సినిమా : బాద్‌షా (2013)
నటీనటులు : జూ.ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ , సిద్ధార్థ్, నవదీప్ , బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ తదితరులు.
డైరెక్టర్ : శ్రీనువైట్ల
ప్రొడ్యూసర్ : బండ్లగణేశ్ బాబు
సంగీతం : ఎస్ . తమన్
రేటింగ్ : 3.5
విడుదల తేదీ : ఏప్రిల్ 5, 2013
జూనియర్ ఎన్టీఆర్ గత రెండు చిత్రాలు అయిన
ఊసరవెల్లి, దమ్ము చిత్రాలు భారీ అంచనాల మధ్య విడుదల అయ్యి, బాక్సాఫీసు వద్ద
అభిమానుల్ని నిరాశ పరిచిన విషయం తెలిసిందే. దమ్ము సినిమా తురవాత భారీ
అంచనాలతో విడుదల అయిన బాద్ షా చిత్రం అభిమానులను అలరించిందో లేదో
చూద్దాం. ఇక ఎన్టీఆర్ కూడా హిట్ కోసం ఆకలి మీదున్న పులి లాగా ఎదురు
చూస్తున్నాడు.. ఇప్పటికే పలు సూపర్ హిట్ చిత్రాలు అందించిన శీనువైట్ల కూడా
ఇంకా కసితో, జూనియర్ కి బ్లాక్ బ్లస్టర్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తీశాడు.
ఎన్టీఆర్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా బాద్‌షా తెరకెక్కించిన సంగతి
తెలిసిందే. గబ్బర్‌సింగ్ తర్వాత బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రంపై అంచనాలు
అధికంగా ఉన్నాయి. ఇప్పటికే ఆన్ లైన్ లో ఈ సినిమా టిక్కెట్లు నాలుగు రోజుల
వరకూ అమ్ముడైపోయాయి. వేసవిలో పలు భారీ చిత్రాల రిలీజ్ హంగామా బాద్‌షాతోనే
మొదలవడం విశేషం. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి రివ్యూ చూద్దాం.
కథ:
కథ:
బాద్ షా (ఎన్టీఆర్) రంజన్ (ముఖేష్ రుషి )
కుమారుడు. ఇతను సాధుభాయ్ (కిల్లీ దోర్జీ ) ఇంటర్నేషనల్ మాఫిల్ డాన్ దగ్గర
పనిచేస్తుంటాడు. ఎన్టీఆర్ తండ్రి సాధుభాయ్ కి అంత్యంత నమ్మకస్తుడు. సాధు
బాయ్ క్రైం ప్రపంచంలో బాద్ షా యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ గా
దూసుకుపోతుంటాడు. ఎన్టీఆర్ తండ్రి రంజన్ సాధు బాయికి అంత్యంత లాభాలు తెచ్చే
కాసినోని చూసుకుంటూ ఉంటాడు. ఈ నేపథ్యంలో బాద్ షాకి, సాధు భాయికి మధ్య గొడవ
జరుగుతుంది దీంతో బాద్ షా ఫ్యామిలీని, అతని సామ్రాజ్యాన్ని కూల్చేయాలని
భావించి సాధుభాయి శత్రువులైన రాబర్ట్, విక్టర్ (ఆశీష్ విద్యార్థి, ప్రదీప్
రావత్ తో చేతులు కలుపుతాడు. ఇందులో భాగంగానే మాఫియా డాన్ అయిన సాధు భాయ్
ప్రధాన నగరాల్లో బాంబ్ బ్లాస్ట్ లకు ప్లాన్ చేస్తాడు. సాధు భాయ్ ప్లాన్స్
ని బాద్ షా చెడగొట్టాలనుకొని పోలీసు ఆఫీసర్ అయిన జై కృష్ణ సింహా(నాజర్)
జానకి (కాజల్) తండ్రి సహాయం తీసుకుంటాడు. అదే ఫ్యామిలీకి చెందిన పద్మనాభ
సింహా(బ్రహ్మానందం) సహాయంతో బాద్ షా గతం తెలుసుకొని సాధుభాయ్ ని అంతం
చేయడానికి ప్లాన్స్ వేస్తాడు. ఆ ప్లాన్స్ లో సక్సెస్ అవుతాడా ? అసలు బాద్
షా గా ఎలా మారాడు ? కాజల్ కి బాద్ షా కి లింకు ఏమిటి అన్నది తెర పై
చూడాల్సిందే.
కళా కారుళ పనితీరు :
ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎన్టీఆర్ నటన. బాద్ షా గా ఎన్.టి.ఆర్ అద్భుతమైన నటనని కనబరిచాడు. బాద్ షా అనే పదానికి ఎన్టీఆర్ న్యాయం చేశాడని చెప్పవచ్చు. బాద్ షా అనగానే... దూకుడుగా వ్యవహరించే స్వభావం, స్టైల్, అలాగే కొంచెం క్రూరమైన మనస్తత్వం ఉండాలి. ఇవన్నింటిని ఎన్టీఆర్ బాగా పండించాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ పంచ్ డైలాగులు బాగా పేలాయి. ఈ సినిమాలో తన తాత అయిన పెద్ద ఎన్టీఆర్ జస్టిస్ చౌదరి గెటప్పులో కనిపించి అదరగొట్టాడు. డాన్సుల పరంగా ఎన్టీఆర్ గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. ‘ సైరో సైరో ’, ‘ రంగోలి రంగోలి ’ పాటల్లో ఎన్.టి.ఆర్ స్టెప్పులు ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. ఎన్టీఆర్ ఇందులో అన్ని షేడ్స్ ఉన్న పాత్రలు చేశాడని చెప్పువచ్చు. ఫ్యాన్స్ కి ఈ సినిమా ఓ పండగా లాంటింది. ఇక కథానాయికగా నటించిన కాజల్ తన పాత్ర మేరకు బాగానే చేసింది.
ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎన్టీఆర్ నటన. బాద్ షా గా ఎన్.టి.ఆర్ అద్భుతమైన నటనని కనబరిచాడు. బాద్ షా అనే పదానికి ఎన్టీఆర్ న్యాయం చేశాడని చెప్పవచ్చు. బాద్ షా అనగానే... దూకుడుగా వ్యవహరించే స్వభావం, స్టైల్, అలాగే కొంచెం క్రూరమైన మనస్తత్వం ఉండాలి. ఇవన్నింటిని ఎన్టీఆర్ బాగా పండించాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ పంచ్ డైలాగులు బాగా పేలాయి. ఈ సినిమాలో తన తాత అయిన పెద్ద ఎన్టీఆర్ జస్టిస్ చౌదరి గెటప్పులో కనిపించి అదరగొట్టాడు. డాన్సుల పరంగా ఎన్టీఆర్ గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. ‘ సైరో సైరో ’, ‘ రంగోలి రంగోలి ’ పాటల్లో ఎన్.టి.ఆర్ స్టెప్పులు ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. ఎన్టీఆర్ ఇందులో అన్ని షేడ్స్ ఉన్న పాత్రలు చేశాడని చెప్పువచ్చు. ఫ్యాన్స్ కి ఈ సినిమా ఓ పండగా లాంటింది. ఇక కథానాయికగా నటించిన కాజల్ తన పాత్ర మేరకు బాగానే చేసింది.
ఇందులో నటించిన హాస్య బ్రహ్మ బ్రహ్మానందం
కామెడి హైలెట్. పద్మనాభ సింహా పాత్రలో బ్రహ్మీ చేసిన కామెడీకి ప్రేక్షకులు
కడుపుబ్బా నవ్వుకుంటారు. ప్రతి సినిమాలో బ్రహ్మానందాన్ని కేవలం కామెడీ కోసం
వాడుకుంటారు. కానీ శీనువైట్ల ఇతన్ని కామెడియన్ గానే కాకుండా స్టోరీలో కూడా
ఇన్వాల్వ్ చేశాడు. ప్రముఖ నటుడు నాజర్ పోలీసు ఆఫీసర్ పాత్రలో బాగా చేశాడు.
ఎన్.టి.ఆర్ – నాజర్ – బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగా పండాయి.
మరో కమేడియన్ అయిన ఎం.ఎస్ నారాయణ డైరెక్టర్ గెటప్పులో కనిపించి అందర్ని
బాగా నవ్వించాడు. ఇతని క్యారెక్టర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను పోలీ
ఉంటుంది. ఎం.ఎస్. నారాయణ, వెన్నెల కిషోర్ కామెడీ కూడా బాగా నవ్వుల్ని
తెప్పిస్తుంది. ఈ సినిమాకు కీలక సన్నివేశాల్లో మహేష్ బాబు చెప్పే వాయిస్
ఓవర్ బాగా కుదిరింది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన సిద్దార్థ పాత్ర కథను
మలుపు తిప్పే విధంగా ఉంది. నవదీప్ కూడా విలన్ గా బాగా నటించాడు.
సాంకేతిక విభాగం :
ఈ సినిమాలో హైలెట్
ఏంటంటే...సినిమాటోగ్రఫీ. దీనికి నలుగురు సినిమాటో గ్రాఫర్స్ పనిచేశారు.
వీరు నలుగు తీసిన షాట్స్ బాగున్నాయి. ఏ షాట్ ని ఎవరు షూట్ చేశారో చెప్పడం
మాత్రం కొద్దిగా కష్టమే. వీరి పనితీరు చాలా బాగుంది. విజువల్ ఎఫెక్స్
మాత్రం చాలా ఎఫెక్ట్ గా, రిచ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ కూడా బాగానే ఉన్నా,
ఫస్టాఫ్ లో కొద్దిగా బాగా చేయాల్సి ఉండేది. ఈ సినిమాకి సంగీతం అందించిన
తమన్ పాటల్లో నాలుగు పాటలే బాగున్నాయి. ఈయన అందించిన బ్యాక్ గ్రౌండ్
మ్యూజిక్ ఫర్వాలేదనిపిస్తుంది. కానీ ఇంకా బాగా చేయాల్సి ఉండేది. ఈ సినిమాకి
పాటల కొరియోగ్రాఫర్ ఎన్టీఆర్ తో వేయించిన స్టెప్స్ సెకండాఫ్ లో అబ్బా
అనిపించే విధంగా ఉన్నాయి. ఈ సినిమాకి గోపి మోహన్, కోన వెంకట్ లు స్క్రిప్టు
, డైలాగులు బాగున్నాయి. సింగిల్ లైన్ పంచ్ డైలాగులకు ఇందులో కొదవలేని
చెప్పవచ్చు.
విశ్లేషణ :
శీను వైట్ల సినిమా అనగానే మనకు
గుర్తొచ్చేది కామెడి. ఈ సినిమా స్టోరీ లైన్ కొత్తది కాకపోయినా శీను వైట్ల
తన మార్క్ కామెడితో సినిమాని నడిపించాడు. ఈ సినిమాకు కథా బలం కన్నా, కామెడీ
బలమే ఎక్కువ అని చెప్పవచ్చు. ప్రతి నటుడ్ని దర్శకుడు పూర్తి స్థాయిలో
వాడుకున్నాడు. ఫస్టాఫ్ లో కామెడీ, ఫైట్లతో కాస్తంత నెమ్మదిగా కథను
నడిపించిన దర్శకుడు, సెకండాఫ్ వచ్చే సరికి సినిమాను చాలా వేగంగా
నడిపించాడు. ఇందులో ఎన్టీఆర్ ని చూపించిన తీరు అద్బుతం. ప్రతి సీన్ ని,
ప్రతి పాటను ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాడు. ఈ సినిమాకు ఉన్న
చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే... శ్రీను వైట్ల పాత సినిమాలతో కొన్ని పోలికలు
ఉండడం. సినిమా చూస్తుంత సేపు అతని పాత సినిమాలోని సీన్లు మనకు గుర్తుకు
వస్తాయి. బ్రహ్మానందం, ఎం.ఎస్ నారాయణల కామెడీని బాగా తీశాడు. ఎన్.టి.ఆర్,
కాజల్, బ్రహ్మానందం, ఎం.ఎస్ నారాయణల బెస్ట్ పెర్ఫార్మన్స్ , వారి
కాంబినేషన్లో వచ్చే హై ఎంటర్టైనింగ్ సెకండాఫ్ ఈ సినిమాకి మేజర్ హైలైట్స్. ఈ
సినిమా భారీ ఆశలు పెట్టుకొని పోయిన అభిమానులకు రొటీన్ సినిమా అనిపించినా,
రెండున్నర గంటలు కడుపుబ్బ నవ్వుకొని రీ ఫ్రెష్ అయి రావడం మాత్రం ఖాయం.
చివరగా :
భారీ అంచనాల్ని రీచ్ కాకున్నా, అభిమానుల్ని నిరాశపరచని ‘బాద్ షా ’
No comments:
Post a Comment