సినిమా : మిర్చి
బ్యానర్ : యువీ క్రియేషన్స్
దర్శకుడు : కొరటాల శివ
నిర్మాత : వి. వంశి కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు :ప్రభాస్, అనుష్క, రిచా గంగోపాద్యాయ్మాస్
హీరోగా పేరుతెచ్చకున్న ప్రభాస్ తరువాత ట్రాక్ మార్చి మిస్టర్ ఫర్ పెక్టు సినిమాలో క్లాస్ గా కనిపించి క్లాస్ మాస్ హీరోగా పేరొందాడు. ఆ సినిమా తరువాత నుండి ప్రభాస్ కి సరైన హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచినా డీలా పడకుండా మిర్చి తో ఘాటెక్కించడానికి రెడీ అయిపోయి, స్ర్కిప్టు రైటర్ గా ఉన్న కొరటాల శికకు దర్శకత్వం ఛాన్స్ ఇచ్చాడు. కొత్త దర్శకుడు అని చూడకుండా అతని పై పూర్తి నమ్మకం పెట్టి, తన పని పూర్తి ఫర్ ఫెక్టుగా చేసుకొని పోయిన ప్రభాస్ ‘ మిర్చి ’సినీ ప్రేక్షకులకు ఘాటెక్కించిందో లేదో చూద్దాం.
కథ :
జై (ప్రభాస్)... ఇటలీలో ఆర్కిటెక్టర్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. వీలైతే ప్రేమిద్దాం.. పోయేదేముంది అనే మనస్తత్వం కలవాడు. అక్కడే పరిచయం అయిన మానస (రిచా గంగోపాధ్యాయ) ప్రేమిస్తాడు. మానస కూడా జైని ప్రేమిస్తుంది. అయితే మానన తమ ప్రేమకు అడ్డుగా నిలిచే తన ఫ్యాక్షన్ కుటుంబం గురించి జై కు వివరిస్తుంది. దాంతో... జై వెంటనే తట్టాబుట్టా సర్దుకుని... ఇండియా వచ్చేసి, ఆమె ఇంటిలో వాలిపోయి... ప్యాక్షన్ పగలతో రగిలిపోతున్న వారి కుటుంబాన్ని చక్కబెట్టే పనిలో పడతాడు. ఆ క్రమంలో అతని గురించి ఓ నిజం ప్రేక్షకులకు తెలుస్తుంది. ఇంతకీ జై ఆ ఇంటికి వచ్చింది.. తన ప్రేమ కోసం కాదు.. మరొక పనిమీద అని.. ఇంతకీ ఆ పని ఏమిటి... ఇంతకీ జై ఎవరు...మరో హీరోయిన్ వెన్నెల (అనుష్క) లతో జైకి ఉన్న బంధమేమిటి ? వాళ్లిద్దరిలో ఎవరిని దక్కించుకుంటాడు ? అనే విషయాల్ని తెరపైనే చూడాలి.
కళాకారుల పనితీరు :
ఇంత వరకు మాస్ సినిమాలు చేసి మధ్యలో క్లాస్ మళ్లీ మాస్ సినిమాలు చేసిన ప్రభాస్ ఈ సినిమాలో కాస్త డిఫరెంటు క్యారెక్టర్ ని పోషించాడు. ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసాడు. సినిమా అంతా న్యూ లుక్ తో బావున్నాడు. ఈ చిత్రం ద్వితియార్థంలో ప్రభాస్ చాలా హ్యాండ్ సమ్ గా ఉన్నాడు. యాక్షన్ సీన్స్ లో అదుర్స్ అనిపించాడు. సెకండాఫ్ ని మొత్తం ప్రభాస్ పే తన భుజస్కందాల పై వేసుకొని నడిపించాడు. ఇక చాలా రోజుల తరువా ప్రభాస్ ప్రక్కన జోడి కట్టిన అనుష్క ఫేసులో చాలా తేడా వచ్చింది. కాస్తంత ముదురు ముఖం పడినట్లు కనిపించింది. రిచా గంగోపాధ్యాయ మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఈమెకు అనుష్కంత లెన్తీ పాత్ర దొరికింది. ఉన్నంతలో ఫర్వాలేదనిపించినా, నటనలో ఇంకా పరిణితి చెందాలి. ప్రభాస్ తండ్రిగా సత్యరాజ్ బాగానే చేసినా, ఇతని స్థానంలో వేరే వారు ఉంటే ఇంకా బాగుండేదేమో, నదియా చిన్న పాత్రే అయినా బాగానే చేసింది. ఇప్పటికీ ఆమెలో ఏ మాత్రం అందం తగ్గలేదు. వీర ప్రతాప్ పాత్రలో బ్రహ్మానందం ఒకటి రెండు సన్నివేశాల్లో మాత్రం నవ్వించాడు. సంపత్, నాగినీడు, ఆదిత్య, సుబ్బరాజు, అజయ్, సుప్రీత్ అందరూ పాత్ర పరిధి మేరకు చేసారు .
సాంకేతిక విభాగం :
ఈ సినిమా ముఖ్యంగా బలం మ్యూజిక్. దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు జనాల్లో మంచి క్రేజ్ ని సంపాదించాయి. కొన్ని సాంగులు అయితే ప్రభాస్ అన్ని సినిమాల్లో కన్నా బెస్ట్ గా ఉన్నాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో ప్రభాస్ యాక్షన్ సీన్స్ కి దేవీ అందించిన బ్యాగ్రౌండ్ స్కోరు మరింత బాగుంది. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.... మది చాలా బాగా చిత్రీకరించాడు. ప్రభాస్ అంత చక్కగా కనిపించడానికి కారణం కూడా ఇదే కారణం. ఇక నిర్మాతలు క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదు. ఇక రైటర్ నుండి దర్శకుడి అవతారం ఎత్తిన కొరటార శివ తన తొలి ప్రయత్నంలో పూర్తి విఫలం కాకుండా ఫర్వాలేదనిపించాడు. సినిమా మొదటి భాగంలో బోర్ కొట్టించినా సెకండాఫ్ లో మాత్రం పరుగులు పెట్టించాడు. డైరెక్టర్ గా తొలి ప్రయత్నంలో సక్సెస్ అయిన కొరటాల శివ, కొన్ని లోటు పాట్లను తెలుసుకుంటే భవిష్యత్తులో మంచి దర్శకుడిగా పేరు పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
విశ్లేషణ :
రెబల్ తరువాత వచ్చిన ఈ సినిమా మొత్తంగా క్లాస్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నదని చెప్పవచ్చు. చెప్పాలంటే ప్రభాస్ తన పూర్తి స్థాయి నటనను ప్రదర్శించి ఈ సినిమాని నిలబెట్టాడు. రొటీన్ స్టోరీలను ఎన్నుకొని, ఎలా ప్రారంభించిలో తెలియకుండా కొరటాల శివ మొదట్లో కఫ్యూజన్ కి గురయ్యాడు. మొదటి భాగంలో వచ్చే సీన్స్ మరీ బోర్ కొట్టించే విధంగా ఉండటంతో ప్రేక్షకులను సినిమా సెకండాఫ్ కూడా ఇలానే ఉంటుందనే ఫీలింగ్ రప్పించాడు. కానీ సెకండాఫ్ లో సినిమా రూపురేఖలనే మార్చి సినిమాకి ప్రాణం పోశాడు. స్టోరీలో బలం లేకపోవడంతో, మళ్ళీ మొదటి సారి మెగా ఫోన్ పట్టడంతో చాలా ప్రెషర్ కి గురయినా మొత్తానికి సినిమాని గాడిలో పెట్టాడు. ఇక ప్రభాస్ కాబట్టి ఈ సినిమా కమర్షియల్ గా దూసుకుపోవచ్చు. దానికి తోడు ఇప్పట్లో ఏ సినిమాలు లేవు కాబట్టి ప్రొడ్యూసర్లు కూడా సేఫ్ జోన్ లో ఉండవచ్చు.
చివరగా :
గుంటూరు మిర్చి అంత ఘాటు లేకపోయినా టేస్టీగానే ఉంది.
Thanks for providing such a nice details,its really very nice
ReplyDeletesardaar gabbar singh movie review