Saturday, 27 April 2013

Shadow Movie Review

Shadow Movie Review 

‘షాడో ’ సినిమా రివ్యూ
 
ఫ్యామిలీ చిత్రాల హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ ఈ మధ్య యంగ్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ చిత్రాల్లో, అదే టైంలో సింగిల్ గా ఈ జనరేషన్ కి తగ్గట్లుగా భారీ యాక్షన్ చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు. ఇప్పుడు అదే తరహాలో వచ్చిందే ఈ షాడో సినిమా. వెంకీ సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ప్రేక్షకులు కడుపునిండా నవ్వుకోవచ్చు అని అనుకుంటారు. ఇక నిర్మాతలు అయితే.... పెట్టిన డబ్బుకు ఢోకా లేదని బరోసాగా ఉంటారు. మరి వెంకటేష్ కెరియర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందిన షాడో సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం అలరించిందో ఓ సారి చూద్దాం.



  • చిత్రం
    షాడో
  • బ్యానర్
    యు స్క్వేర్ మూవీస్ లిమిటెడ్
  • దర్శకుడు
    మెహర్ రమేష్
  • నిర్మాత
    పరుచూరి శివరామ్ ప్రసాద్
  • సంగీతం
    తమన్
  • సినిమా రేటింగ్
     - 2.25/5 - 2.25/5  2.25/5
  • ఛాయాగ్రహణం
    శ్యామ్ కె. నాయుడు
  • ఎడిటర్
    మార్తాండ్ కె. వెంకటేష్
  • విడుదల తేది
    ఏప్రిల్ 26, 2013
  • నటినటులు
    వెంకటేష్, తాప్పీ, శ్రీకాంత్, మధురిమ, ఎమ్మెస్ నారాయణ, ఆదిత్య పచోలి, షాయాజీ షిండే, నాగబాబు తదితరులు
Cinema Story
వెకంటేష్ తండ్రి (రఘురాం ) నలుగురికి మంచి చేసే మనస్తత్వం. అతను నానా భాయ్ ( ఆదిత్య పచోలి ) దగ్గర పనిచేస్తుంటాడు. అయితే ఆ గ్యాంగ్ లోని రహస్యాలను బయటకి చేరవేస్తున్నాడని తెలుసుకున్న డాన్ రఘురాంని చంపేస్తాడు. ఈ సంఘటనను కళ్ళారా చూసిన రాజారాం (షాడో) వారి పై ఎలాగైనా పగ తీర్చుకోవాలనే కసితో పెరుగుతాడు. అలా పెరిగిన షాడో నానా భాయ్ గ్యాంగ్ లోని వాళ్లని చంపుకుంటూ వస్తాడు. ఓసారి నానా భాయ్ పేళుళ్లకు ప్లాన్ చేస్తాడు ? ఈ పేళుళ్ళను ఆపడానికి పోలీస్ ఆఫీసర్ ప్రతాప్ (శ్రీకాంత్ ) ప్రయత్నిస్తాడు. ఇంతలో నానా గ్యాంగ్ ని అంతం చేస్తున్న షాడో ఎవరనే సందేహం అతనికి వచ్చి ఆరా తీస్తాడు. చివరకు షాడో తన తండ్రిని చంపిన వాళ్ల పై ఎలా పగతీర్చుకుంటాడనేది తెరపై చూడాల్సిందే.
pothe
షాడో ఫ్యామిలీ చిత్రాల హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ ఈ మధ్య యంగ్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ చిత్రాల్లో, అదే టైంలో సింగిల్ గా ఈ జనరేషన్ కి తగ్గట్లుగా భారీ యాక్షన్ చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు. ఇప్పుడు అదే తరహాలో వచ్చిందే ఈ షాడో సినిమా. వెంకీ సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ప్రేక్షకులు కడుపునిండా నవ్వుకోవచ్చు అని అనుకుంటారు. ఇక నిర్మాతలు అయితే.... పెట్టిన డబ్బుకు ఢోకా లేదని బరోసాగా ఉంటారు. మరి వెంకటేష్ కెరియర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందిన షాడో సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం అలరించిందో ఓ సారి చూద్దాం.

గతంలో పలు డిజాస్టర్ సినిమాలు తీసి సెన్సేషనల్ డిజాస్టర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మెహర్ రమేష్ ఈ సినిమాను కూడా అదే రేంజ్ లో డిజాస్టర్ చేయడానికి ప్రయత్నించాడు. ఇందులో ఆయనకు తగ్గట్లు ప్రాస డైలాగులు పెట్టుకున్నాడు. హీరో ఇంట్రడక్షన్ టైంలో ‘నేనువరన్నది మిస్టరీ... నేను క్రియేట్ చేసేది హిస్టరీ.... మీరు చూడబోయేది నా విక్టరీ... అనే డైలాగు పెట్టాడు. ఈ డైలాగు లాగానే ఆయన ‘నేను తీయబోయే కథ మిస్టరీ.... నేను క్రియేట్ చేయబోయేది డిజాస్టర్ .... మీరు భరించాలి నా టార్చర్ ’ అన్న విధంగా తీశాడు. ఓ సాధాసీదా కథకు భారీ హంగులు చేకూర్చి ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేసి వారి మీదకు వదిలాడు. ఇది చాలదు అన్నట్లు కామెమీ సీన్స్ ని బలవంతంగా పెట్టి మరింత విరక్తి కలిగించాడు. ఫలితంగా థియేటర్ లో ప్రేక్షకుడు నవ్వుకోవడం బదులు... తలలు బాదుకునే పరిస్థితి. ఇక కథలో హీరో విలన్లను ఎంత సింపుల్ గా చంపేస్తాడంటే చిన్నపిల్లాడు కొట్టకువెళ్లి చాక్లెట్ కొనుక్కొని గుటుక్కున నోట్లోవేసుకున్నంతగా. మొత్తంగా చూస్తే ఈ సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు ఏమీ లేవు. ఏదో సినిమా మొదలు పెట్టాం కదా అని పూర్తి చేయాలనే భావనే కాకుండా, డబ్బు నీళ్లలా ఖర్చు పెట్టే నిర్మాత ఉన్నాడు కదా అని హంగులు జోడించాడు తప్ప వాటికి తగ్గ కథను తయారు చేసుకోలేదు.
Cinema Review
ప్రతి సినిమాలో ఎంతో ఎనర్జిటిక్ గా, ఎంతో హుందాగా కనిపించే వెంకటేష్ ఈ సినిమాలో ఎంతో నీరసంగా కనిపించాడు. కొత్త గెటప్స్ తో ప్రేక్షకులను అదరగొడదామని చూశాడు కానీ అవి ఆయనకు సూట్ కాలేదు. ఈ మధ్య కాలంలో వెంకటేస్ ఇంత చెత్తగా, పాత్రలో ఇన్వాల్వ్ కాకుండా నటించిన పాత్ర ఏదైనా ఉంటే అది ఇదే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. గత సినిమాలతో పోలిస్తే.... వెంకటేష్ ఇలా చెత్తగా కూడా నటిస్తాడా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎదో నటించాలని నటించేసినట్లు అనిపిస్తుంది. ఇక హీరోయిన్ తాప్పీ అందంగా కనిపించింది మినహా ఆమె చెయ్యడానికి సినిమాలో ఏమీ లేదు. ముఖ్యంగా ప్రేక్షకులకు ఆమె కస్ట్యూమ్స్ విసుగు తెప్పిస్తాయి. అవి అందం కోసం వేశారా ? ఉన్న అందాన్ని చెడగొట్టడానికి వేశారా అన్నట్లు ఉన్నాయి. శ్రీకాంత్ ఇందులో గెస్ట్ రోల్ పోషించాడు. ఇందులో ఆయన పోలీస్ పాత్రలో నటించినా, చెప్పిన పని చేసుకుంటూ పోయినట్లు ఉంటుంది. కమేడియన్ ఎమ్మెస్ నారాయణ  ఎంతగానో నవ్వించాలని చూశాడు. కానీ ప్రేక్షకులు వారికి వారు గిలిగింతలు పెట్టుకున్నా నవ్వురాదు ఈ సీన్స్ చూస్తే. విలన్ ఆదిత్య పచోలి ని డాన్ గా చూపించాడు. అతను అంతంత మాత్రమే. శ్రీకాంత్ భార్యగా నటించిన మధురిమ చేసిందేం లేదు. అప్పుడప్పుడు ఓ స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇక మిగతావారి క్యారెక్టర్లకు చెప్పుకునే అంత ప్రాముఖ్యత లేదు.

అనుభవం వస్తుంటే పనిలో నైపుణ్యత పెరుగుతుందని అంటారు. కానీ ఈ సినిమాకు పని చేసిన సాంకేతిక విభాగం వారి పని చూస్తే.... వీరు కొత్తగా చేశారా అన్నట్లు ఉంటుంది. దర్శకుడు మెహర్ రమేష్ కి తోడు గొప్ప కథా రచయితలుగా పేరున్న గోపీమోహన్, కోన వెంకట్ స్క్రిప్ట్ లో పస లేకుండా పోయింది. ఇక థమన్ అందించిన సంగీతం ఓక్క పాటకు తప్ప మిగిలిన అన్ని పాటలకు తన పాత ట్యూన్స్ కి తెరపైకి తెచ్చాడా అన్నట్లు ఉన్నాయి. సినిమాటో గ్రఫీ ఫర్వాలేదని పిస్తుంది. ఎడిటింగ్ కి ఏ ఒక్క సీన్ కూడా మిగలవేమో. ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ చాలా రిచ్ గా ఉన్నాయి.

chivaraga
 
‘వడ్డించే వాడు మనవాడు అయితే ఎక్కడ కూర్చున్నా ఒక్కటే ’ అనే సామెత మాదిరి నిర్మాత ఖర్చు పెట్టేవాడు ఉండగా... కథ.... కథనం... లేకుండా భారీ సినిమాలు తీస్తే పోలా అని అనుకునే దర్శకులకు అవకాశం ఇస్తే...ఇలాంటి సినిమాలే వస్తాయి. ఇలాంటి దర్శకులు మరో నలుగురు ఉంటే పరిశ్రమ దివాలా తీయడం ఖాయం. 

ఎన్టీఆర్ కి తన శక్తేమిటో చూపించిన మెహర్ వెంకటేష్ కి కలలో కూడా (షాడో) నీడలా వెంటాడే సినిమా తీశాడు.


 
 

No comments:

Post a Comment