Friday, 3 May 2013

Greeku Veerudu Movie Review


Greeku Veerudu Movie Review


Movie Reviews
గ్రీకు వీరుడు
 - 2.75/5 - 2.75/5
గ్రీకు వీరుడు
గ్రీకు వీరుడు
Movie Reviews
  • చిత్రం
    గ్రీకువీరుడు
  • బ్యానర్
    కామాక్షి మూవీస్
  • దర్శకుడు
    దశరథ్
  • నిర్మాత
    డి. శివప్రసాద్ రెడ్డి
  • సంగీతం
    తమన్
  • సినిమా రేటింగ్
     - 2.75/5 - 2.75/5  2.75/5
  • ఛాయాగ్రహణం
    అనిల్ బండారి
  • ఎడిటర్
    మార్తాండ్ కె. వెంకటేష్
  • విడుదల తేది
    మే 3, 2013
  • నటినటులు
    నాగార్జున, నయనతార, కె. విశ్వనాథ్, మీరా చోప్రా, తదితరులు
Cinema Story
చందు (నాగార్జున) అమెరికాలో ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థను నిర్వహిస్తుంటాడు . ప్రేమ,పెళ్లి వంటి విషయాలపై నమ్మకాల్లేని వ్యక్తి. ప్రతి విషయంలోనూ వ్యాపారాత్మకంగా ఆలోచించడం అతని నైజం. తొందరగా బంధాలను తెంచేసుకుంటాడు. అతను చేసే బిజినెస్ లో ఓ సమస్య రావటంతో డబ్బుకోసం ఇండియాకు తొలిసారి వస్తాడు. ఇండియాలో అడుగుపెట్టగానే ఎయిర్ పోర్ట్ లోనే సంధ్య (నయనతార) పరిచయమవుతుంది. ఆ కేసు నుండి తప్పించుకోవడానికి సంధ్య తో పెళ్లి నాటకం ఆడుతాడు. సంధ్య కూడా చందుకు వచ్చిన సమస్య కోసం ఈ పెళ్ళికి ఒప్పుకుని అతని భార్యగా నటిస్తుంది. అయితే బంధాల గురించి ఏ మాత్రం కేర్ చేయని చందులో మార్పు ఎలా వచ్చిందనేది తెర పై చూడాల్సిందే.
pothe
గ్రీకు వీరుడు ఐదు పదులు దాటినా ఇంకా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్న నాగార్జున, కుమారులు ప్రేమకథా చిత్రాల్లో నటిస్తున్న టైంలో కూడా తానేమి తక్కువ తిన్నాననుకొని తాను కూడా ప్రేమకథా చిత్రంలో నటించాడు. అదే గ్రీకువీరుడు సినిమా. నాగార్జున, ధశరథ్ కాంబినేషన్ రిపీట్ కావటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమౌవుతున్న నాగార్జున ‘గ్రీకు వీరుడు ’గా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉందో ఓసారి రివ్యూ చూద్దాం.
ఈ సినిమాని దర్శకుడు ఫ్యామిలీ ఆడియన్స్ ని ద్రుష్టిలో పెట్టుకొని తీశాడు. ఇందులో బంధాలు, వాటికి ఉండే విలువల గురించి చెప్పాడు. ఈ కాలం వారికి బంధాల విలువలు తెలియజెప్పే ప్రత్నం చేశాడు. ఇందులో మూడు తరాలకు సంబంధించిన బంధుత్వాలు, వాటి విలువలు, వాటికి విలువ ఇవ్వకపోతే ఏం కోల్పాయాం అన్నది స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఈ జనరేషన్ కి చెందిన యూత్ కి ఈ స్టోరీ అంతగా రుచించక పోవచ్చు. సినిమాలో కామెడీ పెద్దగా పండక పోయినా సెంటిమెంట్లు కాస్త పండాయి.  చిన్న చిన్న సెంటిమెంట్లు వర్కవుట్ అయ్యాయి. కాల్చుకోవడాలు... నరుక్కోవడాలు ...ఛేజింగ్ లు లాంటి అతిశయోక్తులు లేకుండా సినిమా చక్కగా సాగుతుంది. కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే ఈ సినిమాని యూత్ కూడా ఆదరిస్తేనే ఓ రెండు వారాలు నిలవగలుగుతుంది. మొత్తంగా చూస్తే సినిమా ఓకే అనిపిస్తుంది కానీ అంతగా ఆకట్టుకునే సినిమా మాత్రం కాదు.
Cinema Review
ఈ సినిమాలో గ్రీకువీరుడిగానటించిన నాగార్జున ఇంతకు మందే మన్మధుడు బిరుదు ఉంది. కాబట్టి గ్రీకువీరుడిగా నాగార్జున నటన ఫర్వాలేదనిపిస్తుంది. కానీ వయస్సు ఫైబడినట్లు మాత్రం కొట్టచ్చినట్లు కనిపిస్తుంది. ఇందులో గ్రీకువీరుడికి ఉండాల్సిన గ్లామర్ లా నాగార్జున గ్లామర్ కనిపించలేదు. ఇక నయనతార పాత్ర అంత పెద్దగా లీనమై నటించేంతగా లేదు. కానీ ఆమె మేరకు అలా సోసోగా నటించింది. ఇందులో నటించిన మీరా చోప్రా పాత్ర కొద్దిసేపే అయినా ఫర్వాలేదనిపిస్తుంది. ఇక నాగార్జున తాత గా నటించిన విశ్వనాధ్ తనదైన తరహాలో నటించాడు.  యం.యస్. నారాయణ, బ్రహ్మానందం లు రొటీన్ పాత్రలు పోషించినా, కాస్త నవ్వులు కురిపించారు. కోటశ్రీనివాసరావు ఉన్నా కూడా రెండు సీన్లలో మాత్రమే కనిపిస్తాడు. మిగిలిన పాత్రలు చేసిన వారు వారి వారి శక్తి మేరకు నటించారు. వారి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.

‘సంతోషం ’ సినిమా తీసిన ఇన్నాళ్ళకు మళ్ళీ నాగార్జున తో సినిమా చేసిన ధశరథ్ ఈ వయస్సులో నాగ్ ని అలా చూపించడంలో సఫలం అయ్యాడనే చెప్పవచ్చు. గతంలో ప్రేమకథా చిత్రాలను హ్యాండిల్ చేసిన ఈయన అదే తరహాలో సినిమాను చేశాడు. సెంటిమెంటు సీన్స్ తనదైన శైలిలో పండించే దశరథ్ ఇందులో కూడా బాగానే పండించాడు. ఇక ఈ సినిమాతో రైటర్ గా మారిన ఈయన తనదైన శైలిలో సంభాషణలు రాశాడు. రైటర్ గా కూడా తన పనికొస్తానని నిరూపించుకున్నాడు. ఈ సినిమాకు ఫాస్ట్ బీట్స్ అందించే తమన్ మెలోడీ సాంగ్స్ ని కంపోజ్ చేసి ఫర్వాలేదనిపించాడు. నేపథ్య సంగీతంతో పాటు, సెంటిమెంట్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా అందించాడు. ఈ సినిమాకు ముఖ్యమైన డ్రా బ్యాక్ ఏంటంటే... సినిమాటో గ్రఫీ. సన్నివేశాని తగ్గట్లు మంచి మంచి లొకేషన్లలో చిత్రీకరించలేదు. ఎక్కుబాగం గ్రాఫిక్స్ తో సరిపెట్టారు. కానీ అవి ఎబ్బెట్టుగా ఉన్నాయి. బడ్జెట్ బాగా పెడితే సినిమాకు లాస్ వస్తుందనుకున్నారో ఏమో కానీ క్వాలిటీ విషయంలో వెనక్కి తగ్గడంతో అవుట్ పుట్ అంతగా రాలేదు. నాగార్జున సినిమాను కూడా ఓ చిన్న బడ్జెట్ సినిమాలాగా తీసి పని పూర్తి చేశారు.

chivaraga
ఫ్యామిలీ ఆడియన్స్ ఆకట్టుకొని, యూత్ ని ఆకట్టుకోలేని ‘గ్రీకువీరుడు ’.
[youtube=http://www.youtube.com/watch?feature=player_embedded&v=cEPbouuFrnE]

Stills from Greeku Veerudu:

  • Greeku Veerudu
  • Greeku Veerudu
  • Greeku Veerudu
  • Greeku Veerudu
  • Greeku Veerudu
  • Greeku Veerudu
  • Greeku Veerudu
  • Greeku Veerudu
  • Greeku Veerudu
  • Greeku Veerudu
  • Greeku Veerudu


   Greeku Veerudu review Greeku Veerudu movie review Greeku Veerudu movie rating Greeku Veerudu movie talk Greeku Veerudu movie still nagarjuna Greeku Veerudu review nagarjuna nayanatara Greeku Veerudu review Greeku Veerudu movie trailer Greeku Veerudu movie stills Greeku Veerudu movie release Greeku Veerudu movie preview Greeku Veerudu movie review Greeku Veerudu review

No comments:

Post a Comment