Friday, 19 April 2013

Gunde Jaari Gallanthayyinde Movie Review

  • చిత్రం
    గుండెజారి గల్లంతయిందే
  • బ్యానర్
    శ్రేష్ఠ్‌ మూవీస్‌
  • దర్శకుడు
    విజయ్‌కుమార్‌ కొండా
  • నిర్మాత
    నిఖితారెడ్డి
  • సంగీతం
    అనూప్‌ రూబెన్స్‌
  • సినిమా రేటింగ్
     - 3.25/5 - 3.25/5 - 3.25/5  3.25/5
  • ఛాయాగ్రహణం
    ఆండ్రూ బాబు,
  • ఎడిటర్
    హర్షవర్ధన్‌
  • విడుదల తేది
    ఏప్రిల్ 19, 2013
  • నటినటులు
    నితిన్‌, నిత్య మీనన్‌, ఇషా తల్వార్‌, గుత్తా జ్వాల, అలీ, తాగుబోతు రమేష్‌, తదితరులు
 
సాప్ట్ వేర్ ఎంప్లాయి అయిన కార్తీక్‌ (నితిన్‌) తొలిచూపులోనే (ఇషా తల్వార్ ) శ్రుతి ప్రేమలో పడతాడు. ఎలాగైనా ఆ అమ్మాయితో మాట కలపాలని తన ఫోన్ నెంబర్ తెలుసుకుంటాడు. కానీ నెంబర్ తప్పు రాసుకోవడంతో శ్రుతికి బదులు వేరే అమ్మాయి శ్రావణి (నిత్యామీనన్ ) కి వెళుతుంది. కార్తీక్ తను చూసిన అమ్మాయే అనుకొని నిత్యామీనన్ తో మాటలు కలుపుతాడు. ఆమెతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోతాడు. కానీ అసలు నిజం తురువాత తెలియడంతో కార్తీక్ షాక్ తింటాడు. శ్రుతి వేరు.. తను ఫోన్ లో ప్రేమించే అమ్మాయి వేరు అని అర్దం అవుతుంది. అప్పుడు శ్రావణి ఏ నిర్ణయం తీసుకుంది. కార్తీక్‌ ఎవరితో కలిసి జీవితం పంచుకొన్నాడు? అనే విషయాల్ని తెరపైనే చూడాలి. గుండెజారి గల్లంతయిందే
pothe
గుండెజారి గల్లంతయ్యిందే
తన కెరియర్ మొదట్లో ప్రేమ కథా చిత్రాలు చేసిన నితిన్ మాస్ హీరోగా కూడా ప్రూవ్ చేసుకోవడానికి మాస్ సినిమాలు చేసి పరాజయాల పాలైన హీరో నితిన్ చాలా రోజుల తరువాత ‘ఇష్క్ ’ ప్రేమకధా చిత్రం చేసి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఇచ్చిన విజయంతో మళ్లీ అలాంటి కథనే ఎంచుకుకొని ‘గుండెజారి గల్లంతయిందే ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ప్రేక్షకుల గుండెల్ని ఏం చేసిందో ఓ సారి చూద్దాం.

ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలు వస్తే మాస్ గానో, వస్తే క్లాస్ గానో వస్తున్నాయి. కానీ ఈ రెండు సినిమాలు ప్రేక్షకులకు రొటీన్ అయిపోయాయి. అందుకే కొత్తగా వచ్చే దర్శకులు ప్రేక్షకుల నాడి, పల్ప్ ని కనిపెట్టి సినిమాలు తీస్తున్నారు. అదేకోవలోకి వస్తుంది ఈ చిత్రం. కొత్తదనం కోరుకుంటున్న ప్రేక్షకులకు ఈ చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. చిన్న పాయింట్ తీసుకొని దానికి ప్రేక్షకులకు కావాల్సింత సరుకు జోడించి తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన కామిడీ కన్నా ఎక్కువ ఉందనిపిస్తుంది. కథ నడిచే సమయంలో కామెడీని జొప్పించారు. ప్రథమార్థం సినిమాను దర్శకులు ఓ రేంజ్ లో తీశాడు. ఇంటర్వెల్ ముందు సినిమా హిట్ అనే నిర్ణయానికి వస్తాం. అదే ఊపును సెకండాఫ్ లో కొనసాగిస్తే బాగుండేది. ఫస్టాఫ్ గడిచినంత ఉల్లాసంగా, సెకండాప్ గడవదనే చెప్పాలి.

పూర్తిగా పవన్ కళ్యాణ్ వీరాభినానిని అని చెప్పుకుంటున్న నితిన్ అందుకు తగ్గట్లే పవన్ కళ్యాణ్ ని, తన ఫ్యాన్స్ ని కూడా ఉత్సాహ పరిచాడు. టైం దొరికినప్పుడల్లా తన అభిమానాన్ని విచ్చల విడిగా చూపించాడు. కథ ఎలా ముగుస్తుందో ఇంటర్వెల్ అప్పుడే ఓ అంచనా వేస్తాం. కానీ దానిని ఎలా ముగింపుకు తీసుకువెళతాడనేది కాస్తంత కఫ్యూజ్ గా ఉంటుంది. చివరగా ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేవిధంగా ముగిస్తాడు. స్పెషల్ ఎట్రాక్షన్ అని ఊదరకొట్టిన గుత్తా జ్వాలా సాంగ్ మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేదు.

Cinema Review

ఈ సినిమాలో హీరో నితిన్ నటన చాలా బాగుంది. ఇష్క్ చిత్రంలో కంటే ఇంకాస్త మెరుగ్గా చేశాడు. నితిన్ సినిమా సినిమాకి గ్లామర్ గా కనబడుతున్నాడు. మాస్ చిత్రాల కన్నా క్లాస్ చిత్రాలైతేనే బాగా సూటు అవుతాయి అనుకొన్న నితిన్ క్లాస్ హీరోగా బాగా యాక్టింగ్ చేశాడు. ఇక నితిన్ ప్రక్కన రెండో సారి నటించిన నిత్యా మీనన్ నటన ఈ సినిమాలో అద్బుతం. ఇప్పటికి నటించినవి కొన్ని సినిమాలే అయినా నటనా పరంగా తానేంటో నిరూపించుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో క్యారెక్టర్ నిత్యామీనన్ కే సాధ్యం అనేట్లుగా చేసింది. ఈ సినిమాతో ఈమెకు స్టార్ ఇమేజ్ రావడం ఖాయం. ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఇషా తల్వార్ అందం పరంగా ఓకే అనిపించింది కానీ, నటన పరంగా ఆమెకు కనీస మార్కులు కూడా వేయలేం. ఈమె చేసిన కొన్ని సన్నివేశాలు తేలిపోయాయి. కమేడియన్ ఆలీ, తాగుబోతు రమేష్ టైమింగ్ కామెడీని పండించారు. మిగతా నటులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పుకుంటున్న ఐటెం భామ గుత్తాజ్వాలా చేసిన డాన్స్ చూస్తే ప్రేక్షకులు నవ్విపోవడం ఖాయం. తొలిసారే ఐటెం బామగా ఎంట్రీ ఇచ్చిన ఈమె బాడీలో రిధమ్ లేదు. ఐటెం సాంగు ప్రేక్షకులకు ఊపునివ్వాలి.. కానీ గుత్తా ఆ ఊపు తీసుకొని రాలేకపోయింది.

యూత్ కి సరిపోయే లవ్ స్టోరీని ఎంచుకున్న దర్శకుడు దానికి తగ్గట్లే సినిమాటో గ్రాఫర్ ని ఎన్నకున్నాడు. లవ్ స్టోరీకి కావాల్సిన విజువల్స్ బాగా చూపించాడు. సాంగ్ ని బాగా చిత్రీకరించాడు. ఇక అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలెట్. ఈయన రీమిక్స్ చేసిన ‘తొలి ప్రేమ ’ పాట అదే తీసి పెట్టారా లేక, రీమిక్స్ చేశారా అనే తేడా కనిపించకుండా చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా వచ్చింది. నిర్మాతలు కూడా సినిమా క్యాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదని అనిపిస్తుంది. చాలా క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చారు. ఇక కొత్తగా దర్శకత్వం చేపట్టిన విజయ్ కుమార్ బెరుకు లేకుండా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలాగా చిన్న కాన్సెప్ట్ ని చాలా బాగా తెరకెక్కించాడు. విజయ్ కుమార్ కి అండగా హర్షవర్థన్ చేసిన రాసిన సంభాషణలతో దర్శకుడు మరింత రక్తి కట్టించాడు. యూత్ ని టార్గెట్ చేసి ఎంచుకున్న కథను వారికి తగ్గట్లు తీసి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాతో ఈ దర్శకుడి తరువాతి చిత్రం పై మంచి అంచనాలే ఉంటాయి. భవిష్యత్తులో ఎలాంటి చిత్రాలు తీస్తాడో చూడాలి.

chivaraga
 

యువత ‘గుండెల్ని గల్లంతు ’ చేసే చిత్రం.

No comments:

Post a Comment