Friday, 31 October 2014

I Movie Telugu Teaser


I Movie Telugu Teaser, విక్రమ్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఐ’ మూవీ విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా ఈ మూవీ తెలుగు వర్షన్ టీజర్ గురువారం విడుదల అయింది. ఒక నిమిషంకు పైగా నిడివి ఉన్న ఈ టీజర్ లో విక్రమ్ యాక్షన్ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ‘‘త్వరలో మిమ్మల్ని చూస్తా’’ అంటూ ఓ భయంకరమైన లుక్ తో విక్రమ్ గెటప్ సూపర్ గా ఉంది. ఈ టీజర్ చూసిన ఫ్యాన్స్ సినిమా ఎప్పుడొస్తుందా అని ఆరాటంగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో ఈ సినిమా పాటలు ఇంకా విడుదల కాలేదు. తమిళంలో విడుదల అయిన పాటలు, ట్రైలర్ దుమ్ములేపటంతో పాటు.., యూట్యూబ్ లో సంచలనం సృష్టించాయి.

For More Latest  Updates about Telugu News, Movie News, Gossips, Reviews and Gallery Logon  to www.teluguwishesh.com

Current Teega Telugu Movie Review


Current Teega Movie Review, సినిమా కధ శివరామరాజు (జగపతి బాబు) ఛాలెంజ్ తో మొదలవుతుంది. తన ముగ్గురు కూతుళ్ళు తాను చెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటారని వీర్రాజు (సుప్రీత్)తో శివరామరాజు ఛాలెంజ్ చేస్తాడు. ఆ ప్రకారంగానే ఇద్దరు కూతుళ్ళ పెళ్ళిళ్ళు జరుగుతాయి. మూడవ కూతురు కవిత (రకుల్ ప్రీత్ సింగ్) కాలేజ్ చదివే అమ్మాయి. ఊర్లో ఉండే రాజు(మనోజ్) డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటాడు. అలా ఉండలేక ఊర్లో అందరి విషయాల్లో వేలుపెట్టడం అలవాటు చేసుకున్నాడు. ఇక ఊర్లో టీచర్ గా పనిచేసే సన్నీ (సన్నీలియోన్)ని రాజు ప్రేమిస్తాడు. ఆ తర్వాత సన్నీ ఏమంటుంది, మళ్ళీ రకుల్ తో ఎలా ప్రేమలో పడతాడు, శివరామరాజును ఎలా ఒప్పిస్తాడు అని సాగే కధను థియేటర్ లో చూడండి.

For More Latest  Updates about Telugu News, Movie News, Gossips, Reviews and Gallery Logon  to www.teluguwishesh.com

Friday, 24 October 2014

Aamir Khan Pk Movie Teaser Released


అమీర్ ఖాన్ తాజా సినిమా ‘పీకే’ టీజర్ దీపావళి కానుకగా విడుదల అయింది. పండగ రోజున అభిమానులకు కానుక పంపుతున్నా అంటూ అమీర్ ఈ టీజర్ ను విడుదల చేశారు. సినిమాలను క్రిస్టమస్ కు విడుదల చేయటంతో పాటు.., వాటి ట్రైలర్లను దీపావళికి విడుదల చేయటం అమీర్ కు సెంటిమెంట్ గా వస్తోంది. ఆ ప్రకారంగానే ఈ సారి కూడా దీవాళికి ‘పీకే’ టీజర్ విడుడల చేశారు. గతంలో క్రిస్టమస్ సందర్బంగా విడుదల అయిన ‘తారే జమీన్ పర్’, ‘గజిని’, ‘3 ఇడియట్స్’ సినమాలు హిట్ కావటంతో ఆ సెంటిమెంట్ కలిసి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తన్నాడు.

Click Here to View Full Story

Karthikeya Movie Review


ఈ సినిమా కథ అంతా సుబ్రహ్మణ్యఫురంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయం చుట్టూ తిరుగుతుంది. పలు కారణాలతో ఈ ఆలయం మూసివేయబడుతుంది. ఇలా ఎందుకు జరిగింది అని తెలుసుకోవటానికి ప్రయత్నించేవారిని అందర్నీ ఓ పాము కాటేసి చంపేస్తుంది. ఇక కథలోపలికి వెళ్తే కార్తిక్ (నిఖిల్) తెలివైన మెడికల్ స్టూడెంట్. పోస్టింగ్ లో భాగంగా స్నేహితులతో కలిసి సుబ్రహ్మణ్యపురంకు వస్తాడు. అక్కడ కార్తిక్ కు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వీటిని పరిష్కరించాలని డిసైడ్ అయిన కార్తిక్ ఎలా మిస్టరీని ఛేధించాడు. అసలు పాము అందర్నీ ఎందుకు కాటేస్తుంది. హీరోయిన్ పాత్ర ఏమిటి అనేది తెరపై చూస్తేనే బాగుంటుంది.

Click Here to View Full Story

Friday, 26 September 2014

Loukyam Movie Review


చిత్రం  :లౌక్యం
బ్యానర్  :భవ్య క్రియేషన్స్
దర్శకుడు  :శ్రీవాస్
నిర్మాత  :వి.ఆనంద్ ప్రసాద్
సంగీతం  :అనూప్ రూబెన్స్
సినిమా రేటింగ్  :3.25
ఛాయాగ్రహణం  :వెట్రి
ఎడిటర్  :ఎస్.ఆర్.శేఖర్
నటినటులు  :గోపిచంద్, రకూల్ ప్రీత్ సింగ్, హంస నందిని, చంద్రమోహన్, బ్రహ్మానందం, పోసానీ కృష్ణమురళీ..

Cinema Story:

‘లౌక్యం’లో గోపిచంద్ క్యారెక్టర్ పేరు వెంకీ. ఇక మన హీరోయిన్ పాత్ర పేరు చంద్రకళ. కధ విషయానికి వస్తే.., ఈ సినిమాలో గోపిచంద్ ది వరంగల్. స్థానికంగా ఉండే పేరుమోసిన రౌడి బాబ్జి( సంపత్ రాజ్) పెద్ద చెల్లి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. అతడు గోపిచంద్ స్నేహితుడు. ఫ్రెండ్ కోసం రౌడి ఇంట్లో నుంచి అమ్మాయిని బయటకు తీసుకువచ్చి పెళ్లి చేసేందుకు గోపిచంద్ సాయం చేస్తాడు. పెళ్ళి విషయం బాబ్జికి తెలియటంతో.., జంటతో కలిసి కొద్దిరోజులు దూరంగా ఉండాలని వెంకట్ హైదరాబాద్ వెళ్తాడు. అక్కడ బాబ్జి చిన్న చెల్లి చంద్రకళ (రకుల్ ప్రీత్) అనుకోకుండా వెంకట్ కు పరిచయం అవుతుంది. తొలి చూపులోనే ప్రేమలో పడిపోవటంతో పాటు.., అమ్మాయినీ ప్రేమలోకి దింపుతాడు. ఈ విషయం బాబ్జికి తెలుస్తుంది. పెద్ద చెల్లి ప్రేమించి ఇంట్లోనుంచి వెళ్లిపోగా.., చిన్న చెల్లి కూడా ప్రేమలో ఉండటంతో.. కుటుంబం పరువు పోతుందని భావించి చంద్రకళను వరంగల్ తీసుకొచ్చేస్తాడు. విషయం తెలుసుకున్న వెంకట్.., చంద్రకళ కోసం సొంతూరికి వెళ్తాడు. అక్కడ బాబ్జి ఇంట్లోవారిని ఎలా ఒప్పిస్తాడు. పెద్ద చెల్లికి సాయం చేసిన విషయం తెలిసి బాబ్జి ఏమంటాడు అనేది కధ.
Read more ..

Click here for more Movie Reviews ..

Friday, 7 June 2013

Prema Katha Chitram Movie Review

Prema Katha Chitram Review
 
ప్రేమకథా చిత్రమ్ రివ్యూ
  • చిత్రం
    ప్రేమకథా చిత్రమ్
  • బ్యానర్
    మారుతి మూవీస్
  • దర్శకుడు
    జె. ప్రభాకర్ రెడ్డి
  • నిర్మాత
    మారుతి, ఆర్. సుదర్శన్ రెడ్డి
  • సంగీతం
    జె.బి.
  • సినిమా రేటింగ్
     - 3 - 3 - 3  3
  • ఛాయాగ్రహణం
    జె. ప్రభాకర్ రెడ్డి
  • ఎడిటర్
    ఎస్.బి. ఉద్దవ్
  • విడుదల తేది
    జూన్ 7, 2013
  • నటినటులు
    సుధీర్, ప్రవీణ్,సప్తగిరి, నందిత
Cinema Story
సుధీర్ (సుధీర్) ఓ అమ్మాయిని ప్రేమించి మోసపోయి చివరికి చనిపోదామని అనుకుంటాడు. నందిత(నందిత) ఈమె కూడా ప్రేమలో విఫలం అయిన ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. ప్రవీణ్ (ప్రవీణ్) కూడా చిన్న కారణంతో ఆత్మచేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. వీరు ముగ్గరు చనిపోదామనుకొని వెళతారు. అక్కడ మరోకరు (సప్తగిరి) కూడా వీళ్లకు తోడవుతాడు. అక్కడ వీరు ఏ కారణాలతో చనిపోదానుకుంటారో చెప్పుకుంటారు. ఇంతలో అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ నలుగురిలో ప్రేమలో విఫలం అయిన సుధీర్, నందితలు ఎవర్ని ప్రేమిస్తారు ? వీరి మధ్య ఓ దెయ్యం ప్రవేశిస్తుంది ? ఆ దెయ్యం ఎవరు ? చివరికి చనిపోదామనుకున్న వారు చనిపోతారా ? వారికి ఎదురైన సంఘటన నుండి వారికి వారు ఎలా కాపాడుకుంటారు అనేది మిగతా కథ.
cinima-reviews
ప్రేమకథా చిత్రమ్ప్రేమకథా చిత్రమ్ రివ్యూ
దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి యూత్ ని ఆకట్టుకునే విధంగా ‘ఈరోజుల్లో, బస్ స్టాప్ ’ చిత్రాలు మంచి హిట్ సాధించమే కాకుండా పేరు ప్రఖ్యాతలతో పాటు బూతు చిత్రాల దర్శకుడిగా పేరు సంపాదించుకున్న దాసరి మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో, కథ, మాటలు, నిర్మాతగా వ్యవహరిస్తూ జె. ప్రభాకర్ రెడ్డిని దర్శకుడిగా పెట్టి దెయ్యం కథను తీసుకొని దానికి రొమాన్స్, కామెడీ అనే అంశాలను మిక్స్,  చేసి తీసిన ‘ప్రేమకథా చిత్రమ్ ’ ప్రేక్షకుల్ని ఏ మాత్రం అలరించిందో ఈ రివ్యూలో చూద్దాం.
ఓ హారర్ స్టోరీని తీసుకొని దానికి అనేక హంగులు జోడించి సినిమా ప్రారంభం నుండి ఇంటర్వెల్ వరకు ఓ ప్రేమకథా చిత్రాన్ని చూపిస్తున్నామన్న ఫీలింగ్ ను కలుగ జేసి, ఇంటర్వెల్ లో ట్విస్టుతో ఈ సినిమా లవ్ స్టోరీ కాదు... హారర్ పిక్చర్ అని ప్రేక్షకులకు షాక్ ఇస్తాడు దర్శకుడు. చాలా సాదాసీదాగా మొదలై నెమ్మదిగా ఊపందుకొని ఓ చిన్న ట్విస్టుతో రెండో భాగంలో ప్రవేశించి, సీన్ తరువాత సీన్ వస్తూ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తూ కథను ముందుకు నడిపాడు దర్శకుడు. పతాక సన్నివేశాలు కాస్తంత రొటీగా ఉన్నా మొత్తంగా సినిమా చూస్తే ఓ భిన్నమైన సినిమాను చూసిన ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకులకు. ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణాలు ఉంటాయి కానీ, ఈ మధ్యలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలనే కాన్సెప్టును దర్శకుడు బాగా చూపించాడు. ఈ "ప్రేమ కథా చిత్రం". ఎక్కడా బోర్ కొట్టకుండా అడుగడుగునా ఆసక్తిని రేకెత్తిస్తూ, కడుపుబ్బా నవ్విస్తూ హాయిగా సాగిపోతుంది
Cinema Review
ఈ చిత్రంలో నటించిన సుధీర్ బాబు తన మొదటి సినిమా కన్నా ఈ సినిమాలో ఇంకాస్త ఫర్వాలేదనిపించాడు. మిగతా నటులు అయిన ప్రదీప్, సప్తగిరి తన హావభావాలతో చక్కని అభినయాన్ని ప్రదర్శించారు. నటనతో పాటు కామెడీని కూడా బాగా పండించారు. ‘నీకు నాకు డాష్ డాష్ ’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నందిత ఆ సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఇందులో మెయిన్ రోల్ పోషించిన ఈమె ఫెర్మామెన్స్ లో ఏ మాత్రం బెరుకుదనం కనబర్చలేదు. ఈ చిత్రానికి నందిత పూర్తి న్యాయం చేసిందని చెప్పవచ్చు. ప్రియురాలిగానూ, కాలేజ్ గర్ల్ గానూ, దెయ్యం పాత్రలోనూ ఇలా మూడు రకాల పాత్రల్లో చక్కటి అభినయం ప్రదర్శించింది. ప్రధానంగా ఈ నలుగురి చేట్టే కథ నడుస్తుంది.

సాంకేతిక విభాగం :
ఈ సినిమాకు ముఖ్యంగా మారుతి రచన, దర్శకత్వ ప్రర్యవేక్షణ కలిసొస్తే, దర్శకుడు, ఛాయాగ్రాహకుడు అయిన జే. ప్రభాకర్ రెడ్డి కావడం సినిమాకు ప్రాణం పోసింది. ప్రతి సన్నివేశాన్ని తనదైన శైలిలో బాగా చూపించాడు. జె.బి. సంగీతం ఆకట్టుకునే విధంగా లేకపోయినా, ఫర్వాలేదనిపిస్తుంది. బడ్జెట్ పరంగా ఈ సినిమాను ఉన్నంతలో బాగా తీశారు. మారుతి దర్శకత్వ పర్యవేక్షణ చేశారో లేక వెనక దర్శకత్వం చేశారో కానీ ఆయన మార్క్ సినిమాలో కచ్చితంగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు రచన కూడా చేసిన మారుతి తన బూతు బుద్దిని పోనిచ్చుకోలేదు.  గులాబ్ జాములు పగిలిపోతాయి, క్రికెట్ ఆడటం మొదలు పెడితే ఇక మరిచిపోరు... లాంటి రెండు మూడు సంభాషణలతో తన పాత సినిమాలను గుర్తుకు తెస్తాయి. ఒకే కథలో రెండు మూడు కోణాలు ఉంటాయి కాబట్టి దర్శకులు కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. మారుతీ ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకొని పని చేసినట్టు అర్థం అవుతుంది. దర్శకుడిగా ప్రభాకర్ రెడ్డి, రచయితగా, మారుతి తన ప్రతిభను చూపించారు.
chivaraga
ఈ వేసవి సీజన్ ని ఓ మంచి సినిమాతో ముగించాలనుకునే సినిమా ప్రేమికులకు ‘ప్రేమకథా హాస్యమ్ ’ బాగా పనికొస్తుంది.