Saturday, 27 April 2013

Shadow Movie Review

Shadow Movie Review 

‘షాడో ’ సినిమా రివ్యూ
 
ఫ్యామిలీ చిత్రాల హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ ఈ మధ్య యంగ్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ చిత్రాల్లో, అదే టైంలో సింగిల్ గా ఈ జనరేషన్ కి తగ్గట్లుగా భారీ యాక్షన్ చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు. ఇప్పుడు అదే తరహాలో వచ్చిందే ఈ షాడో సినిమా. వెంకీ సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ప్రేక్షకులు కడుపునిండా నవ్వుకోవచ్చు అని అనుకుంటారు. ఇక నిర్మాతలు అయితే.... పెట్టిన డబ్బుకు ఢోకా లేదని బరోసాగా ఉంటారు. మరి వెంకటేష్ కెరియర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందిన షాడో సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం అలరించిందో ఓ సారి చూద్దాం.



  • చిత్రం
    షాడో
  • బ్యానర్
    యు స్క్వేర్ మూవీస్ లిమిటెడ్
  • దర్శకుడు
    మెహర్ రమేష్
  • నిర్మాత
    పరుచూరి శివరామ్ ప్రసాద్
  • సంగీతం
    తమన్
  • సినిమా రేటింగ్
     - 2.25/5 - 2.25/5  2.25/5
  • ఛాయాగ్రహణం
    శ్యామ్ కె. నాయుడు
  • ఎడిటర్
    మార్తాండ్ కె. వెంకటేష్
  • విడుదల తేది
    ఏప్రిల్ 26, 2013
  • నటినటులు
    వెంకటేష్, తాప్పీ, శ్రీకాంత్, మధురిమ, ఎమ్మెస్ నారాయణ, ఆదిత్య పచోలి, షాయాజీ షిండే, నాగబాబు తదితరులు
Cinema Story
వెకంటేష్ తండ్రి (రఘురాం ) నలుగురికి మంచి చేసే మనస్తత్వం. అతను నానా భాయ్ ( ఆదిత్య పచోలి ) దగ్గర పనిచేస్తుంటాడు. అయితే ఆ గ్యాంగ్ లోని రహస్యాలను బయటకి చేరవేస్తున్నాడని తెలుసుకున్న డాన్ రఘురాంని చంపేస్తాడు. ఈ సంఘటనను కళ్ళారా చూసిన రాజారాం (షాడో) వారి పై ఎలాగైనా పగ తీర్చుకోవాలనే కసితో పెరుగుతాడు. అలా పెరిగిన షాడో నానా భాయ్ గ్యాంగ్ లోని వాళ్లని చంపుకుంటూ వస్తాడు. ఓసారి నానా భాయ్ పేళుళ్లకు ప్లాన్ చేస్తాడు ? ఈ పేళుళ్ళను ఆపడానికి పోలీస్ ఆఫీసర్ ప్రతాప్ (శ్రీకాంత్ ) ప్రయత్నిస్తాడు. ఇంతలో నానా గ్యాంగ్ ని అంతం చేస్తున్న షాడో ఎవరనే సందేహం అతనికి వచ్చి ఆరా తీస్తాడు. చివరకు షాడో తన తండ్రిని చంపిన వాళ్ల పై ఎలా పగతీర్చుకుంటాడనేది తెరపై చూడాల్సిందే.
pothe
షాడో ఫ్యామిలీ చిత్రాల హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ ఈ మధ్య యంగ్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ చిత్రాల్లో, అదే టైంలో సింగిల్ గా ఈ జనరేషన్ కి తగ్గట్లుగా భారీ యాక్షన్ చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు. ఇప్పుడు అదే తరహాలో వచ్చిందే ఈ షాడో సినిమా. వెంకీ సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ప్రేక్షకులు కడుపునిండా నవ్వుకోవచ్చు అని అనుకుంటారు. ఇక నిర్మాతలు అయితే.... పెట్టిన డబ్బుకు ఢోకా లేదని బరోసాగా ఉంటారు. మరి వెంకటేష్ కెరియర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందిన షాడో సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం అలరించిందో ఓ సారి చూద్దాం.

గతంలో పలు డిజాస్టర్ సినిమాలు తీసి సెన్సేషనల్ డిజాస్టర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మెహర్ రమేష్ ఈ సినిమాను కూడా అదే రేంజ్ లో డిజాస్టర్ చేయడానికి ప్రయత్నించాడు. ఇందులో ఆయనకు తగ్గట్లు ప్రాస డైలాగులు పెట్టుకున్నాడు. హీరో ఇంట్రడక్షన్ టైంలో ‘నేనువరన్నది మిస్టరీ... నేను క్రియేట్ చేసేది హిస్టరీ.... మీరు చూడబోయేది నా విక్టరీ... అనే డైలాగు పెట్టాడు. ఈ డైలాగు లాగానే ఆయన ‘నేను తీయబోయే కథ మిస్టరీ.... నేను క్రియేట్ చేయబోయేది డిజాస్టర్ .... మీరు భరించాలి నా టార్చర్ ’ అన్న విధంగా తీశాడు. ఓ సాధాసీదా కథకు భారీ హంగులు చేకూర్చి ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేసి వారి మీదకు వదిలాడు. ఇది చాలదు అన్నట్లు కామెమీ సీన్స్ ని బలవంతంగా పెట్టి మరింత విరక్తి కలిగించాడు. ఫలితంగా థియేటర్ లో ప్రేక్షకుడు నవ్వుకోవడం బదులు... తలలు బాదుకునే పరిస్థితి. ఇక కథలో హీరో విలన్లను ఎంత సింపుల్ గా చంపేస్తాడంటే చిన్నపిల్లాడు కొట్టకువెళ్లి చాక్లెట్ కొనుక్కొని గుటుక్కున నోట్లోవేసుకున్నంతగా. మొత్తంగా చూస్తే ఈ సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు ఏమీ లేవు. ఏదో సినిమా మొదలు పెట్టాం కదా అని పూర్తి చేయాలనే భావనే కాకుండా, డబ్బు నీళ్లలా ఖర్చు పెట్టే నిర్మాత ఉన్నాడు కదా అని హంగులు జోడించాడు తప్ప వాటికి తగ్గ కథను తయారు చేసుకోలేదు.
Cinema Review
ప్రతి సినిమాలో ఎంతో ఎనర్జిటిక్ గా, ఎంతో హుందాగా కనిపించే వెంకటేష్ ఈ సినిమాలో ఎంతో నీరసంగా కనిపించాడు. కొత్త గెటప్స్ తో ప్రేక్షకులను అదరగొడదామని చూశాడు కానీ అవి ఆయనకు సూట్ కాలేదు. ఈ మధ్య కాలంలో వెంకటేస్ ఇంత చెత్తగా, పాత్రలో ఇన్వాల్వ్ కాకుండా నటించిన పాత్ర ఏదైనా ఉంటే అది ఇదే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. గత సినిమాలతో పోలిస్తే.... వెంకటేష్ ఇలా చెత్తగా కూడా నటిస్తాడా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎదో నటించాలని నటించేసినట్లు అనిపిస్తుంది. ఇక హీరోయిన్ తాప్పీ అందంగా కనిపించింది మినహా ఆమె చెయ్యడానికి సినిమాలో ఏమీ లేదు. ముఖ్యంగా ప్రేక్షకులకు ఆమె కస్ట్యూమ్స్ విసుగు తెప్పిస్తాయి. అవి అందం కోసం వేశారా ? ఉన్న అందాన్ని చెడగొట్టడానికి వేశారా అన్నట్లు ఉన్నాయి. శ్రీకాంత్ ఇందులో గెస్ట్ రోల్ పోషించాడు. ఇందులో ఆయన పోలీస్ పాత్రలో నటించినా, చెప్పిన పని చేసుకుంటూ పోయినట్లు ఉంటుంది. కమేడియన్ ఎమ్మెస్ నారాయణ  ఎంతగానో నవ్వించాలని చూశాడు. కానీ ప్రేక్షకులు వారికి వారు గిలిగింతలు పెట్టుకున్నా నవ్వురాదు ఈ సీన్స్ చూస్తే. విలన్ ఆదిత్య పచోలి ని డాన్ గా చూపించాడు. అతను అంతంత మాత్రమే. శ్రీకాంత్ భార్యగా నటించిన మధురిమ చేసిందేం లేదు. అప్పుడప్పుడు ఓ స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇక మిగతావారి క్యారెక్టర్లకు చెప్పుకునే అంత ప్రాముఖ్యత లేదు.

అనుభవం వస్తుంటే పనిలో నైపుణ్యత పెరుగుతుందని అంటారు. కానీ ఈ సినిమాకు పని చేసిన సాంకేతిక విభాగం వారి పని చూస్తే.... వీరు కొత్తగా చేశారా అన్నట్లు ఉంటుంది. దర్శకుడు మెహర్ రమేష్ కి తోడు గొప్ప కథా రచయితలుగా పేరున్న గోపీమోహన్, కోన వెంకట్ స్క్రిప్ట్ లో పస లేకుండా పోయింది. ఇక థమన్ అందించిన సంగీతం ఓక్క పాటకు తప్ప మిగిలిన అన్ని పాటలకు తన పాత ట్యూన్స్ కి తెరపైకి తెచ్చాడా అన్నట్లు ఉన్నాయి. సినిమాటో గ్రఫీ ఫర్వాలేదని పిస్తుంది. ఎడిటింగ్ కి ఏ ఒక్క సీన్ కూడా మిగలవేమో. ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ చాలా రిచ్ గా ఉన్నాయి.

chivaraga
 
‘వడ్డించే వాడు మనవాడు అయితే ఎక్కడ కూర్చున్నా ఒక్కటే ’ అనే సామెత మాదిరి నిర్మాత ఖర్చు పెట్టేవాడు ఉండగా... కథ.... కథనం... లేకుండా భారీ సినిమాలు తీస్తే పోలా అని అనుకునే దర్శకులకు అవకాశం ఇస్తే...ఇలాంటి సినిమాలే వస్తాయి. ఇలాంటి దర్శకులు మరో నలుగురు ఉంటే పరిశ్రమ దివాలా తీయడం ఖాయం. 

ఎన్టీఆర్ కి తన శక్తేమిటో చూపించిన మెహర్ వెంకటేష్ కి కలలో కూడా (షాడో) నీడలా వెంటాడే సినిమా తీశాడు.


 
 

Friday, 19 April 2013

Gunde Jaari Gallanthayyinde Movie Review

  • చిత్రం
    గుండెజారి గల్లంతయిందే
  • బ్యానర్
    శ్రేష్ఠ్‌ మూవీస్‌
  • దర్శకుడు
    విజయ్‌కుమార్‌ కొండా
  • నిర్మాత
    నిఖితారెడ్డి
  • సంగీతం
    అనూప్‌ రూబెన్స్‌
  • సినిమా రేటింగ్
     - 3.25/5 - 3.25/5 - 3.25/5  3.25/5
  • ఛాయాగ్రహణం
    ఆండ్రూ బాబు,
  • ఎడిటర్
    హర్షవర్ధన్‌
  • విడుదల తేది
    ఏప్రిల్ 19, 2013
  • నటినటులు
    నితిన్‌, నిత్య మీనన్‌, ఇషా తల్వార్‌, గుత్తా జ్వాల, అలీ, తాగుబోతు రమేష్‌, తదితరులు
 
సాప్ట్ వేర్ ఎంప్లాయి అయిన కార్తీక్‌ (నితిన్‌) తొలిచూపులోనే (ఇషా తల్వార్ ) శ్రుతి ప్రేమలో పడతాడు. ఎలాగైనా ఆ అమ్మాయితో మాట కలపాలని తన ఫోన్ నెంబర్ తెలుసుకుంటాడు. కానీ నెంబర్ తప్పు రాసుకోవడంతో శ్రుతికి బదులు వేరే అమ్మాయి శ్రావణి (నిత్యామీనన్ ) కి వెళుతుంది. కార్తీక్ తను చూసిన అమ్మాయే అనుకొని నిత్యామీనన్ తో మాటలు కలుపుతాడు. ఆమెతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోతాడు. కానీ అసలు నిజం తురువాత తెలియడంతో కార్తీక్ షాక్ తింటాడు. శ్రుతి వేరు.. తను ఫోన్ లో ప్రేమించే అమ్మాయి వేరు అని అర్దం అవుతుంది. అప్పుడు శ్రావణి ఏ నిర్ణయం తీసుకుంది. కార్తీక్‌ ఎవరితో కలిసి జీవితం పంచుకొన్నాడు? అనే విషయాల్ని తెరపైనే చూడాలి. గుండెజారి గల్లంతయిందే
pothe
గుండెజారి గల్లంతయ్యిందే
తన కెరియర్ మొదట్లో ప్రేమ కథా చిత్రాలు చేసిన నితిన్ మాస్ హీరోగా కూడా ప్రూవ్ చేసుకోవడానికి మాస్ సినిమాలు చేసి పరాజయాల పాలైన హీరో నితిన్ చాలా రోజుల తరువాత ‘ఇష్క్ ’ ప్రేమకధా చిత్రం చేసి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఇచ్చిన విజయంతో మళ్లీ అలాంటి కథనే ఎంచుకుకొని ‘గుండెజారి గల్లంతయిందే ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ప్రేక్షకుల గుండెల్ని ఏం చేసిందో ఓ సారి చూద్దాం.

ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలు వస్తే మాస్ గానో, వస్తే క్లాస్ గానో వస్తున్నాయి. కానీ ఈ రెండు సినిమాలు ప్రేక్షకులకు రొటీన్ అయిపోయాయి. అందుకే కొత్తగా వచ్చే దర్శకులు ప్రేక్షకుల నాడి, పల్ప్ ని కనిపెట్టి సినిమాలు తీస్తున్నారు. అదేకోవలోకి వస్తుంది ఈ చిత్రం. కొత్తదనం కోరుకుంటున్న ప్రేక్షకులకు ఈ చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. చిన్న పాయింట్ తీసుకొని దానికి ప్రేక్షకులకు కావాల్సింత సరుకు జోడించి తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన కామిడీ కన్నా ఎక్కువ ఉందనిపిస్తుంది. కథ నడిచే సమయంలో కామెడీని జొప్పించారు. ప్రథమార్థం సినిమాను దర్శకులు ఓ రేంజ్ లో తీశాడు. ఇంటర్వెల్ ముందు సినిమా హిట్ అనే నిర్ణయానికి వస్తాం. అదే ఊపును సెకండాఫ్ లో కొనసాగిస్తే బాగుండేది. ఫస్టాఫ్ గడిచినంత ఉల్లాసంగా, సెకండాప్ గడవదనే చెప్పాలి.

పూర్తిగా పవన్ కళ్యాణ్ వీరాభినానిని అని చెప్పుకుంటున్న నితిన్ అందుకు తగ్గట్లే పవన్ కళ్యాణ్ ని, తన ఫ్యాన్స్ ని కూడా ఉత్సాహ పరిచాడు. టైం దొరికినప్పుడల్లా తన అభిమానాన్ని విచ్చల విడిగా చూపించాడు. కథ ఎలా ముగుస్తుందో ఇంటర్వెల్ అప్పుడే ఓ అంచనా వేస్తాం. కానీ దానిని ఎలా ముగింపుకు తీసుకువెళతాడనేది కాస్తంత కఫ్యూజ్ గా ఉంటుంది. చివరగా ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేవిధంగా ముగిస్తాడు. స్పెషల్ ఎట్రాక్షన్ అని ఊదరకొట్టిన గుత్తా జ్వాలా సాంగ్ మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేదు.

Cinema Review

ఈ సినిమాలో హీరో నితిన్ నటన చాలా బాగుంది. ఇష్క్ చిత్రంలో కంటే ఇంకాస్త మెరుగ్గా చేశాడు. నితిన్ సినిమా సినిమాకి గ్లామర్ గా కనబడుతున్నాడు. మాస్ చిత్రాల కన్నా క్లాస్ చిత్రాలైతేనే బాగా సూటు అవుతాయి అనుకొన్న నితిన్ క్లాస్ హీరోగా బాగా యాక్టింగ్ చేశాడు. ఇక నితిన్ ప్రక్కన రెండో సారి నటించిన నిత్యా మీనన్ నటన ఈ సినిమాలో అద్బుతం. ఇప్పటికి నటించినవి కొన్ని సినిమాలే అయినా నటనా పరంగా తానేంటో నిరూపించుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో క్యారెక్టర్ నిత్యామీనన్ కే సాధ్యం అనేట్లుగా చేసింది. ఈ సినిమాతో ఈమెకు స్టార్ ఇమేజ్ రావడం ఖాయం. ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఇషా తల్వార్ అందం పరంగా ఓకే అనిపించింది కానీ, నటన పరంగా ఆమెకు కనీస మార్కులు కూడా వేయలేం. ఈమె చేసిన కొన్ని సన్నివేశాలు తేలిపోయాయి. కమేడియన్ ఆలీ, తాగుబోతు రమేష్ టైమింగ్ కామెడీని పండించారు. మిగతా నటులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పుకుంటున్న ఐటెం భామ గుత్తాజ్వాలా చేసిన డాన్స్ చూస్తే ప్రేక్షకులు నవ్విపోవడం ఖాయం. తొలిసారే ఐటెం బామగా ఎంట్రీ ఇచ్చిన ఈమె బాడీలో రిధమ్ లేదు. ఐటెం సాంగు ప్రేక్షకులకు ఊపునివ్వాలి.. కానీ గుత్తా ఆ ఊపు తీసుకొని రాలేకపోయింది.

యూత్ కి సరిపోయే లవ్ స్టోరీని ఎంచుకున్న దర్శకుడు దానికి తగ్గట్లే సినిమాటో గ్రాఫర్ ని ఎన్నకున్నాడు. లవ్ స్టోరీకి కావాల్సిన విజువల్స్ బాగా చూపించాడు. సాంగ్ ని బాగా చిత్రీకరించాడు. ఇక అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలెట్. ఈయన రీమిక్స్ చేసిన ‘తొలి ప్రేమ ’ పాట అదే తీసి పెట్టారా లేక, రీమిక్స్ చేశారా అనే తేడా కనిపించకుండా చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా వచ్చింది. నిర్మాతలు కూడా సినిమా క్యాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదని అనిపిస్తుంది. చాలా క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చారు. ఇక కొత్తగా దర్శకత్వం చేపట్టిన విజయ్ కుమార్ బెరుకు లేకుండా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలాగా చిన్న కాన్సెప్ట్ ని చాలా బాగా తెరకెక్కించాడు. విజయ్ కుమార్ కి అండగా హర్షవర్థన్ చేసిన రాసిన సంభాషణలతో దర్శకుడు మరింత రక్తి కట్టించాడు. యూత్ ని టార్గెట్ చేసి ఎంచుకున్న కథను వారికి తగ్గట్లు తీసి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాతో ఈ దర్శకుడి తరువాతి చిత్రం పై మంచి అంచనాలే ఉంటాయి. భవిష్యత్తులో ఎలాంటి చిత్రాలు తీస్తాడో చూడాలి.

chivaraga
 

యువత ‘గుండెల్ని గల్లంతు ’ చేసే చిత్రం.

Saturday, 6 April 2013

NTR Badshah Movie Review


Badshah review Telugu film
సినిమా : బాద్‌షా (2013)
నటీనటులు : జూ.ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ , సిద్ధార్థ్, నవదీప్ , బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ తదితరులు.
డైరెక్టర్ : శ్రీనువైట్ల
ప్రొడ్యూసర్ : బండ్లగణేశ్ బాబు
సంగీతం : ఎస్ . తమన్
రేటింగ్  : 3.5
విడుదల తేదీ : ఏప్రిల్ 5, 2013
జూనియర్ ఎన్టీఆర్ గత రెండు చిత్రాలు అయిన ఊసరవెల్లి, దమ్ము చిత్రాలు భారీ అంచనాల మధ్య విడుదల అయ్యి, బాక్సాఫీసు వద్ద అభిమానుల్ని నిరాశ పరిచిన విషయం తెలిసిందే. దమ్ము సినిమా తురవాత భారీ అంచనాలతో   విడుదల అయిన బాద్ షా చిత్రం అభిమానులను  అలరించిందో  లేదో చూద్దాం. ఇక ఎన్టీఆర్ కూడా  హిట్ కోసం ఆకలి మీదున్న పులి లాగా ఎదురు చూస్తున్నాడు.. ఇప్పటికే పలు సూపర్ హిట్ చిత్రాలు అందించిన శీనువైట్ల కూడా ఇంకా కసితో, జూనియర్ కి బ్లాక్ బ్లస్టర్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తీశాడు. ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా బాద్‌షా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. గబ్బర్‌సింగ్ తర్వాత బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రంపై అంచనాలు అధికంగా ఉన్నాయి. ఇప్పటికే ఆన్ లైన్ లో ఈ సినిమా టిక్కెట్లు నాలుగు రోజుల వరకూ అమ్ముడైపోయాయి. వేసవిలో పలు భారీ చిత్రాల రిలీజ్ హంగామా బాద్‌షాతోనే మొదలవడం విశేషం. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి రివ్యూ చూద్దాం.
                
కథ:
బాద్ షా (ఎన్టీఆర్) రంజన్ (ముఖేష్ రుషి ) కుమారుడు. ఇతను సాధుభాయ్ (కిల్లీ దోర్జీ ) ఇంటర్నేషనల్ మాఫిల్ డాన్ దగ్గర పనిచేస్తుంటాడు. ఎన్టీఆర్ తండ్రి సాధుభాయ్ కి అంత్యంత నమ్మకస్తుడు. సాధు బాయ్ క్రైం ప్రపంచంలో బాద్ షా యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ గా దూసుకుపోతుంటాడు. ఎన్టీఆర్ తండ్రి రంజన్ సాధు బాయికి అంత్యంత లాభాలు తెచ్చే కాసినోని చూసుకుంటూ ఉంటాడు. ఈ నేపథ్యంలో బాద్ షాకి, సాధు భాయికి మధ్య గొడవ జరుగుతుంది దీంతో బాద్ షా ఫ్యామిలీని, అతని సామ్రాజ్యాన్ని కూల్చేయాలని భావించి సాధుభాయి శత్రువులైన రాబర్ట్, విక్టర్ (ఆశీష్ విద్యార్థి, ప్రదీప్ రావత్ తో చేతులు కలుపుతాడు. ఇందులో భాగంగానే మాఫియా డాన్ అయిన సాధు భాయ్ ప్రధాన నగరాల్లో బాంబ్ బ్లాస్ట్ లకు ప్లాన్ చేస్తాడు. సాధు భాయ్ ప్లాన్స్ ని బాద్ షా చెడగొట్టాలనుకొని పోలీసు ఆఫీసర్ అయిన జై కృష్ణ సింహా(నాజర్) జానకి (కాజల్) తండ్రి సహాయం తీసుకుంటాడు. అదే ఫ్యామిలీకి చెందిన పద్మనాభ సింహా(బ్రహ్మానందం) సహాయంతో బాద్ షా గతం తెలుసుకొని సాధుభాయ్ ని అంతం చేయడానికి ప్లాన్స్ వేస్తాడు. ఆ ప్లాన్స్ లో సక్సెస్ అవుతాడా ? అసలు బాద్ షా గా ఎలా మారాడు ? కాజల్ కి బాద్ షా కి లింకు ఏమిటి అన్నది తెర పై చూడాల్సిందే.
కళా కారుళ పనితీరు :
ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎన్టీఆర్ నటన. బాద్ షా గా ఎన్.టి.ఆర్ అద్భుతమైన నటనని కనబరిచాడు. బాద్ షా అనే పదానికి ఎన్టీఆర్ న్యాయం చేశాడని చెప్పవచ్చు. బాద్ షా అనగానే... దూకుడుగా వ్యవహరించే స్వభావం, స్టైల్, అలాగే కొంచెం క్రూరమైన మనస్తత్వం ఉండాలి. ఇవన్నింటిని ఎన్టీఆర్ బాగా పండించాడు.   ముఖ్యంగా ఎన్టీఆర్ పంచ్ డైలాగులు బాగా పేలాయి. ఈ సినిమాలో తన తాత అయిన పెద్ద ఎన్టీఆర్ జస్టిస్ చౌదరి గెటప్పులో కనిపించి అదరగొట్టాడు. డాన్సుల పరంగా ఎన్టీఆర్ గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. ‘ సైరో సైరో ’, ‘ రంగోలి రంగోలి ’ పాటల్లో ఎన్.టి.ఆర్ స్టెప్పులు ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. ఎన్టీఆర్ ఇందులో అన్ని షేడ్స్ ఉన్న పాత్రలు చేశాడని చెప్పువచ్చు. ఫ్యాన్స్ కి ఈ సినిమా ఓ పండగా లాంటింది. ఇక కథానాయికగా నటించిన కాజల్ తన పాత్ర మేరకు బాగానే చేసింది.
ఇందులో నటించిన హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కామెడి హైలెట్. పద్మనాభ సింహా పాత్రలో బ్రహ్మీ చేసిన కామెడీకి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. ప్రతి సినిమాలో బ్రహ్మానందాన్ని కేవలం కామెడీ కోసం వాడుకుంటారు. కానీ శీనువైట్ల ఇతన్ని కామెడియన్ గానే కాకుండా స్టోరీలో కూడా ఇన్వాల్వ్ చేశాడు. ప్రముఖ నటుడు నాజర్ పోలీసు ఆఫీసర్ పాత్రలో బాగా చేశాడు. ఎన్.టి.ఆర్ – నాజర్ – బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగా పండాయి. మరో కమేడియన్ అయిన ఎం.ఎస్ నారాయణ డైరెక్టర్ గెటప్పులో కనిపించి అందర్ని బాగా నవ్వించాడు. ఇతని క్యారెక్టర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను పోలీ ఉంటుంది. ఎం.ఎస్. నారాయణ, వెన్నెల కిషోర్ కామెడీ కూడా బాగా నవ్వుల్ని తెప్పిస్తుంది. ఈ సినిమాకు కీలక సన్నివేశాల్లో మహేష్ బాబు చెప్పే వాయిస్ ఓవర్ బాగా కుదిరింది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన సిద్దార్థ పాత్ర కథను మలుపు తిప్పే విధంగా ఉంది. నవదీప్ కూడా విలన్ గా బాగా నటించాడు.
సాంకేతిక విభాగం :
ఈ సినిమాలో హైలెట్ ఏంటంటే...సినిమాటోగ్రఫీ. దీనికి నలుగురు సినిమాటో గ్రాఫర్స్ పనిచేశారు. వీరు నలుగు తీసిన షాట్స్ బాగున్నాయి. ఏ షాట్ ని ఎవరు షూట్ చేశారో చెప్పడం మాత్రం కొద్దిగా కష్టమే. వీరి పనితీరు చాలా బాగుంది. విజువల్ ఎఫెక్స్ మాత్రం చాలా ఎఫెక్ట్ గా, రిచ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ కూడా బాగానే ఉన్నా, ఫస్టాఫ్ లో కొద్దిగా బాగా చేయాల్సి ఉండేది. ఈ సినిమాకి సంగీతం అందించిన తమన్ పాటల్లో నాలుగు పాటలే బాగున్నాయి. ఈయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫర్వాలేదనిపిస్తుంది. కానీ ఇంకా బాగా చేయాల్సి ఉండేది. ఈ సినిమాకి పాటల కొరియోగ్రాఫర్ ఎన్టీఆర్ తో వేయించిన స్టెప్స్ సెకండాఫ్ లో అబ్బా అనిపించే విధంగా ఉన్నాయి. ఈ సినిమాకి గోపి మోహన్, కోన వెంకట్ లు స్క్రిప్టు , డైలాగులు బాగున్నాయి. సింగిల్ లైన్ పంచ్ డైలాగులకు ఇందులో కొదవలేని చెప్పవచ్చు.
విశ్లేషణ :
శీను వైట్ల సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది కామెడి. ఈ సినిమా స్టోరీ లైన్ కొత్తది కాకపోయినా శీను వైట్ల తన మార్క్ కామెడితో సినిమాని నడిపించాడు. ఈ సినిమాకు కథా బలం కన్నా, కామెడీ బలమే ఎక్కువ అని చెప్పవచ్చు. ప్రతి నటుడ్ని దర్శకుడు పూర్తి స్థాయిలో వాడుకున్నాడు. ఫస్టాఫ్ లో కామెడీ, ఫైట్లతో కాస్తంత నెమ్మదిగా కథను నడిపించిన దర్శకుడు, సెకండాఫ్ వచ్చే సరికి సినిమాను చాలా వేగంగా నడిపించాడు. ఇందులో ఎన్టీఆర్ ని చూపించిన తీరు అద్బుతం. ప్రతి సీన్ ని, ప్రతి పాటను ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాడు. ఈ సినిమాకు ఉన్న చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే... శ్రీను వైట్ల పాత సినిమాలతో కొన్ని పోలికలు ఉండడం. సినిమా చూస్తుంత సేపు అతని పాత సినిమాలోని సీన్లు మనకు గుర్తుకు వస్తాయి. బ్రహ్మానందం, ఎం.ఎస్ నారాయణల కామెడీని బాగా తీశాడు. ఎన్.టి.ఆర్, కాజల్, బ్రహ్మానందం, ఎం.ఎస్ నారాయణల బెస్ట్ పెర్ఫార్మన్స్ , వారి కాంబినేషన్లో వచ్చే హై ఎంటర్టైనింగ్ సెకండాఫ్ ఈ సినిమాకి మేజర్ హైలైట్స్. ఈ సినిమా భారీ ఆశలు పెట్టుకొని పోయిన అభిమానులకు రొటీన్ సినిమా అనిపించినా, రెండున్నర గంటలు కడుపుబ్బ నవ్వుకొని రీ ఫ్రెష్ అయి రావడం మాత్రం ఖాయం.
చివరగా :
భారీ అంచనాల్ని రీచ్ కాకున్నా, అభిమానుల్ని నిరాశపరచని ‘బాద్ షా ’