Friday, 14 December 2012

Eto Vellipoyindi Manasu Review

et_e
సినిమా పేరు :‘ఎటో వెళ్లిపోయింది మనసు’
విడుదల తేదీ : 14.12.2012
డైరెక్టర్ :  గౌతమ్ వాసుదేవ మీనన్
నిర్మాత : సి.కల్యాణ్
సంగీతం : ఇళయరాజా
 కెమెరా : ప్రభు, ఓం ప్రకాష్,
మాటలు : కోన వెంకట్,
పాటలు : అనంత్‌శ్రీరామ్,
సహ నిర్మాత : సి.వి.రావు
తారాగణం :  నాని, సమంతా, కృష్ణుడు, విద్యు, అనుపమ, రవి రాఘవేంద్ర, శ్రీరంజని తదితరులు
తెలుగువిశేష్.కాం రేటింగ్ :3.25

పరిచయం :
       జనరల్ గా దర్శకుడు గౌతం వాసుదేవ మీనన్ సినిమాలంటే చిత్ర సీమలో ఓ క్రేజ్ ఉంది. దీనికి తోడు హిట్స్ తో మంచి ఊపుమీదున్న హీరో, హీరోయిన్ నాని సమంతా. దీనికితోడు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా స్వరాలు సమకూర్చటం. దీంతో ఈ మూవీ మీద అంచానాలు బాగా పెరిగిపోయాయి. హై ఎక్స్పెక్టేషన్స్ నడుమ  ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రిలీజైన 'ఎటో వెళ్ళిపోయింది మనసు' చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
చిత్ర కథ :
       చిన్నతనంనుంచీ ప్రేమ పరిమళించిన ఒక అమ్మాయి, అబ్బాయిలోని సున్నితమైన భావోద్వేగాలు. నిజజీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదో సందర్భంలో ఎదురైన  మధుర స్మృతి ఎంత తీయగా ఉంటుంది. ఇలా ఓ యువజంట జీవితాల్లో మూడు దశల్లో కలిగే ప్రేమ భావనల సమాహారమే క్లుప్తంగా ఈ చిత్రం. ఇక కథలోకి వెళితే.. వరుణ్ క్రిష్ణ(నాని), నిత్యా(సమంతా) వీరిద్దరూ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచీ క్లాస్ మెట్స్, మంచి ఫ్రెండ్స్ కూడా. ఎనిమిదేళ్ల ప్రాయంలో మొగ్గవిప్పిన వీరి ప్రేమ టీనేజ్, యంగ్ ఏజ్ చేరే సరికి ఏయే రూపం తీసుకుంది.. ప్రేమలో ఎదురైన ఒడిదుడుకులను వీరిద్దరూ ఎలా అధిగమించి తమ ప్రేమను పండించుకున్నారు అనేదే ఈ చిత్రం. ఇందులోని కీలక మలుపులు ఏంటన్నది తెరమీదే చూడాలి.
సమీక్ష :
        ముందుగా చిత్ర నటీనటుల విషయానికొస్తే, హీరో నాని నటన తనదైన సైలిలోనే ఉంది. అతని డైలాగ్ డెలివరీ బావుంది. ప్రత్యేకంగా చెప్పాల్సిందేమంటే క్లైమాక్స్ సన్నివేశంలో నాని ప్రదర్శించిన నటన అద్భుతం. ఇంతకు ముందు ఏ సినిమాలోనూ చేయనంత బాగా సీన్ రక్తికట్టించాడు. 'నచ్చలేదు మావ' పాటలో చాలా యంగ్ గా కనిపించాడు. హీరోయిన్ సమంతా మూడు తరహా పాత్రలనూ మెప్పించింది.  ఏ పాత్రకు తగ్గట్టుగా ఆ అభినయాన్ని ఒలకబోస్తూ ఔరా అనిపించింది. ఇటీవల హీరోగా వరుస సినిమాలు చేస్తున్న క్రుష్ణుడు ఈ మూవీలో హీరో ఫ్రెండ్ గా కామెడీ అద్భుతంగా పండించాడు. అతనికి మంచి పాత్ర ఈ మూవీలో లభించింది.  'కోటి కోటి తారల్లోనా' సాంగ్ లో జీవా స్పెషల్ అప్పీయరెన్స్ బావుంది.
           ఇక దర్శకుడు గౌతం మీనన్ కు స్ర్కీన్ ప్లే, స్టోరీ నెరేట్ చేయటంలో తిరుగులేదని అంతా భావించేదే. దీనికి తగ్గట్టుగానే దర్శకుడు కథనాన్ని నడిపాడు. అయితే ప్రథమార్థంలో చిత్రం బాగా స్లో అనిపిస్తుంది. ఇదే ఈ మూవీలో భారీ లోటు. ఇతర తారాగణ మంతా వారి వారి పరిధి మేరకు నటించారు.
సాంకేతిక విభాగం :
         గౌతం మీనన్ డైరెక్షన్ ఓకే. ప్రభు సినిమాటోగ్రఫీ, లొకేషన్స్ చూడ చక్కగా ఉన్నాయి. మ్యాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ చిత్రానికి అదనపు భలం. ఎడిటింగ్ ఫర్వాలేదు.
చివరి మాట :
        ఎటో వెళ్ళిపోయింది మనసు సర్ఫెక్సెల్ సిద్ధాంతం.. మరక మంచిదేలా ప్రేమలో ఆటుపోట్లూ మంచివే అని తేల్చాడు గౌతం
Yeto Vellipoindi Manasu Review
  • Yeto Vellipoindi Manasu Review
  • Yeto Vellipoindi Manasu Review
  • Yeto Vellipoindi Manasu Review
  • Yeto Vellipoindi Manasu Review
  • Yeto Vellipoindi Manasu Review
  • Yeto Vellipoindi Manasu Review
  • Yeto Vellipoindi Manasu Review
  • Yeto Vellipoindi Manasu Review

...avnk

No comments:

Post a Comment