సినిమా పేరు : ‘సారొచ్చారు’
విడుదల తేదీ : 21 12 2012
సమర్పణ : వైజయంతి మూవీస్
బ్యానర్ : త్రీ ఏంజెల్స్ స్టూడియో ప్రై.లిమిటెడ్
దర్శకత్వం : పరశురామ్
నిర్మాత : సి.అశ్వనీదత్ కుమార్తె ప్రియాంకాదత్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
కో-డైరెక్టర్స్: కిరణ్, బుజ్జి
ప్రొడక్షన్ కంట్రోలర్: వి.మోహనరావు
తారాగణం : రవితేజ, కాజల్, రిచా గంగోపాధ్యాయ, జయసుధ, చంద్రమోహన్, రవిప్రకాష్, ఎమ్మెస్ నారాయణ, శ్రీనివాసరెడ్డి, కల్పిక తదితరులు
తెలుగువిశేష్.కాం రేటింగ్ : 2.25
పరిచయం :
మాస్ మహారాజ రవితేజ - డైరెక్టర్
పరశురామ్ కాంబినేషన్లో 'ఆంజనేయులు' మూవీ తర్వాత వస్తోన్న మరో సినిమా
‘సారొచ్చారు’. నిర్మాత ప్రియాంకదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ
సినిమాని నిర్మించారు. ఈ సారి అందాల భామలు కాజల్, రిచా గంగోపాధ్యాయ తో
జోడీకట్టిన రవితేజ ఈ మూవీ మీద చాలా ఆశలే పెట్టుకున్నారు. కొంతకాలంగా సూపర్
హిట్ కోసం పరితపిస్తోన్న రవికి ఈ మూవీ ఎంతమేరకు ఉపశమనం కలిగిస్తుందో
ఇప్పుడు చూద్దాం..
చిత్రకథ :
తనను అమితంగా ఇష్టపడే అమ్మాయితో ఒక
కట్టుకథ చెప్పి హీరో ఎందుకు ఆమె ప్రేమను కాదన్నాడు అనేది ఈ చిత్రంలో
కీలకాంశం. జర్నీలో అయిన పరిచయంతో కార్తిక్(రవితేజ) వెంటపడి సంధ్య(కాజల్)
ప్రేమించమని వేడుకుంటుంది. అయితే హీరో కార్తిక్ వసుధ(రిచా గంగోపాధ్యయ) పేరు
చెప్పి ఆమెతో ప్రేమాయణం ఉందని తప్పుకోచూస్తాడు. ఈ క్రమంలో తలెత్తిన,
పరిణామాలు.. ట్విస్ట్స్.. ఏంటనేది తెరమీదే చూడాలి.
విశ్లేషణ :
హీరో రవితేజ కొంచెం క్లాస్ టచ్ తో ఈ
సినిమాలో నటించాడు. తొలుత వచ్చిన విశాఖపట్నంలో జరిగే చేజింగ్ సీన్లో రవి
యాక్షన్ ఆకట్టుకుంటుంది. డైలాగ్ డెలివరీలో రవితేజ తన ఎప్పటి పంధాని
కొనసాగించాడు. 'నేను ఒకసారి యాక్షన్ లోకి దిగితే అవతల వాడికి రియాక్షన్ కట్
చేసే టైం కూడా ఉండదు' అన్న డైలాగ్ బాగా పేలింది.
ఇక హీరోయిన్ కాజల్ అందంలోనూ అభినయంలోనూ మంచి మార్కులే కొట్టేసింది. చాలా ఎనర్జిటిక్ గా కనిపించింది. ‘ఖుషి సినిమా చూసి పవన్ కళ్యాణ్ ని పెళ్లిచేసుకుందామనుకున్నా’ అన్న కాజల్ డైలాగ్ కు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. మరో హీరోయిన్ రిచా పరిధి ఈ మూవీలో అంతంతమాత్రమే.
పాటల విషయానికొస్తే.. మొత్తం ఇటలీలో షూట్ చేసిన మొదటి పాట 'మేడ్ ఫర్ ఈచ్ ఆదర్' చిత్రీకరణ, ఫొటోగ్రఫీ బావుంది. రెండవ పాట 'జగ జగ జగదేకవీర' యూరప్ లోని అందమైన లోకేషన్స్ లో చిత్రీకరించారు. ఈ సాంగ్ లో డ్యాన్స్ లు అదిరిపోయాయి. ప్రత్యేకంగా రూపొందించిన సెట్ లో చిత్రీకరించిన 'రచ్చ రంబోలా' పాటలో.. 'గుస గుస' సాంగ్ లోనూ రవితేజ - రిచా రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు. మంచి లొకేషన్స్లో పాటలు చిత్రీకరించారు అన్ని సాంగ్స్ లోనూ కెమరా పనితనం కనిపించింది.
ఇంకా.. రవితేజ - రిచా మధ్య రొమాంటిక్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. రిచా బ్రదర్ గా మాస్టర్ భరత్ హాస్యాన్ని ఒలికించాడు. జయసుధ మేనల్లుడి పాత్రలో నారా రోహిత్ నటన ఓకే. కాబోయే కథా రచయితగా ప్లాటినం ప్రసాద్ పాత్రలో ఎమ్ .ఎస్ నారాయణ ఫుల్ కామెడీ పండించాడు.
అయితే, స్క్రీన్ ప్లేలో లోపాలు సినిమా ఆద్యంతం తలెత్తి చూశాయి. కెమెరా ఓకే. ఎడిటింగ్ బాలేదు. రిచా గంగోపాధ్యాయ అభినయం ఒ మోస్తరు అనిపిస్తుంది.. రిచాతో ప్రేమాయణం అంటూ కాజల్ కి చెప్పిన కథ (రవితేజ కల్పించిన అభూతకల్పన ఫ్లాష్ బ్యాక్) వర్కౌట్ అయ్యే సూచనలు కనిపించటంలేదు. కథలో లాజిక్ కొరవడటం, ఫైటింగ్ సన్నివేశాలు రొటీన్ అనిపిస్తాయి. హీరో-హీరోయిన్ల లవ్ విషయంలో ఏదో చేద్దామనుకున్న దర్శకుడి ప్రయోగం ప్రేక్షకులకు అంతగా రుచించదు. స్టోరీలో పట్టులేకపోవటం పెద్ద మైనస్.

చివరి మాట :
No comments:
Post a Comment