సినిమా : కడలి
విడుదల తేదీ : 1 ఫిబ్రవరి 2013
దర్శకుడు : మణిరత్నం
నిర్మాత : మణిరత్నం, ఎ. మనోహర్ ప్రసాద్
సంగీతం : ఎ. ఆర్. రెహమాన్
నటీనటులు : గౌతమ్, తులసి, అర్జున్, అరవింద్ స్వామి
ప్రేమ కథా చిత్రాల దర్శకుడిగా పేరు
తెచ్చుకున్న మణిరత్నం చాలా రోజుల గ్యాప్ తరువాత కొత్త నటీనటులను పెట్టి మరో
ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించాడు. రావన్ పరాజయం తరువాత ఇంత కాలం గ్యాప్
తీసుకున్న ఆయన తన సొంత నిర్మాణంలో, చాలా మంది ప్రముఖులను పెట్టి
కడలి చిత్రాన్ని తెరకెక్కించాడు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను సముద్రం అలలలాగా
అలరించిందో లేదో చూద్దాం.
కథ :
సామ్ ఫెర్నాండెజ్ (అరవింద స్వామి)
సిన్సియర్‌గా అంకిత భావంతో ఉండే వ్యక్తి. బెర్గ్‌మెన్స్(అర్జున్) ఫన్నీగా
ప్రేమ తత్వంతో ఉండే వ్యక్తి. వీరిద్దరు చర్చిఫాదర్‌గా శిక్షణ కోసం
క్రిస్టియన్ సెమినార్‌కు వెలుతారు. అయితే తర్వాత ఇద్దరు భిన్నమైన మార్గాలను
ఎంచుకుంటారు. సామ్ సముద్రం పక్కన ఉండే ఓ గ్రామానికి వచ్చి చర్చి ఫాదర్‍గా
జీవితం మొదలు పెడతాడు. అక్కడే అతడికి తల్లిని కోల్పోయి అనాథ బాలుడైన
థామస్(గౌతం)తో పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది.
పెరిగి పెద్దవాడైన థామస్ బెర్గ్‌మెన్స్ కూతురు బిట్రిస్(తులసి)తో ప్రేమలో
పడతాడు. ఆథామస్, బీట్రిస్ మధ్య ప్రేమ ఏమైంది? ఈ ప్రశ్నలకి సమాధానం
తెలియాలంటే తెర పై చూడాల్సిందే.
కళాకారుల పని తీరు :
ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించిన
అరవింద్ స్వామి, అర్జున్ లు ఈ సినిమాకి హైలెట్. సినిమా మొత్తంలో వీరిద్దరి
నివిడి ఎక్కువగా ఉంటుంది. చాలా సంవత్సరాల తరువాత అరవింద్ స్వామి తెర పై
కనిపించాడు. అప్పుడు ఎలా చేశాడో, ఇప్పుడు కూడా అంతే అద్బుతంగా చేశాడు. ఇక
అర్జున్ కూడా తన పాత్రకి ప్రాణం పోశాడని చెప్పవచ్చు. ఇక అర్జున్ సొంతంగా
డబ్బింగ్ చెప్పుకోవడం హైలెట్ . ఇక వీరిద్దరి సంగతి ప్రక్కన పెడితే కొత్తగా
వెండితెరకు తెరంగ్రేటం చేసిన కార్తీక్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఇక రాధ
కూతురు తులసి.... ఈమె పాత్ర తక్కువ సేపు ఉన్నా ఉన్నంతలో
ఫర్వాలేదనిపించింది. నటనలో ఇంకా పరిపూర్ణత సాధించాల్సి ఉంది. లక్ష్మి మంచు
చాలా చిన్న పాత్ర చేసి ఓకే అనిపించుకుంది .
సాంకేతిక వర్గం :
ఇక మణిరత్నం సినిమా అంటే మనకు ముందు
గుర్తుకు ఏఆర్ రహమాన్ సంగీతం. ఈయనతో పన్నెండు సినిమాలకు పని చేయించుకున్న
మణిరత్నం ఇందులో కూడా ఇతనితోనే సంగీతం చేయించాడు. ఈ సినిమాకి సంగీతం ఓ
బలంగా చెప్పవచ్చు. కానీ ఈ సినిమాలోని కొన్ని పాటలు ప్రేక్షకులకు చేరాలంటే
మరి కొంత సమయం పట్టవచ్చు. ఇక ప్రముఖ సినిమాటోగ్రఫర్ అయిన రాజీవ్ మీనన్
ఫోటోగ్రఫి చాలా అద్బుతంగా ఉంది. ముఖ్యంగా సముద్ర తీరాన్ని తీయన
చిత్రీకరించిన తీరు మనల్ని తన్మయత్వానికి గురిచేస్తుంది. సంభాషణలు అంత
పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి.
విశ్లేషణ :
మణిరత్నం గతంలోని ప్రేమ కథా చిత్రాలను ఈ
చిత్రంలో సరిపోల్చ కూడదు. ఎందుకంటే అన్ని ప్రేమ కథా చిత్రాలే అయినా దేని
ప్రత్యేకత దానిదే. ఆయన గత సినిమాలు స్లోగా ఉంటాయి. కానీ కడలి కధని మరి
కొద్దిగా స్లోగా నడిపించాడు. ఇదే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టవచ్చు.
ఇక కొత్తగా తెరంగ్రేటం చేసిన గౌతమ్, తులసిల ప్రేమ కథను చాలా తక్కువగా
పెట్టాడు. దీంతో యువతరాన్ని కొద్దిగా ఆకట్టుకోపోవచ్చు. తులసి కూడా హైప్
ఇచ్చినంత లేకపోవడం పెద్ద మైనస్ గా చెప్పవచ్చు. మణిరత్నం సినిమాల్లో ఉండే
మేజిక్ కొద్దిగా మిస్ అయినట్లు అనిపిస్తుంది. అర్జున్, అరవింద్ స్వమి మధ్య
వివాదాన్నే ఎక్కువ చూపించాడు. ఫస్ట్ హాఫ్ కొంత ఆసక్తికరంగా సాగినప్పటికీ
సెకండ్ హాఫ్ బోర్ కొట్టించింది. రెగ్యులర్ సినిమా లవర్స్ కోరుకునే అంశాలు
ఏమీ ఇందులో లేవు. మణిరత్నం సినిమాలు ఇష్టపడే వారు కడలి కూడా అంతగా ఊహించి
వెళ్ళకుండా, ఓ కొత్త ప్రేమ కథను చూసేందుకు వెళితే బాగుందనిపిస్తుంది.
చివరగా :
సముద్రంలోని అలల అంత ఫాస్టుగా ‘కడలి ’ఈ సినిమా లేదు.
No comments:
Post a Comment