Thursday, 27 December 2012

Yamudiki Mogudu Movie Review

yanaa_in

చిత్ర పేరు : ‘యముడికి మొగుడు’
విడుదలతేదీ : 27.12.2012
బ్యానర్ :       ఫ్రెండ్లీ మూవీస్‌
కథామూలం : జయసిద్ధు,
మాటలు :      క్రాంతిరెడ్డి సకినాల,
సంగీతం :      కోటి,
కెమెరా :       కె.రవీంద్రబాబు.
నిర్మాత :      చంటి అడ్డాల
దర్శకత్వం :   ఇ.సత్తిబాబు
నటీనటులు:   నరేష్‌, రిచా పనయ్‌, సాయాజీ షిండే, రమ్యకృష్ణ, చంద్రమోహన్‌, నరేష్‌, చలపతిరావు, కృష్ణభగవాన్‌, భరత్‌, రఘుబాబు తదితరులు.

తెలుగువిశేష్.కాం రేటింగ్ : 2.25

పరిచయం :
       ఒకప్పటి బ్లాక్ బస్టర్ మూవీ ‘యముడికి మొగుడు’ సినిమా టైటిల్ తో ఈ దఫా.. ప్రొడ్యూసర్స్ పాలిట మినిమం గ్యారంటీ హీరో అల్లరి నరేష్ ముందుకొచ్చాడు. కుల,మతాంతర వివాహాలు జరుగుతోన్న ప్రస్తుతకాలంలో లోకాంతర వివాహాం అనే థీంతో ఈ సినిమా తెరకెక్కింది. సోషియో ఫాంటసీ నేపధ్యమున్న కథలో అల్లరి నరేష్ నటించటం ఇదే తొలిసారి. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ యముడికి మొగుడెలా అయ్యాడో ఇప్పుడు చూద్దాం.

చిత్రకథ :
       బతికుండానే హీరో పైలోకానికి కెందుకెళ్ళాడు. అసలు యమలోకంలో యముడి కూతురినే ఎందుకు ప్రేమించాడు?  బ్రహ్మ అతడి తలరాత అలాగే ఎందుకు రాశాడు అనే అనే ప్రశ్నలకు జవాబే క్లుప్తంగా ఈ సినిమా... ఇక కథలోకి వెళితే.. బ్రహ్మ  చేసిన పొరపాటు వల్ల పుట్టిన నరేష్‌ (నరేష్‌) కి నుదిట రాత అనేది ఉండదు. దాంతో అతను దైవుళ్ళతో సమానంగా ఏది కోరుకుంటే అది జరిగే శక్తి పుట్టకతోనే వస్తుంది. కానీ ఆ విషయం అతనికి తెలియదు. ఈ తరుణంలో నారదుడి మాయ వల్ల యముడి (సాయాజీ షిండే) కూతురు యమజ (రిచా పనయ్‌) భూమి మీదకు వచ్చి... నరేష్ చేత మెళ్లో పూల దండ వేయించుకుంటుంది. దాంతో పూల దండ వేసిన వాడే తన భర్త అని.. తన భర్తకోసం తపిస్తూ ఉంటుంది. విషయం తెలియని నరేష్ ఆమెను వదిలించుకోవాలని ప్రయత్నిస్తూనే ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే తన కూతురు ఓ మానవుడుతో జీవితం పంచుకుంటోందని తెలిసిన యముడు... భూమి మీదకు వచ్చి ఆమెను తనతో తమ లోకానికి తీసుకు వెళ్లతాడు. అప్పుడు నరేష్ ఏం చేసాడు. అనేది చిత్రంలోని కీలకాంశం.

విశ్లేషణ :
     ముఖ్యంగా చెప్పాల్సిందేమంటే.. దర్శకుడు స్క్రిప్టుపై సరైన శ్రద్ద పెట్టకపోవటంతో సినిమా అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఫస్టాఫ్.. పంచ్  డైలాగులు, మంచి కామెడీతో ఫన్ చేసినప్పటికీ సెకండాఫ్ లో బోర్ కొట్టించేశాడు.  ముఖ్యంగా క్లైమాక్స్ చాలా డల్ గా, పేలవంగా తేలిపోయింది. యముడు కూతురు యమజ కి అసలు వ్యక్తిత్వం ఉన్నట్లు చూపలేదు. యముడు.. పాత్రను స్త్రీ లోలుడుగా...పాపులుగా వచ్చిన స్త్రీలకు లైన్ వేస్తూ, మందు కొడుతూ ఉండటం అంతగా రుచించలేదు. చిత్ర గుప్తుడు పాత్ర ద్వంద్వార్దాలు పలకటమే జీవితాశయంగా సాగింది. . ఇక ప్రీ క్లైమాక్స్ నుంచీ టీవి సీరియల్ సెంటిమెంట్ క్రియేట్ చేయటం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది.

నటీనటుల పనితీరు :
       హీరో అల్లరి నరేష్ ఎప్పటిలాగే కామెడీ పండించాడు. అతని  పంచ్ డైలాగ్స్ బాగానే పేలాయి. ఆడపిల్ల గెటప్ లో అదుర్స్ అనిపించాడు.  హీరోయిన్ రిచా పనయ్ నటన ఓ మోస్తరుగా సాగింది.  బాగా వళ్లు చేసిన రమ్యకృష్ణ అల్లుడా మజాకాలో అత్తో..అత్తమ్మ కూతురో పాటకు స్టెప్స్ వేస్తే ప్రేక్షకులు  ఎంజాయ్ చేశారు.  షియాజీ షిండే యముడి పాత్రలో పెద్దగా రక్తికట్టించలేదు. హీరో తండ్రిగా చంద్రమోహన్ నటన రెగ్యులర్. తణికెళ్ల భరిణి రొయ్యలనాయుడిగా నెగిటివ్ పాత్ర లో మరీ రెచ్చిపోయాడు. రఘుబాబు పాత్ర లో హాస్యం అక్కడక్కడే పేలింది. మాస్టర్ భరత్ యంగ్ భరత్ అయ్యాడు. మిగతా నటీనటులందరూ వారి పరిధి మేర నటించారు.

సాంకేతిక వర్గం :
       దర్శకుడి పనితనంలో లోపాలు స్పష్టంగా కనిపించాయి. సెకండాఫ్ లో కథనాన్ని నడపటంలో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. కేవలం యముడ్ని అడ్డం పెట్టుకుని సినిమాని పూర్తి చేద్దామనుకున్నాడు. కెమెరా వర్క్ సోసోగా ఉంది. ఎడిటింగ్ కి ఇంకా పని చెప్పాలి. గ్రాఫిక్స్ వర్క్ ఫర్వాలేదు.

చివరి మాట : 
       యముడికి మొగుడయ్యాడో లేదో అటుంచితే. ప్రేక్షకులకు మాత్రం నరకలోక సందర్శన జరిగింది.
...avnk

Friday, 21 December 2012

Sarocharu Movie Review

 

 sar-eee


సినిమా పేరు : ‘సారొచ్చారు’
విడుదల తేదీ : 21 12 2012
సమర్పణ : వైజయంతి మూవీస్
బ్యానర్ : త్రీ ఏంజెల్స్ స్టూడియో ప్రై.లిమిటెడ్
దర్శకత్వం  : పరశురామ్
నిర్మాత : సి.అశ్వనీదత్ కుమార్తె ప్రియాంకాదత్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
కో-డైరెక్టర్స్: కిరణ్, బుజ్జి
ప్రొడక్షన్ కంట్రోలర్: వి.మోహనరావు
తారాగణం : రవితేజ, కాజల్, రిచా గంగోపాధ్యాయ, జయసుధ, చంద్రమోహన్, రవిప్రకాష్, ఎమ్మెస్ నారాయణ, శ్రీనివాసరెడ్డి, కల్పిక తదితరులు
తెలుగువిశేష్.కాం రేటింగ్ : 2.25

పరిచయం :
         మాస్ మహారాజ రవితేజ - డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్లో 'ఆంజనేయులు' మూవీ తర్వాత వస్తోన్న మరో సినిమా ‘సారొచ్చారు’. నిర్మాత ప్రియాంకదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సినిమాని నిర్మించారు. ఈ సారి అందాల భామలు కాజల్, రిచా గంగోపాధ్యాయ తో జోడీకట్టిన రవితేజ ఈ మూవీ మీద చాలా ఆశలే పెట్టుకున్నారు. కొంతకాలంగా సూపర్ హిట్ కోసం పరితపిస్తోన్న రవికి ఈ మూవీ ఎంతమేరకు ఉపశమనం కలిగిస్తుందో ఇప్పుడు చూద్దాం..

చిత్రకథ :
      తనను అమితంగా ఇష్టపడే అమ్మాయితో ఒక కట్టుకథ చెప్పి హీరో ఎందుకు ఆమె ప్రేమను కాదన్నాడు అనేది ఈ చిత్రంలో కీలకాంశం. జర్నీలో అయిన పరిచయంతో కార్తిక్(రవితేజ) వెంటపడి సంధ్య(కాజల్) ప్రేమించమని వేడుకుంటుంది. అయితే హీరో కార్తిక్ వసుధ(రిచా గంగోపాధ్యయ) పేరు చెప్పి ఆమెతో ప్రేమాయణం ఉందని తప్పుకోచూస్తాడు.  ఈ క్రమంలో తలెత్తిన, పరిణామాలు.. ట్విస్ట్స్.. ఏంటనేది తెరమీదే చూడాలి.

విశ్లేషణ :
       హీరో రవితేజ కొంచెం క్లాస్ టచ్ తో ఈ సినిమాలో నటించాడు.  తొలుత వచ్చిన విశాఖపట్నంలో జరిగే  చేజింగ్ సీన్లో రవి యాక్షన్ ఆకట్టుకుంటుంది. డైలాగ్ డెలివరీలో రవితేజ తన ఎప్పటి పంధాని కొనసాగించాడు. 'నేను ఒకసారి యాక్షన్ లోకి దిగితే అవతల వాడికి రియాక్షన్ కట్ చేసే టైం కూడా ఉండదు' అన్న డైలాగ్ బాగా పేలింది.
       ఇక హీరోయిన్ కాజల్ అందంలోనూ అభినయంలోనూ మంచి మార్కులే కొట్టేసింది. చాలా ఎనర్జిటిక్ గా కనిపించింది. ‘ఖుషి సినిమా చూసి పవన్ కళ్యాణ్ ని పెళ్లిచేసుకుందామనుకున్నా’ అన్న కాజల్ డైలాగ్ కు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. మరో హీరోయిన్ రిచా పరిధి ఈ మూవీలో అంతంతమాత్రమే.
        పాటల విషయానికొస్తే.. మొత్తం ఇటలీలో షూట్ చేసిన మొదటి పాట 'మేడ్ ఫర్ ఈచ్ ఆదర్' చిత్రీకరణ, ఫొటోగ్రఫీ బావుంది. రెండవ పాట 'జగ జగ జగదేకవీర' యూరప్ లోని అందమైన లోకేషన్స్ లో చిత్రీకరించారు. ఈ సాంగ్ లో డ్యాన్స్ లు అదిరిపోయాయి. ప్రత్యేకంగా రూపొందించిన సెట్ లో చిత్రీకరించిన 'రచ్చ రంబోలా' పాటలో.. 'గుస గుస' సాంగ్ లోనూ రవితేజ - రిచా రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు.  మంచి లొకేషన్స్లో పాటలు చిత్రీకరించారు అన్ని సాంగ్స్ లోనూ కెమరా పనితనం కనిపించింది.
         ఇంకా.. రవితేజ - రిచా మధ్య రొమాంటిక్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. రిచా బ్రదర్ గా మాస్టర్ భరత్ హాస్యాన్ని ఒలికించాడు. జయసుధ మేనల్లుడి పాత్రలో నారా రోహిత్ నటన ఓకే. కాబోయే కథా రచయితగా ప్లాటినం ప్రసాద్ పాత్రలో ఎమ్ .ఎస్ నారాయణ ఫుల్ కామెడీ పండించాడు.
       అయితే,  స్క్రీన్ ప్లేలో లోపాలు సినిమా ఆద్యంతం తలెత్తి చూశాయి. కెమెరా ఓకే. ఎడిటింగ్ బాలేదు.  రిచా గంగోపాధ్యాయ అభినయం ఒ మోస్తరు అనిపిస్తుంది.. రిచాతో ప్రేమాయణం అంటూ కాజల్ కి చెప్పిన కథ (రవితేజ కల్పించిన అభూతకల్పన ఫ్లాష్ బ్యాక్) వర్కౌట్ అయ్యే సూచనలు కనిపించటంలేదు. కథలో లాజిక్ కొరవడటం, ఫైటింగ్ సన్నివేశాలు రొటీన్ అనిపిస్తాయి. హీరో-హీరోయిన్ల లవ్ విషయంలో ఏదో చేద్దామనుకున్న దర్శకుడి  ప్రయోగం ప్రేక్షకులకు అంతగా రుచించదు. స్టోరీలో పట్టులేకపోవటం పెద్ద మైనస్.

చివరి మాట :
       సమావేశానికి సారొచ్చారు కాని.. పూర్ కామెడీ, వీక్ డైలాగ్స్, రొటీన్ స్టోరీ తో ప్రసంగం బుస్సుమంది. ...
  • Sarocharu
  • Sarocharu
  • Sarocharu
  • Sarocharu
  • Sarocharu
  • Sarocharu
  • Sarocharu
  • Sarocharu
  • Sarocharu
  • Sarocharu
avnk

Friday, 14 December 2012

Eto Vellipoyindi Manasu Review

et_e
సినిమా పేరు :‘ఎటో వెళ్లిపోయింది మనసు’
విడుదల తేదీ : 14.12.2012
డైరెక్టర్ :  గౌతమ్ వాసుదేవ మీనన్
నిర్మాత : సి.కల్యాణ్
సంగీతం : ఇళయరాజా
 కెమెరా : ప్రభు, ఓం ప్రకాష్,
మాటలు : కోన వెంకట్,
పాటలు : అనంత్‌శ్రీరామ్,
సహ నిర్మాత : సి.వి.రావు
తారాగణం :  నాని, సమంతా, కృష్ణుడు, విద్యు, అనుపమ, రవి రాఘవేంద్ర, శ్రీరంజని తదితరులు
తెలుగువిశేష్.కాం రేటింగ్ :3.25

పరిచయం :
       జనరల్ గా దర్శకుడు గౌతం వాసుదేవ మీనన్ సినిమాలంటే చిత్ర సీమలో ఓ క్రేజ్ ఉంది. దీనికి తోడు హిట్స్ తో మంచి ఊపుమీదున్న హీరో, హీరోయిన్ నాని సమంతా. దీనికితోడు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా స్వరాలు సమకూర్చటం. దీంతో ఈ మూవీ మీద అంచానాలు బాగా పెరిగిపోయాయి. హై ఎక్స్పెక్టేషన్స్ నడుమ  ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రిలీజైన 'ఎటో వెళ్ళిపోయింది మనసు' చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
చిత్ర కథ :
       చిన్నతనంనుంచీ ప్రేమ పరిమళించిన ఒక అమ్మాయి, అబ్బాయిలోని సున్నితమైన భావోద్వేగాలు. నిజజీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదో సందర్భంలో ఎదురైన  మధుర స్మృతి ఎంత తీయగా ఉంటుంది. ఇలా ఓ యువజంట జీవితాల్లో మూడు దశల్లో కలిగే ప్రేమ భావనల సమాహారమే క్లుప్తంగా ఈ చిత్రం. ఇక కథలోకి వెళితే.. వరుణ్ క్రిష్ణ(నాని), నిత్యా(సమంతా) వీరిద్దరూ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచీ క్లాస్ మెట్స్, మంచి ఫ్రెండ్స్ కూడా. ఎనిమిదేళ్ల ప్రాయంలో మొగ్గవిప్పిన వీరి ప్రేమ టీనేజ్, యంగ్ ఏజ్ చేరే సరికి ఏయే రూపం తీసుకుంది.. ప్రేమలో ఎదురైన ఒడిదుడుకులను వీరిద్దరూ ఎలా అధిగమించి తమ ప్రేమను పండించుకున్నారు అనేదే ఈ చిత్రం. ఇందులోని కీలక మలుపులు ఏంటన్నది తెరమీదే చూడాలి.
సమీక్ష :
        ముందుగా చిత్ర నటీనటుల విషయానికొస్తే, హీరో నాని నటన తనదైన సైలిలోనే ఉంది. అతని డైలాగ్ డెలివరీ బావుంది. ప్రత్యేకంగా చెప్పాల్సిందేమంటే క్లైమాక్స్ సన్నివేశంలో నాని ప్రదర్శించిన నటన అద్భుతం. ఇంతకు ముందు ఏ సినిమాలోనూ చేయనంత బాగా సీన్ రక్తికట్టించాడు. 'నచ్చలేదు మావ' పాటలో చాలా యంగ్ గా కనిపించాడు. హీరోయిన్ సమంతా మూడు తరహా పాత్రలనూ మెప్పించింది.  ఏ పాత్రకు తగ్గట్టుగా ఆ అభినయాన్ని ఒలకబోస్తూ ఔరా అనిపించింది. ఇటీవల హీరోగా వరుస సినిమాలు చేస్తున్న క్రుష్ణుడు ఈ మూవీలో హీరో ఫ్రెండ్ గా కామెడీ అద్భుతంగా పండించాడు. అతనికి మంచి పాత్ర ఈ మూవీలో లభించింది.  'కోటి కోటి తారల్లోనా' సాంగ్ లో జీవా స్పెషల్ అప్పీయరెన్స్ బావుంది.
           ఇక దర్శకుడు గౌతం మీనన్ కు స్ర్కీన్ ప్లే, స్టోరీ నెరేట్ చేయటంలో తిరుగులేదని అంతా భావించేదే. దీనికి తగ్గట్టుగానే దర్శకుడు కథనాన్ని నడిపాడు. అయితే ప్రథమార్థంలో చిత్రం బాగా స్లో అనిపిస్తుంది. ఇదే ఈ మూవీలో భారీ లోటు. ఇతర తారాగణ మంతా వారి వారి పరిధి మేరకు నటించారు.
సాంకేతిక విభాగం :
         గౌతం మీనన్ డైరెక్షన్ ఓకే. ప్రభు సినిమాటోగ్రఫీ, లొకేషన్స్ చూడ చక్కగా ఉన్నాయి. మ్యాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ చిత్రానికి అదనపు భలం. ఎడిటింగ్ ఫర్వాలేదు.
చివరి మాట :
        ఎటో వెళ్ళిపోయింది మనసు సర్ఫెక్సెల్ సిద్ధాంతం.. మరక మంచిదేలా ప్రేమలో ఆటుపోట్లూ మంచివే అని తేల్చాడు గౌతం
Yeto Vellipoindi Manasu Review
  • Yeto Vellipoindi Manasu Review
  • Yeto Vellipoindi Manasu Review
  • Yeto Vellipoindi Manasu Review
  • Yeto Vellipoindi Manasu Review
  • Yeto Vellipoindi Manasu Review
  • Yeto Vellipoindi Manasu Review
  • Yeto Vellipoindi Manasu Review
  • Yeto Vellipoindi Manasu Review

...avnk

Friday, 30 November 2012

Krishnam Vande Jagadgurum Review

 

సినిమా పేరు : ‘కృష్ణం వందే జగద్గురుం’
విడుదల తేదీ: 30 నవంబర్ 2012
దర్శకుడు : క్రిష్
నిర్మాత : సాయి బాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డి
సంగీతం : మణిశర్మ
నటీనటులు : రానా, నయనతార, బ్రహ్మానందం, కోట, పోసాని, మిలింద్ గునాజి, ఎల్బీ శ్రీరామ్, మురళి శర్మ,  రఘుబాబు,  సత్యం రాజేష్, వెంకటేష్ గెస్ట్ అప్పీరియెన్స్

తెలుగువిశేష్.కాం రేటింగ్ : 3.5
Krishnam_Vande_Jagadgurum_innee

పరిచయం :       
   హీరో దర్శకుడు ఇద్దరికీ కమర్షియల్ హిట్ అవసరమైన టైంలో రూపుదిద్దుకున్న రానా, క్రిష్ భారీ మూవీ ‘కృష్ణం వందే జగద్గురుం’. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఇవాళ వెండితెరలను తాకింది. ఎప్పుడూ క్రియేటివ్ గా తన సినిమాలను తెరకెక్కించే క్రిష్ ఈసారి తన తాజా మూవీకి చాలా వరకూ కమర్షియల్ హంగులు అద్దాడు. తెలుగు భాష, సంస్కృతి పరిఢవిల్లే సినిమా ఇదంటూ ఈ మూవీ ఆడియో ఫంక్షన్లో మహామహులు ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకూ అలరించిందో. హీరో రానాకు, క్రిష్ కు ఈ సినిమా ఎంతవరకూ పేరు తెచ్చిపెడుతుందో ఇప్పుడు చూద్దాం.
 
కథాంశం :
        వంశపారంపర్యంగా వచ్చే ఉపాదికి స్వస్తి చెప్పి విదేశాలకు వెళ్లి జీవితం గడపాలనుకున్న ఓ యువకుడు జీవితం ఎలా మలుపు తీసుకుంది అనేది ఈ చిత్ర కథాంశం. ఇందులో తెలుగు జాతి, భాష, సంస్కృతి , కళా సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ  సమాజంలో అక్రమార్కుల ఆటకట్టించటమే ఈ చిత్రంలో ప్రధానం. ఇక కథలోకి వెళితే, బి.టెక్ బాబు (రానా) వీసా వస్తే అమెరికా వెళ్లిపోదామని అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు. అతనికి వారసత్వంగా వస్తున్న నాటకాలు వేసే వ్రుత్తి మీద ఆసక్తి ఉండదు. అయితే సుబ్రహ్మణ్యం (కోట శ్రీనివాస రావు) కి మనవడు అమెరికా వెళ్ళడం ఇష్టం ఉండదు. ఈ పరిస్థితుల్లో అందాకా, బాబు తన తాత బలవంతం మీద నాటకాల్లో నటిస్తుంటాడు. తన సొంత ఊరు బళ్ళారిలో ఒకసారి నాటకం వేయాలని సుబ్రహ్మణ్యం కోరిక. ఆ కోరిక తీరకుండానే సుబ్రహ్మణ్యం చనిపోతాడు.

      ఇక్కడ కథ అనుకోని టర్న్ తీసుకుంటుంది.  బళ్ళారిలో నాటకం వేసి తాత చివరి కోరిక తీర్చి అక్కడే ఆయన అస్థికలు కలపడానికి బాబు భళ్లారి వెళతాడు. అక్కడే జర్నలిస్ట్ దేవిక (నయనతార) పరిచయమవుతుంది. తన ఊరిలో జరుగుతున్న మైనింగ్ మాఫియా గురించి దేవిక చెప్పిన మాటలు బాబుని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. రెడ్డప్ప (మిలింద్ గునాజి) చేస్తున్న అక్రమాలు, అరచాకాల మీద కత్తి దూసిన బాబు వీరి పద్మవ్యూహం నుంచి తప్పించుకుని ఎలా అక్రమార్కుల ఆట కట్టించాడనేది తెరమీదే చూడాలి.

krishnam_vande_jagadgurum2e 
నటీనటుల పనితీరు  :
      ప్రస్తుతం నడుస్తోన్న సినిమాల్లో సురభి నాటకాలు వేసే పాత్ర దొరకటం బహు అరుదు. ఈ అవకాశాన్ని రానా పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నాడు. బీటెక్ బాబుగా రానా నటన, అతని డైలాగ్ డెలివరి, టైమింగ్ ఆకట్టుకోవటమే కాదు నటనలో పరిణితి కనిపించింది. నాటకాలు కట్టే సమయంలో అయితే అమోఘం. భారీ స్లోకాన్ని రానా చెప్పిన తీరు ఔరా అనిపించక మానదు.

        ఇక హీరోయిన్ నయన్ కు దేవికగా కీలక పాత్ర దొరికింది. రెండో దఫా తెరంగేట్రం చేసిన నయన తారకు కలిసొచ్చే సినిమా ఇది అనటం అతిశయోక్తి కాదు. అరెరే పసి మనసా పాటలో ఆమె అభినయానికి నూటికి నూరు మార్కులు పడతాయి. ఇక ఏ పాత్రలో అయినా ఇమిడిపోగల కోట శ్రీనివాస రావు గూర్చి చెప్పాల్సిన అవసరం ఏముంటుంది..
        తన తొలి తెలుగు చిత్రం లోనే విలన్ పాత్రలో మిలింద్ గునాజి ప్రతిభ కనబరిచాడు. టిప్పు సుల్తాన్ పాత్రలో పోసాని కృష్ణ మురళి, రంపం పాత్రలో బ్రహ్మానందం నవ్వించారు. మట్టిరాజు పాత్రలో ఎల్బీ శ్రీరామ్, ఇంకా మురళి శర్మ, రఘుబాబు, సత్యం రాజేష్ పాత్ర పరిధి మేరకు నటించారు. సై ఆంధ్రి నాను పాటలో వెంకటేష్ గెస్ట్ అప్పీరియెన్స్ అదుర్స్ అనిపించింది.

 అనుకూల ప్రతికూలాంశాలు :
       మొత్తం సినిమాలోని కళాకారులందరి నుంచీ, ప్రతిభను పూర్తి స్థాయిలో, వారి వారి పరిధి మేరకు ఔట్ తీసుకోవటంలో దర్శకుడు సఫలమయ్యాడు.  ఇంటర్వెల్ ముందు ఎపిసోడ్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయి. అయితే విభిన్న కథాంశం కారణంగా  ప్రారంభంలో వచ్చే సురభి నాటకాల ఎపిసోడ్స్ యువ ఆడియన్స్ అర్ధం చేసుకోడానికి కొంత సమయం పడుతుంది. మొదట స్లోగా అనిపించి అనంతరం కథ స్పీడ్ అందుకుంటుంది. 
         
   ఫస్టాఫ్ లో వచ్చిన స్పైసి స్పైసి గర్ల్, రెండవ భాగంలో వచ్చే చల్ చల్ పాటలు సందర్భాను సారంగా అనిపించవు. విలనిజం మీద బాగా హైప్ క్రియేట్ చేసి ఆతర్వాత తేల్చేయటం చిత్ర విజయానికి ఆటంకం కలిగించే అంశం. ఫైట్స్, యాక్షన్స్ సీక్వెన్స్ కూడా బావున్నాయి. మరింత గ్రాఫిక్స్ అవసరం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.  మణిశర్మ నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. జగన్నాటకం పాటని సినిమా మొత్తం వాడుకోవటం వల్లే ప్రయోజనం చేకూరింది. అరెరే పసి మనసా, సై ఆంధ్రి నాను పాటల చిత్రీకరణ కూడా బావుంది.  జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ చూడచక్కగా ఉంది. సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ అందరినీ ఆలోచింప చేస్తాయి.

ఉపసంహారం :
        సినిమాటిక్ గా కొన్ని లోపాలున్నా కృష్ణం వందే జగద్గురుం చూడాల్సిన సినిమానే. ఇక బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఎలా ఉంటాయనే దానికోసం కొంతకాలం వేచి చూడాల్సిందే.
...avnk



Friday, 23 November 2012

Routine Love Story

Routine-Love-Story-_inner


సినిమా పేరు : ‘రొటీన్ లవ్ స్టోరీ’
విడుదల తేదీ : 23.11.12
బ్యానర్  : వర్కింగ్ డ్రీమ్
దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు
నిర్మాత : చాణక్య బూనేటి
తారాగణం : సందీప్ కిషన్, రెజీనా
తెలుగువిశేష్.కాం రేటింగ్ : 2.75
పరిచయం :      
      వర్కింగ్ డ్రీమ్ పతాకంపై చాణక్య బూనేటి నిర్మించిన చిత్రం 'రొటీన్ లవ్‌స్టోరి'. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి హీరో సందీప్ కిషన్.  ప్రస్థానం, స్నేహగీతం చిత్రాల తర్వాత తెలుగులో రెండేళ్ల గ్యాప్‌తో సందీప్ 'రొటీన్ లవ్‌స్టోరి' చేశాడు. ఇవాళ ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
స్టోరీ లైన్ :
       కొంతకాలం డేటింగ్ చేసిన అనంతరం తమ ప్రేమ,  పెళ్లికి అర్హత సాధిస్తుందా లేదా అనే ఒప్పందం మీద నడిచే కథ ఇది.  సంజు (సందీప్ కిషన్) ఫస్ట్ ఇయర్ ఇంజినీరింగ్ స్టూడెంట్. అదే కాలేజీలో చదివే తన క్లాస్ మెట్ తన్వి (రేజీన) ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే కొంతకాలం పాటు వీరిరువురి మధ్య స్నేహం నడుస్తుంది. అనంతరం పెళ్లి ప్రపోజ్ చేసిన హీరోకి ఎదురయ్యే సమస్యలు, ఈ లవ్ గేమ్ లో అతను విజయం సాధించాడా లేదా అనేదే క్లుప్తంగా సినిమా.
అనుకూల  ప్రతికూలాంశాలు :  
       ప్రజంట్ సొసైటీలో యూత్ ఆలోచనా ద్రుక్పదం ఎలా ఉంది అనేది ఉన్నదున్నట్టుగా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. తెరమీద హీరో సందీప్ కిషన్, హీరోయిన్ రేజీన మధ్య కెమిస్ట్రీ పండింది. సందీప్ నటన, రేజీన అందం, అభినయం చూడచక్కగా కనిపించాయి. ప్రేమంటే ఎంజాయ్ మెంటే కాదు పెళ్ళయ్యాక కష్టాలు తెరపై చూపించారు.
        తాగుబోతు రమేష్, ఎం.ఎస్. నారాయణ కామెడీ ట్రాక్ ఆకట్టుకోలేదు. ఇంకా,  ప్రవీణ్. ఝాన్సీ, హేమ, రాళ్లపల్లి పాత్రలను కూడా అంతంత మాత్రమే.  ఫస్టాఫ్ ఓకే.  సెకండాఫ్ లో గ్రాఫ్ దిగిపోతుంది.
సాంకేతిక విభాగం :
      బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ విషయంలో మిక్కీ జే మేయర్ అలరించాడు. సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్ పర్వాలేదు. దర్శకుడి టేకింగ్ లో కొత్తదనం కనిపించింది.
బాటమ్ లైన్ :
     యువతరాన్ని ఆకర్షించే 'రొటీన్ లవ్‌స్టోరి'.యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఇది.
  ...avnk

Damarukam Review



Damarukam-Latest_inner 
 

3

మూవీ పేరు : ‘ఢమరుకం’
విడుదల తేదీ : 23.11.2012.
దర్శకత్వం : శ్రీనివాస్ రెడ్డి
కథ: వెలిగొండ శ్రీనివాస్
కెమెరా: చోటా కె.నాయుడు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సహ నిర్మాత: వి.సురేష్‌రెడ్డి
సమర్పణ: కె.అచ్చిరెడ్డి

తెలుగువిశేష్.కాం రేటింగ్ : 3.00

పరిచయం :
      దీపావళికి వెండితెరమీదకి రావాల్సిన కింగ్ నాగార్జున ఢమరుకం మూవీ ఎన్నో వ్యయప్రయాసలు, వాయిదాలతో మొత్తానికి ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రేజీ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి తో సహా ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ మూవీ చూడటం కోసం ప్రసాద్స్ ఈ ఉదయాన్నే విచ్చేశారు. 20 కోట్ల భారీ నష్టంతో విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం...

కథ : 
       ‘ఢమరుకం’ కథ పాత తరహా లోనిదే. దేవతలు చేసిన రాక్షస సంహారంలో మిగిలిపోయిన ఒకే ఒక్కడు ఈ సినిమా విలన్ అంధకాసుర(రవిశంకర్). దానికి ప్రతీకారం తీర్చుకునే క్రమంలో సర్వశక్తులు ఆర్జించేందుకు అంధ కుటిల యత్నాలు చేస్తుంటాడు. దేవకన్యైన అనుష్కను పెళ్లాడి అనంతరం ఆమెను బలి ఇచ్చి అతీత శక్తులు పొందాలని పన్నాగాలు పన్నుతుంటాడు. అందుకోసం అనుష్క బావ(వెంకట్రామన్) ను చంపి అతనిలో ప్రవేశించి అనుష్కను లొంగతీసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. వీటిని దైవాంశ ఉన్న మల్లిఖార్జున్(నాగ్) ఎలా పటాపంచలు చేశాడు, ఈ లక్ష్యంలో మల్లి ఎదుర్కొన్న కష్టాలు తదితర ఘట్టాలే ఈ చిత్రం క్లుప్తంగా. ధర్మో.. రక్షితి.. రక్షితహ’.. చివరిగా మనకు ఈ మూవీలో కనిపించే నిఘూడార్థం..  మహాశివుడు, మహావీరుడు, మహామాంత్రికుడు... ఈ ముగ్గురి నేపథ్యంలో సాగే సినిమా ఇది. చెడు మీద మంచి సాగించిన పోరాటం, చివరికి దైవ  సాయంతో, మంచి ఎలా గెలిచిందనేది సూపర్బ్ అండ్ వండర్ గ్రాఫిక్స్ తో తెరకెక్కించారు.

కథనం నడిచిన తీరు :
  మన చారిత్రాత్మక, పురాణాల గురించి చెబుతూ సూపర్బ్ యానిమేషన్ టైటిల్స్ తో సినిమా మొదలౌతుంది.  అరివీరభయంకరుడిలా కనిపిస్తూ మొదటగా విలన్ అంధకాసుర ఎంట్రీ. గతంలో జరిగిన పరిణామాల గురించి చెప్పి ప్రస్తుత కాలంలోకి సినిమా వస్తుంది. మహేశ్వరిగా దైవశ్లోకాల మధ్య తెరపైకి అనుష్క. మైండ్ బ్లోయింగ్ యూత్ ఫుల్ అప్పీరెన్స్ తో మల్లి పేరిట నాగార్జున రాకింగ్ ఎంట్రీ. ఆదిలోనే  పోలీసులకి  మల్లికి మధ్య చేజ్ సీక్వెన్స్  అదిరిపోయింది. కుర్రకారుకి పిచ్చెక్కించేలా సూపర్ హిట్ సాంగ్ 'సక్కుభాయ్ గరం చాయ్' పాటలో చార్మీ అదుర్స్ అనిపించింది.
        ఇక కమెడియన్స్ అంతా ఒక్కసారిగి తెరపైకి దండెత్తివచ్చారు.  బ్రహ్మానందం, ఎం.ఎస్ నారాయణ, కృష్ణ భగవాన్, రఘు బాబులు ఎంట్రీ నవ్వులు కురిపించింది.  ప్రకాష్ రాజ్ వాయిస్ తో లార్డ్ శివ గా మెరుస్తాడు.  కృష్ణ భగవాన్ కామెడీ టైమింగ్ 'ఒంటెలు ఎడారిలోనే ఉండాలి' లాంటి డైలాగ్స్ థియేటర్లో కేకలు పెట్టించాయి. అనంతరం మొత్తం సెట్లో షూట్ చేసిన 'కన్యా కుమారి' పాట. తర్వాత అఘోరాలకి, నాగార్జున మధ్య ఒక భారీ ఫైట్ తో ఇంట్రవల్.
      దాదాపు ఫస్ట్ హాఫ్ అంతా  చాలావరకూ కామెడీగ సాగుతూ ఇంట్రవల్ ముందు వచ్చిన సీన్స్ తో అసలు కథ మొదలైంది. ఈ క్రమంలో అందమైన లొకేషన్లలో షూట్ చేసిన రొమాంటిక్ మెలోడీ 'నేస్తమా నేస్తమా' పాట.  ఇక కథలో కీలకమైన మంచికి - చెడుకి మధ్య ఒక చారిత్రిక యుద్ధం తెరపైకి వచ్చింది. ఇంకో వైపు గాఢంగా నాగ్ - అనుష్క మధ్య రొమాంటిక్ ట్రాక్ లో భాగంగా 'రెప్పలపై రెప్పలపై' సాంగ్ బావుంది. స్పెషల్ ఎఫెక్ట్స్ తో రూపొందించిన నంది సీన్స్ ఔరా.. అనిపించాయి. క్లైమాక్స్ ఫైట్.. రాక్షసుడు అంధకాసుర వధ ఘట్టం. ధర్మో రక్షితి రక్షితహా.. తో శుభం కార్డు.

విశ్లేషణ :
     చందమామ కథను పోలిన ఈ సినిమాని తెరకెక్కించటంలో దర్శకుడి ప్రతిభ చాలా ముఖ్యం. అది ఈ మూవీలో కొరవడింది. ఇప్పటి వరకూ చిన్న సినిమాలనే హ్యాండిల్ చేసిన శ్రీనివాస్ రెడ్డి,  డైరెక్టర్ స్టఫ్ ఎలివేట్ కావాల్సిన కీలక సన్నివేశాల్లో చేతులెత్తేశాడు. గ్రాఫిక్స్ మీదే భారం వేసాడు. స్ర్కీన్ ప్లే లోటుపాట్లు కళ్లకు కడతాయి. 53 ఏళ్లు పైబడినా నాగ్ యంగ్ బాయ్ లాగే కనిపించి అబ్బురపరిచాడు. డర్టీ పిక్చర్ చూసిస్తానురోయ్ అనే కింగ్ డైలాగ్ పేలింది. అనుష్క నటన పరిధి తక్కువయినా ఓకే అనిపించింది.ఇక ఎలాంటి క్యారక్టర్ లో అయినా జీవించగల ప్రకాష్ రాజ్ శివునిగా అస్సలు సూట్ కాలేదు. ఇప్పటివరకూ డబ్బింగ్స్ కే పరిమితమైన సాయికుమార్ తమ్మడు రవిశంకర్ కు ఈ సినిమా మరిచిపోలేనిది. అనుష్క బావాగా చేసిన గణేష్ వెంకట్రామన్ నటన బావుంది. కెమెరా పనితనం ఫర్వాలేదు. దేవీ సంగీతం మూవీకి హైలెట్. గ్రాఫిక్స్ రక్తికట్టించాయి.

ఉపసంహారం :
 సినిమా ఆధ్యంతం చిన్న చిన్న లోటుపాట్లు కనిపించినప్పటికీ చివరకు ఓకే.. బానేవుందనిపిస్తుంది ఢమరుకం సౌండ్

  • Damarukam
  • Damarukam
  • Damarukam
  • Damarukam
  • Damarukam
  • Damarukam
  • Damarukam
  • Damarukam

. ...avnk