Tuesday, 7 May 2013

Simran Makes Her Reentry In Telugu

Simran Makes Her Reentry In Telugu

Simran makes her re-entry in Telugu.png
టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు ఆట కావాలా, పాట కావాలా అంటూ వచ్చి, అవి రెండూ పంచి, తన గ్లామర్ తో అనతి కాలంలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి, కొంతకాలం తన హవా కొనసాగించిన సిమ్రాన్, యువ హీరోయిన్ల నుండి పోటీ తట్టుకోలేక బి గ్రేడ్ హీరోయిన్ గా మారి కమేడియన్ తో సైతం నటించింది. ఆ తరువాత పెళ్ళి చేసుకొని సంపార జీవితం సాగిస్తున్న సిమ్రాన్ కి మళ్లీ వెండితెర పై రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. 

చాలా కాలం నుండి వెండితెరకు దూరంగా ఉంటున్న సిమ్రాన్ ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ సూర్యతో రూపొందించే ‘ద్రువ నక్షం ’ సినిమాలో నటించబోతుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాలో అమ్మడు ఓకీలక పాత్ర పోషించబోతుందట. ఆ పాత్రకు సిమ్రామన్ అయితే బాగుంటుందని భావించిన గౌతమ్ ఆమెను సంప్రదిస్తే.... తమ కుటుంబాల మధ్య రిలేషన్ తో వెంటనే ఒప్పేసుకుందట. ఏది ఏమైనా ప్రేక్షకులు మరచి పోతారనుకుంటున్న సమయంలో మళ్ళీ వెండితెర పై కనిపించబోతున్న సిమ్రాన్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఏ మాత్రం రాణిస్తుందో చూడాలి.

Shilpa Shetty And Son Viaan On Magazine Cover

Shilpa Shetty and son Viaan on mag cover.png
బాలీవుడ్ లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల సుందరి శిల్పాశెట్టి సంపార జీవితంలో అడుగు పెట్టి ఓ బాబుకు జన్మనిచ్చి, మాత్రుత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాధిస్తుంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన రాజ్ కుంద్రాను వివాహం ఆడిన ఈ అమ్మడు పెళ్లి తరువాత నుండి వెండితెరకు దూరం అయింది. వెండితెర కు దూరం అయిన తన అందాలను మాత్రం దాచుకోవడం లేదు. 

శిల్పాశిట్టి అభిమానులను నిరాశ పరచకుండా అందాలను ఆరబోసి విందు చేస్తోంది. కేవలం బిజినెస్ చూసుకుంటున్న శిల్పా తన అందాలకు ఇంకాస్త మెరుగులు దిద్ది ఇటీవలే ఓ మేగజైన్ కి కొడుకుతో కలిసి హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చింది. మీరు పైన చూస్తున్న ఫోటోలో ఆంటీ అందాలు వెరీ హాట్ గా ఉన్నాయి కదా.  ఈ ఫోటోలు చూసిన జనాలు మాత్రం ఆంటీలో ఇంకా ఆ అందాల కసి తగ్గలేని ఫోటోను చూస్తూ సొల్లు కార్చుస్తున్నారు.

Nagarjuna To Act In K Vishwanath Direction

Nagarjuna To Act In K Vishwanath Direction

Nagarjuna to act in K.Vishwanath direction.png

టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకొని, కళా తపస్వి బిరుదు పొందిన దర్శకుడు, నటుడు విశ్వనాథ్ త్వరలో యువ సామ్రాట్ నాగార్జునతో ఓ సినిమా తీయబోతున్నాడా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. తన దర్శత్వ ప్రతిభ ఎన్నో మంచి చిత్రాలను అందించి, జాతీయ పురస్కాలు అందుకున్న ఆయన గత కొంత కాలం నుండి మెగా ఫోన్ పట్టడం లేదు. ఆ మధ్యన హీరో అల్లరి నరేష్ తో ‘శుభప్రదం ’ అనే సినిమా తీశాడు. ఇక తాజాగా ఆయన నాగార్జునతో ఓ సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

గతంలో వజ్రం సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుండే వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ సాన్నిహిత్యంతోనే ‘గ్రీకు వీరుడు ’ వీరుడు షూటింగ్ టైంలో వీరిద్దరి మధ్య ఓ సినిమా కథ ప్రస్థావనకు వచ్చిందట. కథ విన్న వెంటనే నాగ్ బాగా నచ్చడంతో ఈ సినిమాలో నేను నటించడానికి సిద్దం అని చెప్పడంతో విశ్వనాథ్ ఆ పనుల్లో నిమగ్నం అయ్యాడట. ఇక నాగ్ కూడా ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుల తరువాత ఈ సినిమాలో నటించనున్నాడట. తొలిసారి విశ్వనాథ్ దర్శకత్వంలో నాగ్ నటించబోతున్నాడనే వార్త రాగానే సినిమా ఇండస్ట్రీలో చాలా ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని అప్పుడే చర్చలు ప్రారంభించారట.

YVS Chowdary To Direct Jr NTR

YVS Chowdary To Direct Jr NTR


YVS Chowdary to Direct Jr Ntr.png

     టాలీవుడ్ లో ఒకప్పుడు మంచి సినిమాలను అందించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వైవిఎస్ చౌదరి గత కొంత కాలం నుండి దర్శకత్వం వహిస్తున్న సినిమాలు హిట్ కాకపోవడంతో ఈయన పేరు కాస్త అడుగున పడిపోయింది. దర్శక, నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఈయన తాజాగా చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో ‘రేయ్ ’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మొదలై చాలా రోజులు అయినా ఇంత వరకు విడుదలకు నోచుకోలేదు. ఇక ఈయన తాజాగా ఓ సంచలన ప్రకటన చేశాడు. 
 
ఈయన గతంలో తీసిన ‘లాహిరి లాహిరి లాహిరిలో ’, ‘సీతయ్య ’ వంటి హిట్ చిత్రాలకు సీక్వెల్స్ గా  'కృష్ణా ముకుందా మురారి', 'ఎవరి మాటా వినడు' అనే పేర్లతో తెరకెక్కిస్తానని చెప్పాడు. గతంలో ఈ సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరిక్రిష్ణ నటించాడు. మరి ఈ సీక్వెల్స్ లో ఎవరు నటిస్తారనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. కానీ సినిమా జనాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో హరిక్రిష్ణ నటించలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి, ఆయస స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ని పెట్టి తీస్తాడని అంటున్నారు. మొదటి నుండి ఎన్టీఆర్ కి వీరాభిమాని అయిన వైవీఎస్ ఆయన కుటుంబానికి చెందిన వ్యక్తులతో ఈ సినిమాల్ని తెరకెక్కిస్తాడని అంటున్నారు. మరి మన బుడ్డోడు వైవీఎస్ కి ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి.

Nag Venky Balayya Best Time To Retire

Nag Venky Balayya Best Time To Retire

nag-venky-balayya best time to retire.png

తెలుగు సినిమా ఇండస్ట్రీని ఓ రెండు దశాబ్దాల పాటు ఏలి స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలక్రిష్ణలు ప్రేక్షకులను అలరించి మెప్పించారు. మెప్పిస్తూనే ఉన్నారు. అయితే వీరిలో చిరంజీవి ఇప్పటికే సినిమాలకు దూరం అయ్యాడు. ఇక మిగిలిన వారు సినిమాలు తీస్తూ ఉన్నా, పాత తరం హీరోలు అయిన వీరు ఇప్పటి తరం వారిని మెప్పించలేక పోతున్నారు. యువ హీరోలతో పాటు పోటీ పడుతూ సినిమా తీస్తున్నా, వారు యూత్ ని ఉర్రూతలు ఊగించలేకపోతున్నారు. వీటికి నిదర్శనం ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలే. బాలక్రిష్ణ ‘సింహా ’ తరువాత సినిమాలు ప్లాపు కావడంతో ఆయన దూకుడును తగ్గించాడు. ఇక నాగార్జున తీస్తున్న సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో ఆయన సినిమాలకు ఆదరణ అంతగా లేదు. 

ఇక వెంకీ ఈ మధ్య నటించిన ‘షాడో ’ ప్రేక్షకుల కలలోకి కూడా వచ్చే విధంగా ఉండటంతో బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. దీంతో మనోళ్ళు ఇంకా హీరోలుగా కొనసాగకుండా రిటైర్‌ అయితే కొత్త వారికి అవకాశం అన్నా వస్తుంది, లేకుంటే మల్టీస్టారర్ సినిమాల్లోనో, తాత తండ్రుల క్యారెక్టర్లు వేసుకుంటే ఇంకా బాగుంటుందని కొంత మంది సలహాలు ఇస్తున్నారు. జనాల్లో ఇంతో అంతో క్రేజ్ ఉన్నప్పుడే గౌరవంగా తప్పుకుంటారో, లేక మరికొన్ని సినిమాల్లో నటించి జనాల్ని విసిగిస్తారో చూద్దాం.

Friday, 3 May 2013

Ram Charan Cannes Film Festival

Ram Charan Cannes Film Festival.png

సుడి తిరిగితే... రాత్రి రాత్రే పెద్ద స్టార్లు కావచ్చు... ఇంకేదైనా కావచ్చు. ఇప్పుడు అచ్చం అలాగే జరిగింది. రామ్ చరణ్ తేజ్ తొలిసారిగా బాలీవుడ్ లో నటిస్తున్న ‘జంజీర్ ’ చిత్రం త్వరలో జరగబోయే విఖ్యాత కేన్స్ చిత్రోత్సవంలో ప్రదర్శించడానికి నిర్మాతలు ఉవ్విళ్ళూరుతున్నారు. అలాగే అందులో మన రామ్ చరణ్ తేజ్ కూడా ఎర్ర తివాచీ పై నడవబోతున్నాడని సినిమా వర్గాల సమాచారం. ఈ సినిమా క్షణంలో మొదలు పెట్టారో కానీ అన్ని అవాంతరాలే ఏర్పడుతున్నాయి. అయినా కానీ నిర్మాతలు పబ్లిసిటీ విషయంలో రాజీపడటం లేదు.

మొత్తానికి చరణ్ కేన్స్ చిత్రంలో సందడి చేయనున్నాడన్న మాట. ఇక ఇదే కేన్స్ చిత్రోత్సంలో ప్రముఖ నిర్మాత అయిన అశ్వినిదత్ కుమార్తె ప్రియాంక దత్ కూడా ఈ ఫెస్టివెకు హాజరు కాబోతుంది. తాను నిర్మించిన లఘుచిత్రం 'యాదోంకీ బారత్' కూడా ఈ  ఉత్సవానికి ఎంపికైంది. దీంతో ఈ అమ్మడు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలాగే సారి కేన్స్ లో మన భారతీయ సెలబ్రెటీలు విద్యాదాలన్, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఇలా చాలా మందే  సందడి చేయనున్నారు. ఇక చరణ్ కేన్స్ కు వెళుతున్నాడన్న వార్త విని మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Hari Priya Playing Prostitute Role

Hari Priya Playing Prostitute Role

Hari Priya playing the role of prostitute.png

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే హీరోయిన్ల సంఖ్య రోజు రోజుకి ఎక్కువడంతో వారి నుండి వచ్చే పోటీని తట్టుకోవడానికి ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు ఎలాంటి పాత్రలు అయినా చేయడానికి వెనకాడటం లేదు. స్టార్ హీరోయిన్లు సైతం వేశ్య పాత్రలు వేస్తూ వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పటికే టాలీవుడ్ లో ఒకప్పుడు వెలుగు వెలిగిన శ్రేయ, ఛార్మి, వేద లాంటి వారు వేశ్య పాత్రలు చేస్తున్నారు. త్వరలో వీరు నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక వీరికి పోటీగా మరో నాయిక వచ్చింది. తెలుగులో నాని సరసన ‘పిల్ల జమిందార్ ’ సినిమాలో హీరోయిన్ గా చేసి మంచి పేరు తెచ్చుకున్న హరిప్రియ వేశ్య పాత్రలో నటిస్తుంది. ఈమె ‘అబ్బాయి క్లాస్-అమ్మాయి మాస్ ’ అనే సినిమాలో ఆ క్యారెక్టర్ చేస్తుంది. హీరో జీవితంలోకి ఓ వేశ్య ఎందుకు ప్రవేశించిందన్న అంశంపై సినిమా కథాంశం ఉంటుంది.   మరి ఈ అమ్మడు ఇప్పుడున్న వేశ్యలకు ఏ మాత్రం పోటీనిస్తుందో చూడాలి.










Senior Anchors Fire On Hot Anchor Anusuya


Senior Anchors Fire On Hot Anchor Anusuya

anchor-anusuya.gif

బుల్లితెర మీద హల్ చల్ చేస్తున్న యాంకర్ అనుసుయా. యాంకర్ గా అనుభవం తక్కుగా ఉన్నప్పటికి .. బుల్లితెర ప్రేక్షకుల మనసు దోసుకుంది. పెళ్లై ఒక బాబు ఉన్నప్పటికి హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. జబర్ద్ స్త్ కామెడీ షో లో.. జబ్బలు చూపిస్తూ, జడ్జీగా ఉన్న సినీ నటి రోజకే కన్నుకుట్టే విధంగా.. కురచ దస్తులు ధరించి, నటుడు నాగాబాబుకు, కామెడీయన్ నటులకు హీటు పెంచుతుందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కామెడీ చేసే నటులు వేణు, ధనురాజ్, చంద్ర, చంటి, రఘు, రఘవా, లు కూడా .. అనుసుయానే టార్గెట్ చేసుకోని.. సెక్సీ జోకులు పేల్చుతున్నారు. మధ్య మద్యలో ..నాగబాబుకు , రోజాకు, అనుసుయాలకు సెక్సీ మసాల దట్టించటంతో.. వారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వారానికి ఒకసారే.. అనుసుయా అందాలు కనిపించటంతో.. బుల్లితెర ప్రేక్షకులు .. రెండో వారం జరిగే కామెడీ షో కోసం ఎదురుచూస్తున్నారు



అంతమంది కామెడీ నటులు.. ఒకేచోట కామెడీ చెయ్యటం, ప్రతి వారం కొత్త కొత్త గెటప్ లతో, కొత్త సన్నివేశాలతో, జోకులు చెప్పటం చాలా ఆనందంగా, హాయిగా, ఉంటుంది. జబర్దస్త్ కామెడీ షో బుల్లితెర ప్రేక్షకులకు నవ్వుల టానిక్ లా పనిచేస్తుంది. నాగబాబు , రోజాల జడ్జీమెంట్ నుకూడా బుల్లితెర ప్రేక్షకులు ఆధరిస్తున్నారు. అయితే అనుసుయా , ఇప్పుడు హాట్ యాంకర్ గా మారిపోయింది. అనుసుయా చేసే సెక్సీ కవ్వింపు చర్యలకు.. ఇష్టపడి.. మరోఛానల్స్ బిందాస్ అనే పోగ్రామ్ కు యాంకర్ గా తీసుకుంది. అయితే అక్కడ కూడా అనుసుయా కొంచెం ఘాటు మసాల దట్టించింది. జబర్దస్త్ లో ఓన్లీ జబ్బలు, స్లీవ్ లెస్స్ వరకు చూపిస్తే.. బిందాస్ లోమాత్రం తన నడమును , నాభి అందాలను ఎరగా వేసి డ్యాన్స్ చెయ్యటంతో అనుసుయాకు అభిమానులు సంఖ్య పెరిగిపోయారు

ఇప్పుడు ఈ హాట్ యాంకర్స్ ఫైర్ అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు బుల్లితెర మీద సాంప్రదాయమైన పద్దతిలోనే యాంకర్స్ నడుసుకున్నారు. అనుసుయా మాదిరి హాట్ ఎక్కడ ప్రవర్తించలేదు. ఈ పోకడతో.. యాంకర్స్ లో కొత్త అలజడి మొదలైంది. ఒకరిని చూసి మరోకరు కురచ దుస్తులు, ధరించి, సెక్సీ డ్రెస్సెలతో.. బుల్లితెరపై రెచ్చిపోతే.. కొన్ని రోజులకు.. యాంకర్స్ హాట్ అందాలు అంటూ., బికినీతో యాంకరింగ్ చేసిన ఆశ్చర్యం లేదని .. తొటి యాంకర్స్ అనుసుయా మీద అసుయా పడుతున్నారు. యాంకర్స్ మాటలు పట్టించుకొని అనుసుయా మాత్రం తన దారిలోనే.. బుల్లితెరపై హల్ చల్ చేస్తుంది. అనుసుయాను కట్టాడి చెయ్యకపోతే.. తెలుగు యాంకర్ల పరువు గంగలో కలిసిపోతుందని భావించి, బుల్లితెర seniorయాంకర్లు అందరు కలిసి అనుసుయా మీద ఫిర్యాదు చెయ్యటానికి సిద్దమైనట్లు బుల్లితెర సమాచారం



Greeku Veerudu Movie Review


Greeku Veerudu Movie Review


Movie Reviews
గ్రీకు వీరుడు
 - 2.75/5 - 2.75/5
గ్రీకు వీరుడు
గ్రీకు వీరుడు
Movie Reviews
  • చిత్రం
    గ్రీకువీరుడు
  • బ్యానర్
    కామాక్షి మూవీస్
  • దర్శకుడు
    దశరథ్
  • నిర్మాత
    డి. శివప్రసాద్ రెడ్డి
  • సంగీతం
    తమన్
  • సినిమా రేటింగ్
     - 2.75/5 - 2.75/5  2.75/5
  • ఛాయాగ్రహణం
    అనిల్ బండారి
  • ఎడిటర్
    మార్తాండ్ కె. వెంకటేష్
  • విడుదల తేది
    మే 3, 2013
  • నటినటులు
    నాగార్జున, నయనతార, కె. విశ్వనాథ్, మీరా చోప్రా, తదితరులు
Cinema Story
చందు (నాగార్జున) అమెరికాలో ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థను నిర్వహిస్తుంటాడు . ప్రేమ,పెళ్లి వంటి విషయాలపై నమ్మకాల్లేని వ్యక్తి. ప్రతి విషయంలోనూ వ్యాపారాత్మకంగా ఆలోచించడం అతని నైజం. తొందరగా బంధాలను తెంచేసుకుంటాడు. అతను చేసే బిజినెస్ లో ఓ సమస్య రావటంతో డబ్బుకోసం ఇండియాకు తొలిసారి వస్తాడు. ఇండియాలో అడుగుపెట్టగానే ఎయిర్ పోర్ట్ లోనే సంధ్య (నయనతార) పరిచయమవుతుంది. ఆ కేసు నుండి తప్పించుకోవడానికి సంధ్య తో పెళ్లి నాటకం ఆడుతాడు. సంధ్య కూడా చందుకు వచ్చిన సమస్య కోసం ఈ పెళ్ళికి ఒప్పుకుని అతని భార్యగా నటిస్తుంది. అయితే బంధాల గురించి ఏ మాత్రం కేర్ చేయని చందులో మార్పు ఎలా వచ్చిందనేది తెర పై చూడాల్సిందే.
pothe
గ్రీకు వీరుడు ఐదు పదులు దాటినా ఇంకా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్న నాగార్జున, కుమారులు ప్రేమకథా చిత్రాల్లో నటిస్తున్న టైంలో కూడా తానేమి తక్కువ తిన్నాననుకొని తాను కూడా ప్రేమకథా చిత్రంలో నటించాడు. అదే గ్రీకువీరుడు సినిమా. నాగార్జున, ధశరథ్ కాంబినేషన్ రిపీట్ కావటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమౌవుతున్న నాగార్జున ‘గ్రీకు వీరుడు ’గా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉందో ఓసారి రివ్యూ చూద్దాం.
ఈ సినిమాని దర్శకుడు ఫ్యామిలీ ఆడియన్స్ ని ద్రుష్టిలో పెట్టుకొని తీశాడు. ఇందులో బంధాలు, వాటికి ఉండే విలువల గురించి చెప్పాడు. ఈ కాలం వారికి బంధాల విలువలు తెలియజెప్పే ప్రత్నం చేశాడు. ఇందులో మూడు తరాలకు సంబంధించిన బంధుత్వాలు, వాటి విలువలు, వాటికి విలువ ఇవ్వకపోతే ఏం కోల్పాయాం అన్నది స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఈ జనరేషన్ కి చెందిన యూత్ కి ఈ స్టోరీ అంతగా రుచించక పోవచ్చు. సినిమాలో కామెడీ పెద్దగా పండక పోయినా సెంటిమెంట్లు కాస్త పండాయి.  చిన్న చిన్న సెంటిమెంట్లు వర్కవుట్ అయ్యాయి. కాల్చుకోవడాలు... నరుక్కోవడాలు ...ఛేజింగ్ లు లాంటి అతిశయోక్తులు లేకుండా సినిమా చక్కగా సాగుతుంది. కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే ఈ సినిమాని యూత్ కూడా ఆదరిస్తేనే ఓ రెండు వారాలు నిలవగలుగుతుంది. మొత్తంగా చూస్తే సినిమా ఓకే అనిపిస్తుంది కానీ అంతగా ఆకట్టుకునే సినిమా మాత్రం కాదు.
Cinema Review
ఈ సినిమాలో గ్రీకువీరుడిగానటించిన నాగార్జున ఇంతకు మందే మన్మధుడు బిరుదు ఉంది. కాబట్టి గ్రీకువీరుడిగా నాగార్జున నటన ఫర్వాలేదనిపిస్తుంది. కానీ వయస్సు ఫైబడినట్లు మాత్రం కొట్టచ్చినట్లు కనిపిస్తుంది. ఇందులో గ్రీకువీరుడికి ఉండాల్సిన గ్లామర్ లా నాగార్జున గ్లామర్ కనిపించలేదు. ఇక నయనతార పాత్ర అంత పెద్దగా లీనమై నటించేంతగా లేదు. కానీ ఆమె మేరకు అలా సోసోగా నటించింది. ఇందులో నటించిన మీరా చోప్రా పాత్ర కొద్దిసేపే అయినా ఫర్వాలేదనిపిస్తుంది. ఇక నాగార్జున తాత గా నటించిన విశ్వనాధ్ తనదైన తరహాలో నటించాడు.  యం.యస్. నారాయణ, బ్రహ్మానందం లు రొటీన్ పాత్రలు పోషించినా, కాస్త నవ్వులు కురిపించారు. కోటశ్రీనివాసరావు ఉన్నా కూడా రెండు సీన్లలో మాత్రమే కనిపిస్తాడు. మిగిలిన పాత్రలు చేసిన వారు వారి వారి శక్తి మేరకు నటించారు. వారి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.

‘సంతోషం ’ సినిమా తీసిన ఇన్నాళ్ళకు మళ్ళీ నాగార్జున తో సినిమా చేసిన ధశరథ్ ఈ వయస్సులో నాగ్ ని అలా చూపించడంలో సఫలం అయ్యాడనే చెప్పవచ్చు. గతంలో ప్రేమకథా చిత్రాలను హ్యాండిల్ చేసిన ఈయన అదే తరహాలో సినిమాను చేశాడు. సెంటిమెంటు సీన్స్ తనదైన శైలిలో పండించే దశరథ్ ఇందులో కూడా బాగానే పండించాడు. ఇక ఈ సినిమాతో రైటర్ గా మారిన ఈయన తనదైన శైలిలో సంభాషణలు రాశాడు. రైటర్ గా కూడా తన పనికొస్తానని నిరూపించుకున్నాడు. ఈ సినిమాకు ఫాస్ట్ బీట్స్ అందించే తమన్ మెలోడీ సాంగ్స్ ని కంపోజ్ చేసి ఫర్వాలేదనిపించాడు. నేపథ్య సంగీతంతో పాటు, సెంటిమెంట్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా అందించాడు. ఈ సినిమాకు ముఖ్యమైన డ్రా బ్యాక్ ఏంటంటే... సినిమాటో గ్రఫీ. సన్నివేశాని తగ్గట్లు మంచి మంచి లొకేషన్లలో చిత్రీకరించలేదు. ఎక్కుబాగం గ్రాఫిక్స్ తో సరిపెట్టారు. కానీ అవి ఎబ్బెట్టుగా ఉన్నాయి. బడ్జెట్ బాగా పెడితే సినిమాకు లాస్ వస్తుందనుకున్నారో ఏమో కానీ క్వాలిటీ విషయంలో వెనక్కి తగ్గడంతో అవుట్ పుట్ అంతగా రాలేదు. నాగార్జున సినిమాను కూడా ఓ చిన్న బడ్జెట్ సినిమాలాగా తీసి పని పూర్తి చేశారు.

chivaraga
ఫ్యామిలీ ఆడియన్స్ ఆకట్టుకొని, యూత్ ని ఆకట్టుకోలేని ‘గ్రీకువీరుడు ’.
[youtube=http://www.youtube.com/watch?feature=player_embedded&v=cEPbouuFrnE]

Stills from Greeku Veerudu:

  • Greeku Veerudu
  • Greeku Veerudu
  • Greeku Veerudu
  • Greeku Veerudu
  • Greeku Veerudu
  • Greeku Veerudu
  • Greeku Veerudu
  • Greeku Veerudu
  • Greeku Veerudu
  • Greeku Veerudu
  • Greeku Veerudu


   Greeku Veerudu review Greeku Veerudu movie review Greeku Veerudu movie rating Greeku Veerudu movie talk Greeku Veerudu movie still nagarjuna Greeku Veerudu review nagarjuna nayanatara Greeku Veerudu review Greeku Veerudu movie trailer Greeku Veerudu movie stills Greeku Veerudu movie release Greeku Veerudu movie preview Greeku Veerudu movie review Greeku Veerudu review