చిత్రం పేరు : ‘విశ్వరూపం’
విడుదల తేదీ : 25.01.2013
దర్శకుడు : కమల్ హాసన్
నిర్మాత : కమల్ హాసన్, చంద్ర హాసన్
సంగీతం : శంకర్ – ఎహాసన్ – లాయ్
నటీనటులు : కమల్ హాసన్, పూజ కుమార్, ఆండ్రియా మరియు రాహుల్ బోస్
తెలుగువిశేష్.కాం రేటింగ్ :3.5
పరిచయం :
వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలు ధరించి మెప్పుపొందిన లోకనాయకుడు కమల్ హాసన్. ఇప్పుడు 11వ అవతారమెత్తి.. వెండితెర వెనుక దర్శకుడిగా కథ నడిపించి, చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో నిర్మాత బాధ్యతలు భుజానవేసుకుని నిర్మించి... తన ‘విశ్వరూపం’ ప్రదర్శించాడు. అయితే ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు.. ఆటుపోట్లు.. చిత్రం ప్రారంభించిన తొలినాళ్ల నుంచీ ఎన్నో అవరాధోలు అధిగమిస్తూ మొత్తానికి రిలీజ్ డేట్ ప్రకటించాడు. ఇంతలో డిటిహెచ్ ప్రసారాల సమస్య, సరే.. దీనినుంచి ఏదోరకంగా గట్టెక్కాడంటే విడుదలకు ఒకరోజు ముందు పిడుగుపాటు లాంటి నిషేదం వార్త.. అనంతరం కోర్టు మెట్లెక్కిన ఈ మూవీ మొత్తానికి ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. కమల్ కెరీర్ లోనే అత్యంత విలువైన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానంతో తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో.. ప్రేక్షకుల అభిమానాన్ని ఎంతమేరకు చూరగొందో ఇప్పుడు చూద్దాం..

చిత్రకథ :
ఆఫ్ఘనిస్థాన్ లోని తాలీబాన్
తీవ్రవాదుల చేష్టల సమాహారం ఈ కమల్ విశ్వరూపం. కథేంటంటే.. కమల్
హాసన్(విశ్వనాథ్) అమెరికాలోని న్యూయార్క్ లో నివసిస్తుంటాడు. ఆయన భార్య పూజ
కుమార్(నిరుపమ) డాక్టర్ గా విధులు నిర్వహిస్తుంటుంది. కథక్ నృత్య
శిక్షకుడుగా పనిచేసే విశ్వనాథ్ తన దగ్గరికి వచ్చే అమ్మాయిలతో క్లోజ్ గా
ఉంటూ ఉంటాడు. ఆ అమ్మాయిల్లో ఆండ్రియా ఒకరు. దీంతో విశ్వనాథ్ భార్య డాక్టర్
నిరుపమ తన భర్త క్యారెక్టర్ పై అనుమానం పెంచుకుంటుంది. ఈ వ్యవహారం
తేల్చుకునేందుకు ఓ డిటెక్టివ్‌ను నియమిస్తుంది. ఈ క్రమంలో ఏజెంట్ ఇచ్చిన
సమాచారంలో విస్తుగొలిపే నిజాలు వెలుగుచూస్తాయి. అసలు.. విశ్వనాధ్ హిందూ
కాదని ముస్లిం అని వెల్లడవుతుంది. ఈ క్రమంలో డిటెక్టివ్ ఏజెంట్ ముస్లిం
టెర్రరిస్ట్ రాహుల్ బోస్ (ఒమర్)కి దొరికిపోయి ఆల్ ఖైదా గ్రూపు
టెర్రరిస్టులచే చంపబడతాడు. అంతేకాదు ఆల్ ఖైదా ఉగ్రవాదులు న్యూయార్కులో
న్యూక్లియర్ బాంబు పేల్చేందుకు ప్లాన్ చేస్తున్నారనీ బయటకు లీక్ అవుతుంది.
చివరికి.. విశ్వనాథ్ ఎవరు.. అతని లక్ష్యం ఏమిటి.. అతను మంచోడా, క్రూరుడా వంటి ట్విస్ట్ లను వెండితెరమీదే చూడాలి.
విశ్లేషణ :
చివరికి.. విశ్వనాథ్ ఎవరు.. అతని లక్ష్యం ఏమిటి.. అతను మంచోడా, క్రూరుడా వంటి ట్విస్ట్ లను వెండితెరమీదే చూడాలి.
విశ్లేషణ :
దాదాపు 3 సంవత్సరాల విరామం తర్వాత
కమల్ విశ్వరూపం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘విశ్వరూపం' చిత్రాన్ని కమల్
స్వీయ నిర్మాణ దర్శకత్వంలో నిర్మించడంతో పాటు ఇందులో హీరోగా చేసాడు.
తొలినాళ్లలో సెల్వరాఘవన్ దర్శకుడిగా ఈ సినిమా మొదలు పెట్టారు. అయితే కొన్ని
కారణాల వల్ల సెల్వరాఘవన్ తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలను
భుజానేసుకున్నారు కమల్ హాసన్. విశ్వరూపం చిత్రం తెలుగు, తమిళం, హిందీలో
ఒకేసారి రూపొందించారు. ఈ సినిమా కోసం దాదాపు రూ. 95 కోట్ల బడ్జెట్
వెచ్చించారు. కాగా విలక్షణ నటుడు కమల్ ఈ మూవీలో తన నటనావిశ్వరూపాన్ని
సాక్షాత్కరించాడనే చెప్పాలి. నటుడిగా ఆయన ఈ సినిమాలో మూడు విభిన్నమైన
పాత్రలో కనిపించారు. డాన్స్ టీచర్ పాత్రలో నవ్వులు కురిపించి ముస్లిం
పాత్రలో ఒదిగిపోయాడు. విశ్వనాధ్ భార్యగా పూజ కుమార్ నవ్విస్తూ చివరి వరకూ
తన ప్రాధాన్యాన్ని చాటింది. ఆమె పాత్రకి చెప్పిన డబ్బింగ్ ఆకట్టుకుంటుంది.
హిందీ నటుడు రాహుల్ బోస్ ప్రతి నాయకుడి పాత్రలో భయపెట్టాడు. జైదీప్
అహ్లావత్ ఒమర్ అనుచరుడు సల్మాన్ గా కీలక పాత్ర చేసాడు. శేఖర్ కపూర్, నాజర్
పరిమితి గల పాత్రల్లో కనిపించి పర్వాలేదనిపించారు.
సినిమా నెమ్మదిగా ప్రారంభం
అయినా...కథలో గ్రిప్ ఉంది. సినిమా తొలి భాగం మొత్తం యూఎస్ లోనే షూట్
చేసారు. తొలి 20 నిముషాలు పాత్రలను పరిచయం చేస్తూ ఆ తరువాత కామెడీ పండిస్తూ
ఆసక్తికరంగా కథనం సాగింది. ఇంటర్వెల్ ముందు వచ్చే ఆర్మీ ఎటాక్ సన్నివేశాలు
బాగా చిత్రీకరించారు. సెకండ్ హాఫ్ లో మధ్య మధ్యలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్
వాడుకుంటూ కథనం వేగంగా పరిగెత్తించాడు. ముఖ్యంగా పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్
దేశాల్లో చూపించే టెర్రరిస్ట్ సన్నివేశాలు రక్తికట్టాయి. తొలి భాగం చూస్తే
సెకండాఫ్ ఏమిటి? అనే దానిపై ఉత్సుకత పెరిగేలా కథ నడిపించాడు. సెకండ్ హాఫ్
హాలీవుడ్ సినిమాని గుర్తుకుతెచ్చింది.
సాంకేతికవర్గం :సను జాన్ సినిమాటోగ్రఫీ అద్భుతం. మహేష్ నారాయణ్ ఎడిటింగ్ బావుంది. పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ యుద్ధ ప్రాంతాల సెట్స్ ని ఆర్ట్ విభాగం బాగా తీర్చిదిద్దింది. శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం ఓకే. అణు వినాశ, తుపాకి పాటల చిత్రీకరణ బావుంది. అన్ని విభాగాల్లో హై క్వాలిటీ వాల్యూస్ ఉన్నాయి.
ముగింపు :
అష్టకష్టాలు పడి మొత్తానికి కమల్ హాసన్ విశ్వరూపం సందర్శన యోగం కలిగించాడు.
...avnk
No comments:
Post a Comment