమాలోనూ చేయనంత బాగా సీన్ రక్తికట్టించాడు. 'నచ్చలేదు మావ' పాటలో చాలా యంగ్ గా కనిపించాడు. హీరోయిన్ సమంతా మూడు తరహా పాత్రలనూ మెప్పించింది.  ఏ పాత్రకు తగ్గట్టుగా ఆ అభినయాన్ని ఒలకబోస్తూ ఔరా అనిపించింది. ఇటీవల హీరోగా వరుస సినిమాలు చేస్తున్న క్రుష్ణుడు ఈ మూవీలో హీరో ఫ్రెండ్ గా కామెడీ అద్భుతంగా పండించాడు. అతనికి మంచి పాత్ర ఈ మూవీలో లభించింది.  'కోటి కోటి తారల్లోనా' సాంగ్ లో జీవా స్పెషల్ అప్పీయరెన్స్ బావుంది.
           ఇక దర్శకుడు గౌతం మీనన్ కు స్ర్కీన్ ప్లే, స్టోరీ నెరేట్ చేయటంలో తిరుగులేదని అంతా భావించేదే. దీనికి తగ్గట్టుగానే దర్శకుడు కథనాన్ని నడిపాడు. అయితే ప్రథమార్థంలో చిత్రం బాగా స్లో అనిపిస్తుంది. ఇదే ఈ మూవీలో భారీ లోటు. ఇతర తారాగణ మంతా వారి వారి పరిధి మేరకు నటించారు.
సాంకేతిక విభాగం :
         గౌతం మీనన్ డైరెక్షన్ ఓకే. ప్రభు సినిమాటోగ్రఫీ, లొకేషన్స్ చూడ చక్కగా ఉన్నాయి. మ్యాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ చిత్రానికి అదనపు భలం. ఎడిటింగ్ ఫర్వాలేదు.
చివరి మాట :
        ఎటో వెళ్ళిపోయింది మనసు సర్ఫెక్సెల్ సిద్ధాంతం.. మరక మంచిదేలా ప్రేమలో ఆటుపోట్లూ మంచివే అని తేల్చాడు గౌతం
Yeto Vellipoindi Manasu Review
  • Yeto Vellipoindi Manasu Review
  • Yeto Vellipoindi Manasu Review
  • Yeto Vellipoindi Manasu Review
  • Yeto Vellipoindi Manasu Review
  • Yeto Vellipoindi Manasu Review
  • Yeto Vellipoindi Manasu Review
  • Yeto Vellipoindi Manasu Review
  • Yeto Vellipoindi Manasu Review

...avnk